Ragi Dosa | ఇది శక్తివంతమైన అల్పాహారం.. రాగి దోశ ఎంతో ఆరోగ్యకరం!-looking for a healthy breakfast here is ragi dosa recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Looking For A Healthy Breakfast, Here Is Ragi Dosa Recipe

Ragi Dosa | ఇది శక్తివంతమైన అల్పాహారం.. రాగి దోశ ఎంతో ఆరోగ్యకరం!

HT Telugu Desk HT Telugu
Jul 17, 2022 08:51 AM IST

దోశ చాలామందికి ఇష్టమైన అల్పాహారం. ఈ దోశల్లో మనకు ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అయితే కాల్షియం, కాబోహైడ్రేట్లతో నిండిన రాగి దోశ ఎంతో ఆరోగ్యకరమైనది. దీని రెసిపీ ఇక్కడ చూడండి.

Ragi Dosa
Ragi Dosa (slurrp)

మనకు ఎన్ని రకాల అల్పాహారాలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఆప్షన్లుగా ఉన్నప్పటికీ, సౌత్- ఇండియన్ ఫేమస్ వంటకమైన దోశ చాలా మందికి ఫేవరెట్. ఈ దోశలో కూడా ఎన్నో రకాల వెరైటీలు అందుబాటులో ఉంటాయి. అయితే మీరు ఆరోగ్య స్పృహను కలిగి ఉన్నవారైతే మీకు మీకు రాగి దోశం మంచి బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పవచ్చు. రాగిలో మంచి కార్బోహైడ్రేట్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. రాగి ధాన్యాలు చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని పాలిష్ చేయడానికి వీలుపడదు. రాగులను స్వచ్ఛమైన రూపంలో ఎక్కువగా వినియోగిస్తారు. కాబట్టి ఏ రూపంలో తీసుకున్నా ఎంతో ఆరోగ్యకరం.

ఇక రాగి దోశ చూడటానికి మంచి రంగులో ఉంటుంది. ఇది రవ్వ దోశను పోలి ఉంటుంది. నిజానికి రాగి పిండిలో కూడా కొంత రవ్వను కలిపి చేస్తే రుచికరంగా ఉంటుంది. మరి రాగి దోశ తయారు చేయటానికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేయాలో రెసిపీ చూడండి.

కావాల్సిన పదార్థాలు

  • 1 కప్పు రాగి పిండి
  • 1 కప్పు రవ్వ
  • 1/2 కప్పు బియ్యం పిండి
  • 1/2 కప్పు పెరుగు
  • 1 అంగుళం అల్లం (సన్నగా తరిగినది)
  • 1 పచ్చిమిర్చి
  • 1 ఉల్లిపాయ
  • 1 tsp జీలకర్ర
  • 1/2 స్పూన్ మిరియాలు (తరిగిన)
  • 1 స్పూన్ ఉప్పు
  • కరివేపాకు
  • కొత్తిమీర
  • 3 కప్పుల నీరు
  • వేయించడానికి సరిపడా నూనె

తయారీ విధానం

  1. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ గిన్నెలో రాగి పిండి, రవ్వ, బియ్యం పిండిని తీసుకొని కలపండి.
  2. అందులో పెరుగు, సన్నగా నూరిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి.
  3. పైన చేసిన మిశ్రమం మంచి బ్యాటర్ అయ్యేటట్లుగా కొన్ని నీళ్లు కూడా కలుపుకోండి. దీనిని ఒక 20 నిమిషాలు పక్కనపెట్టండి.
  4. ఇప్పుడు తవా వేడి చేసి, 1 tsp నూనె చల్లుకొని సిద్ధం చేసుకున్న రాగి దోశ పిండితో దోశలు పోసుకోండి.
  5. దోశ బంగారు గోధుమ రంగులోకి మారిన తర్వాత, మరోవైపు తిప్పుకొని కాల్చండి.

అంతే.. దోశను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పుదీనా చట్నీతో లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్