BabyNames with A: అ అక్షరంతో మొదలయ్యే చక్కటి పిల్లల పేర్ల గురించి వెతుకుతున్నారా? ఇవిగో అర్థవంతమైన, అందమైన పేర్లు-looking for cool baby names that start with the letter a here are some meaningful and beautiful names ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Babynames With A: అ అక్షరంతో మొదలయ్యే చక్కటి పిల్లల పేర్ల గురించి వెతుకుతున్నారా? ఇవిగో అర్థవంతమైన, అందమైన పేర్లు

BabyNames with A: అ అక్షరంతో మొదలయ్యే చక్కటి పిల్లల పేర్ల గురించి వెతుకుతున్నారా? ఇవిగో అర్థవంతమైన, అందమైన పేర్లు

Haritha Chappa HT Telugu
Sep 19, 2024 02:00 PM IST

BabyNames with A: బిడ్డ పుట్టినప్పుడు కలిగే సంతోషం ఇంత అంతా కాదు. వారికి జీవితాంతం గుర్తింపుని ఇచ్చే పేరును కూడా తల్లిదండ్రులు కష్టపడి వెతుకుతూ ఉంటారు. అలాంటి వారికోసం ఇక్కడ మేము కొన్ని పేర్లు ఇచ్చాము. ఇవన్నీ అ, ఆ అక్షరంతో మొదలయ్యేవి.

అ అక్షరంతో బేబీ నేమ్స్
అ అక్షరంతో బేబీ నేమ్స్ (Pexel)

BabyNames with A: అ లేదా ఆ అక్షరంతో మొదలయ్యే పేర్లు ఏవైనా కూడా ఆంగ్ల అక్షరం A తోనే మొదలవుతాయి. అవన్నీ కూడా భవిష్యత్తులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో చూసుకుంటే మొదటి స్థానంలోనే ఉంటాయి. అందుకే ఎక్కువ మంది ‘అ’ అక్షరంతో మొదలయ్యే పేర్ల గురించి వెతుకుతారు. ఇక్కడ మేము మగ పిల్లల పేర్లు, ఆడపిల్లల పేర్లు రెండు అ అక్షరంతో మొదలయ్యేవి ఇచ్చాము. ఇవి అర్థమంతమైనవి కూడా. వాటి అర్థాలను కూడా పక్కనే ఇచ్చాము. మీ చిట్టి పాపకు లేదా బుజ్జి బాబుకు మీకు నచ్చిన అర్థవంతమైన పేర్లను ఎంచుకోండి. ఇవన్నీ కూడా హిందూ పేర్లే.

అ అక్షరంతో మొదలయ్యే అబ్బాయి పేర్లు

ఆదవ్ - సూర్యుడు, ప్రకాశవంతమైన

ఆదిదేవ్ - మహాశివుడు

ఆహాన్ - సూర్యోదయం

ఆరవ్ - జ్ఞానం, శాంతియుతమైన వ్యక్తి

అద్వైత్ - విశిష్టమైన

అద్విక్ - సృజనాత్మకత, ఏకైక

అన్ష్ - ఒక భాగం

అసవ్ - సారాంశం

అయాన్ - అదృష్టం

అన్వయ్ - ఏకం కావడం

అహిల్ - యువరాజు

అధర్వ్ - మొదటి వేదం, వినాయకుడు

అవిక్ - ధైర్యవంతుడు

ఆశిష్ - ఆశీర్వాదం

అ అక్షరంతో మొదలయ్యే అమ్మాయి పేర్లు

అముద - అమృతం వంటి మధురమైనది

అర్పిత - అంకితం చేయడం

ఆప్తి - పూర్తి చేయడం

ఆవ్య - భగవంతుని వరము, సూర్యుడి మొదటి కిరణాలు

అభిజ్ఞా - జ్ఞానము కల వ్యక్తి, అందమైన వ్యక్తి

అర్కిత - సంతృప్తి ,సమృద్ధిగా

ఆషిత - ప్రియమైన

అల్పన - అందమైన, అలంకరణ

అమిత - కొలవలేనంత, శాశ్వతమైన

అనీక్ష - సంతోషాన్ని ఇచ్చేది

అంజుల - హృదయంలో నిండే వ్యక్తి

ఆర్నవి - సముద్రమంతా పెద్ద హృదయం కల వ్యక్తి

అశ్వి - ఆత్మగౌరవంతో ఉన్న వ్యక్తి, సూర్యుని వలే ప్రకాశమంతమైనది

అనురాగిణి - ప్రియమైన వ్యక్తి

అజిత - అపజయం లేని వ్యక్తి

అనూజ - స్వచ్ఛమైన హృదయం కల వ్యక్తి

ఆత్మిక - భగవంతుడిని వచ్చే కాంతి

అమేయ - మహోన్నతమైనది హద్దులు లేనిది

అసిరా - వేగవంతమైనది

అభిష - తోడుగా ఉండేది

అహంతి - నాశనం లేనిది

ఆరాధిత - నిత్యం కొలిచే వ్యక్తి

ఆకాషిని - అందమైన జుట్టు గల స్త్రీ

అనింద - పరిపూర్ణమైన వ్యక్తి నిందలు లేని వ్యక్తి

అరుణిమ - తెల్లవారుజామున కనిపించే ఎర్రటి కాంతి

అభిజిత - విజయవంతమైన స్త్రీ