Habits to get rich: మీరు ధనవంతులు కావాలంటే ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి-make these habits a part of your life if you want to be rich ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Habits To Get Rich: మీరు ధనవంతులు కావాలంటే ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి

Habits to get rich: మీరు ధనవంతులు కావాలంటే ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి

Haritha Chappa HT Telugu
Aug 09, 2024 05:00 AM IST

Habits to get rich: ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ డబ్బు సంపాదించాలంటే అంత సులువు కాదు, నిజాయితీగా డబ్బులు సంపాదించాలంటే కొన్ని అలవాట్లు ఉండాలి.

ధనవంతుడు అవ్వడానికి కావాల్సిన అలవాట్లు
ధనవంతుడు అవ్వడానికి కావాల్సిన అలవాట్లు (shutterstock)

ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. ప్రతి వ్యక్తి ధనవంతులు కావాలని కోరుకుంటారు. కానీ డబ్బు సంపాదించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. డబ్బున్న వారిని చూస్తే కొన్ని అలవాట్లు కామన్ గా కనిపిస్తాయి. ఈ అలవాట్లు డబ్బు సంపాదించడానికి, ధనవంతులు కావడానికి సహాయపడతాయని అధ్యయనాలు కూడా నిరూపించాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఈ అలవాట్లను మీ ప్రవర్తనలో చేర్చండి.

అదే లక్ష్యం

ధనవంతులు ఎల్లప్పుడూ లక్ష్యాలను సెట్ చేసుకుంటారు. తదనుగుణంగా ప్లాన్ చేస్తారు. ఒక చిన్న ప్రణాళికను సాధించడానికి వారికి వారాలు, నెలలు, సంవత్సరాలు పడుతుంది. 20 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారో లక్ష్యం నిర్ధేశించుకోండి. జీవితంలో ప్రణాళికాబద్ధంగా ఆ లక్ష్యాలను పూర్తి చేస్తూ ప్రయాణం చేయండి.

పొదుపు చేయడం

డబ్బు సంపాదించడానికి ఉత్తమ మార్గం డబ్బును పొదుపు చేయడం. అలాగే దానిని సరైన ప్రదేశంలో పెట్టుబడి పెట్టడం. రోజువారీ ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా పెట్టుబడిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. తద్వారా పేదరికం నుంచి బయటపడవచ్చు.

ఒక ఉద్యోగం వద్దు

ఒక్క ఉద్యోగం ద్వారా ధనవంతులు కావాలనుకుంటే, ఈ ఆలోచన పూర్తిగా తప్పు. 2019 యుఎస్ సెన్సస్ బ్యూరో అధ్యయనం ప్రకారం, అమెరికాలో కేవలం 8.8 శాతం మంది మహిళలు, 8 శాతం మంది పురుషులు మాత్రమే రెండు కంటే ఎక్కువ ఉద్యోగాను చేస్తున్నారు. డబ్బు సంపాదించడానికి కనీసం రెండు మూడు ఆదాయ మార్గాలు ఉండాలి.

మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ అప్ గ్రేడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు నైపుణ్యంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. కొత్త టెక్నాలజీ, మీ రంగంలో కొత్త పని, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. నైపుణ్యం ఉంటే డబ్బు సంపాదించడం సులభంగా మారుతుంది.

విష సంబంధాలకు దూరంగా ఉండండి

ఆరోగ్యం సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించే వ్యక్తులకు దూరంగా ఉండండి. అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటే మీరు ధనవంతులు కావడం కాదు కదా, పొదుపు చేయడం కూడా కష్టంగానే మారుతుంది.

మీరు బడ్జెట్ వేసుకుని దానికి అనుగుణంగా జీవించాల్సి వస్తుంది. మీ ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాలి. మీరు నెలవారీ బడ్జెట్ ను సెట్ చేసుకోవాలి. అది దాటి ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి. మీ కోరికలను కూడా అదుపులో పెట్టుకోవాలి. డబ్బులు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పుడు ఆ ఖర్చు మీకు అవసరమో లేదో రెండూ మూడు సార్లు ఆలోచించి ఖర్చు చేయండి.

Whats_app_banner