Tongue health: నాలుక రంగు బట్టి ఆరోగ్య సమస్య తెల్సుకోవచ్చు..శుభ్రత కోసం టంగ్ క్లీనర్ వాడొచ్చా?
Tongue health: నోటి పరిశుభ్రత పాటించాలనుకుంటే, నాలుకను శుభ్రపరచడం చాలా ముఖ్యం. కాబట్టి నాలుకను ఎప్పుడూ శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకోండి.
నోటి పరిశుభ్రత కోసం మీ పళ్లను మాత్రమే బ్రష్ చేస్తే సరిపోదు. దంతాలతో పాటు, నోటిలో అతి ముఖ్యమైన భాగమైన నాలుకను కూడా శుభ్రం చేయడం చాలా అవసరం. రెండుసార్లు పళ్లు తోముకుని నాలుకను శుభ్రం చేసుకోవడం మర్చిపోతే.. ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే మౌత్ క్లీనింగ్ లో కేవలం దంతాల శుభ్రతను మాత్రమే పరిగణలోకి తీసుకోలేం. ఇందుకోసం నాలుకను దంతాలతో పాటూ శుభ్రం చేసుకోవడం కూడా అవసరం. అప్పుడే పూర్తి శుభ్రత అయినట్లు.
నాలుక శుభ్రంగా లేకపోతే నోటి పరిశుభ్రతను మాత్రమే కాకుండా ఇతర వ్యాధులను కూడా కలిగిస్తుంది. నాలుకను శుభ్రం చేసుకోవడం ఎలా? నాలుక అనారోగ్యంగా ఉంటే ఏ ఆరోగ్య సమస్యలకు సంకేతం? లాంటి విషయాలన్నీ వివరంగా తెల్సుకోండి.
నాలుక శుభ్రంగా, ఆరోగ్యంగా లేదనడానికి సంకేతాలు:
కేవలం నాలుకను చూసి అది శుభ్రంగా ఉందా లేదా అని చెప్పేయొచ్చు.
- నోట్లో బొబ్బలు ఏర్పడి నాలుక తెల్లగా లేదా రంగు మారినట్లు కనిపిస్తుంది.
2. నాలుక మరీ మెత్తగా ఉన్నా పోషకాహార లోపం సూచిస్తుంది.
3, నాలుక మీద పగుళ్లు లాగా ఉంటే అది నాలుక అపరిశుభ్రతకు సంకేతం.
ఆరోగ్యంగా లేని నాలుక ఏం సూచిస్తుంది?:
నాలుక ఆరోగ్యం, వ్యాధుల ప్రభావం రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల ఇలాంటి వ్యాధుల ప్రభావం నాలుకపై కనిపిస్తుంది.
- జీర్ణక్రియ సరిగా లేనప్పుడు నాలుక నలుపు లేదా తెలుపు రంగులో కనిపిస్తుంది.
2. నోటి నుండి దుర్వాసన రావడం కూడా నాలుక సరిగ్గా శుభ్రం చేయట్లేదు అనడానికి సూచిక
3. మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు కూడా నాలుక ఆరోగ్యంగా ఉండదు.
4. డయాబెటిస్ అదుపులో లేనప్పుడు నాలుక అనారోగ్యంగా కనిపిస్తుంది.
నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి?
- రోజూ నాలుకను శుభ్రపరచడానికి సులభమైన, సురక్షితమైన మార్గం టంగ్ క్లీనర్ వాడటం. ప్లాస్టిక్ నుంచి స్టీల్ దాకా రకరకాల టంగ్ క్లీనర్లు దొరుకుతున్నాయి . కానీ ఆరోగ్యం దృష్ట్యా రాగితో చేసిన కాపర్ టంగ్ క్లీనర్లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. రాగి టంగ్ క్లీనర్ వాడితే నాలుక చాలా బాగా శుభ్రపడుతుంది. అలాగే, ఇది ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
2. టూత్ బ్రష్ వాడిన తర్వాత కనీసం రెండుసార్లు నాలుకను శుభ్రం చేసుకోవాలి. తద్వారా నాలుకపై ఉన్న మురికి పొర పూర్తిగా తొలగిపోతుంది. ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం చేసే ఈ పని మీ నోటి పరిశుభ్రతకు సహాయపడుతుంది.
3. పసుపు, నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లా చేసి నాలుకపై పది నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. నాలుకపై పేరుకుపోయిన మురికి శుభ్రపడుతుంది.
4. నీటిలో ఆలమ్ లేదా పటిక, ఉప్పు కలిపి పేస్ట్ లా చేసి వేలి సాయంతో తేలికగా రుద్ది వెంటనే కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నోరు, నాలుకపై పేరుకుపోయిన మురికి వెంటనే తొలగిపోయి నోరు శుభ్రంగా ఉంటుంది.
టాపిక్