Mental health in layoffs: జాబ్ పోయిందా.. మీ మానసిక ఆరోగ్యానికి ఈ 6 టిప్స్-know tips for mental health in layoff season here ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Know Tips For Mental Health In Layoff Season Here

Mental health in layoffs: జాబ్ పోయిందా.. మీ మానసిక ఆరోగ్యానికి ఈ 6 టిప్స్

ఉద్యోగం కోల్పోయినప్పుడు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలంటున్న నిపుణులు
ఉద్యోగం కోల్పోయినప్పుడు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలంటున్న నిపుణులు (pexels)

Mental health in layoffs: జాబ్ కోల్పోయినప్పుడు మనలో కలిగే ఆందోళన అంతాఇంతా కాదు. ఈ సమయంలో మానసిక ఆరోగ్యం బాగుండేందుకు నిపుణుల సూచనలు ఇవీ..

ఉద్యోగం కోల్పోవడం ప్రాథమికంగా వృత్తిపరమైన ఎదురు దెబ్బే అయినప్పటికీ, అది మానసిక ఆరోగ్యం, సామాజిక శ్రేయస్సుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. టెక్, స్టార్టప్ కంపెనీల్లో భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు కారణంగా 2022 అందరికీ గుర్తుండిపోతుంది. 2022లో ఇప్పటికే 1,35,000 మంది ఉద్యోగులను పలు కంపెనీలు తొలగించాయి. కొద్ది మందికి జాబ్ అంటే కేవలం జాబ్ మాత్రమే. కానీ చాలా మందికి జాబ్ అంటే జీవితం. వారికి అదొక అభిరుచి. వారి జీవితానికి సాఫల్యం. అలాగే పరమార్థం కూడా. ఆ ఉద్యోగాన్ని కోల్పోవడం అంటే నిర్ధిష్ట ఫలితాలను, లక్ష్యాలను కోల్పోయేలా చేస్తుంది. అంతిమంగా అది దీర్ఘకాలంలో వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

రౌండ్‌గ్లాస్‌లో మెంటల్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న ప్రకృతి పోద్దార్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలపై మాట్లాడారు.

‘మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకునేందుకు కాసింత సమయం కేటాయించండి. ఇదేం ప్రపంచం అంతమవడం కాదు. ఉద్యోగం కోల్పోవడం మీ ప్రస్తుత ఆత్మవిశ్వాసపు స్థాయిలను తగ్గించవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు సృష్టించవచ్చు. అంతేతప్ప మీకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఇస్తున్న నిర్వచనం ఏమీ కాదు. మీ ప్రయాణంలో ఒక చిన్న కుదుపు మాత్రమే అని గమనించాలి..’ అని వివరించారు.

‘ఈ సమయంలో మీకు కావాల్సింది మరొక జాబ్. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది. మీ తదుపరి వృత్తిపరమైన గమ్యానికి ప్రయాణం సవాలుతో కూడుకున్నదై ఉండొచ్చు. అయితే ఈ సమయంలో మీ శరీర, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మీ దినచర్యలో చిన్నచిన్న అలవాట్లు ఈ సవాళ్లను అధిగమించేలా చేస్తాయి..’ అని చెప్పారు.

  1. మీ భావాలను అంగీకరించండి: మీకు తగిలిన ఎదురుదెబ్బను అంగీకరించండి. అయితే దీని కారణంగా కుంగిపోకుండా, దానిని మీ ఎదుగుదలకు స్టెప్పింగ్ స్టోన్‌గా ఉపయోగించుకోండి. మీ అంతర్ వాణిని వినండి.
  2. కచ్చితమైన దినచర్యను పాటించండి: అనిశ్చితి ఒక పెద్ద సవాలు. మీరు ఉద్యోగం చేస్తున్పప్పుడు అనుసరించినట్టుగానే ఇప్పుడు కూడా ఒక దినచర్యను అమలు చేయండి. ఇది మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మీ తదుపరి కార్యాచరణపై ఫోకస్‌గా శక్తియుక్తులను కేంద్రీకరించేలా ఇది ఉపయోగపడుతుంది.
  3. కనెక్ట్ అయి ఉండండి: ఈ క్లిష్టతరమైన ఫేజ్‌లో మీ స్నేహితులు, బంధువులు, మీ శ్రేయస్సు కోరేవారితో కనెక్ట్ అయి ఉండండి. కనీసం ఎమోషనల్ సపోర్ట్ కోసం అయినా వారిని ఆశ్రయించడంగా తప్పుగా భావించకండి.
  4. శారీరకంగా చురుగ్గా ఉండండి: శారీరక, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. అందువల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండండి. ఇంటి పనులు, వ్యాయామం చేయడం వల్ల మీ యాంగ్జైటీ తగ్గుతుంది.
  5. ఆరోగ్యకరమైన ఫుడ్: ఒత్తిడిలో ఉన్నప్పుడు అది తిండిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కార్బొహైడ్రేట్లు అధికంగా తీసుకోవడానికి ఒత్తిడి ప్రేరేపిస్తుంది. చాక్లెట్లు, ఐస్‌క్రీములు, జంక్ ఫుడ్ వంటివి అవాయిడ్ చేసి మీకు పోషకాలను అందించే ఆహారం మాత్రమే తీసుకోండి.
  6. ధ్యానం: ధ్యానం చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు తిరిగి పుంజుకోవడానికి, మునుపటి ఉత్సాహాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది.

WhatsApp channel