Cheese Sandwiches । సాయంత్రం స్నాక్స్‌గా చీజ్ శాండ్‌విచ్‌లు.. ఈజీగా చేసేయండి ఇలా!
Cheese Sandwich Recipes: మీరు చీజ్ ఇష్టపడే వారైతే, రుచికరమైన చీజ్ శాండ్‌విచ్‌లను ఎలా చేయవచ్చో తెలుసుకోండి. ప్రముఖ చెఫ్ రెసిపీలు ఇక్కడ ఉన్నాయి.
Sandwich Recipes (stock pik)
Sandwich Recipes: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైనా, సాయంత్రం స్నాక్స్‌గా తినడానికైనా శాండ్‌విచ్‌లు బెస్ట్ ఛాయిస్ అనిపించేలా ఉంటాయి. శాండ్‌విచ్‌లను మీ అభిరుచికి అనుగుణంగా ఎలా కావాలంటే అలా రూపొందించుకోవచ్చు. శాండ్‌విచ్ చేయడం కూడా చాలా సులభం, ఎవరైనా ఎప్పుడైనా క్షణాల్లో సిద్ధం చేసుకోవచ్చు. వెళ్తూ వెళ్తూ కూడా తినవచ్చు.
మీరు చీజ్ ఇష్టపడే వారైతే, రుచికరమైన చీజ్ శాండ్‌విచ్‌లను ఎలా చేయవచ్చో అశోక్ హోటల్స్ లోని ఎగ్జిక్యూటివ్ చెఫ్ అయిన అరవింద్ రాయ్ 2 సులభమైన రెసిపీలను అందించారు. వీటిని మీరు ఇంట్లోనే ప్రయత్నించవచ్చు. ఆ రెసిపీలు ఏమిటో చూసేయండి మరి.
Chutney Chicken Cheese Grilled Sandwich Recipe కోసం కావలసినవి
- 2 బోన్ లెస్ చికెన్ బ్రెస్ట్‌లు
- 2 బ్రెడ్ ముక్కలు
- 4 టేబుల్ స్పూన్లు పుదీనా చట్నీ
- 1 చీజ్ స్లైస్
- రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి
- గ్రిల్లింగ్ కోసం వెన్న
చికెన్ చీజ్ శాండ్‌విచ్ తయారీ విధానం
- మీడియం వేడి మీద మీ గ్రిల్‌ను ముందుగా వేడి చేయండి.
- చికెన్ బ్రెస్ట్‌పై రెండు వైపులా ఉప్పు, మిరియాల పొడితో సీజనింగ్ చేయండి.
- ఆపై చికెన్ బ్రెస్ట్‌లను గ్రిల్‌పై ఒక్కో వైపు 6-8 నిమిషాలు ఉడికించాలి, అనంతరం చికెన్ బ్రెస్ట్‌లను సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి.
- రెండు బ్రెడ్ స్లైసులను తీసుకుని ఒక్కో స్లైస్‌పై 1 టేబుల్ స్పూన్ చట్నీని అద్దండి, ఒకదానిపై చట్నీ పైన చికెన్ ముక్కలను ఉంచండి. చికెన్ పైన చీజ్ స్లైస్ ఉంచండి, ఇప్పుడు దీనిని మరొక బ్రెడ్ స్లైస్‌తో కప్పిఉంచండి.
- మీడియం వేడి మీద గ్రిడ్‌ను వేడి చేయండి. అంటుకోకుండా కొద్దిగా వెన్నని వర్తించండి.
- శాండ్‌విచ్‌ను గ్రిల్‌పై ఉంచండి, రెండు వైపులా సుమారు 2-3 నిమిషాలు కాల్చాలి. బ్రెడ్ బంగారు గోధుమ రంగులోకి మారే వరకు, జున్ను కరిగే వరకు గ్రిల్ చేయండి.
- అనంతరం పాన్ నుండి శాండ్‌విచ్‌ను తీసి, రెండు భాగాలుగా కట్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయండి.
Spinach Cheese Sandwich Recipe కోసం కావలసినవి
- 2 బ్రెడ్ ముక్కలు
- 1 కప్పు తాజా పాలకూర ఆకులు, కడిగి, తరిగినవి
- 1/4 కప్పు తురిమిన చీజ్
- 1/4 ఉల్లిపాయ
- 1 వెల్లుల్లి
- 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె
- రుచికి ఉప్పు, మిరియాలు
స్పినాచ్ చీజ్ శాండ్‌విచ్ తయారీ విధానం
- మీడియం వేడి మీద ఒక స్కిల్లెట్‌లో ఆలివ్ నూనె లేదా వెన్నని వేడి చేయండి.
- వేడయ్యాక చిన్నగా తరిగిన వెల్లుల్లిని వేసి, సువాసన వచ్చేవరకు వేయించాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
- అనంతరం తరిగిన పాలకూర ఆకులను స్కిల్లెట్‌లో వేసి 2-3 నిమిషాలు ఉడికించాలి, రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడిని చల్లుకొని వేడి నుంచి తొలగించండి.
- ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దానిపై తురిమిన చీజ్‌లో సగం ఉంచండి. ఆపై చీజ్‌పై వేయించిన పాలకూర మిశ్రమాన్ని చెంచా వేయండి. పాలకూరపై మిగిలిన చీజ్ చల్లుకోండి. ఆపై రెండవ బ్రెడ్ స్లైస్ తీసుకొని కప్పం, మీడియం వేడి మీద గ్రిల్ వేడి చేయండి. జున్ను కరిగిపోయే వరకు ప్రతి వైపు 2-3 నిమిషాలు ఉడికించాలి.
- శాండ్‌విచ్ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత, దానిని గ్రిల్ నుండి తీసివేయండి.
శాండ్‌విచ్‌ను రెండు భాగాలుగా కట్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి.
సంబంధిత కథనం