Winter Flowers: లక్ష్మీ పూజలో వాడే బంతి, చామంతిలో ఔషధ గుణాలు ఎన్నో! ఆరోగ్యం కోసం వాటిని ఎలా వాడాలంటే..-know health benefits of chemanthi and marigold flowers ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Flowers: లక్ష్మీ పూజలో వాడే బంతి, చామంతిలో ఔషధ గుణాలు ఎన్నో! ఆరోగ్యం కోసం వాటిని ఎలా వాడాలంటే..

Winter Flowers: లక్ష్మీ పూజలో వాడే బంతి, చామంతిలో ఔషధ గుణాలు ఎన్నో! ఆరోగ్యం కోసం వాటిని ఎలా వాడాలంటే..

HT Telugu Desk HT Telugu
Nov 12, 2023 01:30 PM IST

Winter Flowers: లక్ష్మీ పూజల్లొ వాడే బంతి, చేమంతి పూలకు బోలెడు ఔషధ గుణాలున్నాయి. వాటిని వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు ఎలా వాడాలో తెలుసుకోండి.

పూల విశిష్టత
పూల విశిష్టత (freepik)

మామూలుగా అన్ని కాలాల్లోనూ పూలు పూసే మొక్కలు శీతాకాలంలో మాత్రం తక్కువగా పూస్తాయి. అయితే శీతాకాలంలోనే ప్రత్యేకంగా పూలు పూసే మొక్కలు కొన్ని ఉంటాయి. వాటిని మనం వర్షాలు తగ్గిన తర్వాత నాటుకుంటే చలి కాలం ఉన్నన్నాళ్లు చక్కగా పూలు పూస్తాయి. మన దగ్గర ఇలా శీతాకాలంలో ప్రత్యేకంగా పూలు పూసే మొక్కలే బంతి మొక్కలు, ఇంకా చామంతి మొక్కలు. వీటిల్లో ఉండే ఔషధ గుణాలేంటో చూసేద్దాం రండి.

బంతి పూలు:

పండుగలు, పూజలు వేటిల్లో అయినా బంతి పూలు లేనిదే అలంకరణ పూర్తి కాదు. ఇవి ముఖ్యంగా పూలు పూసే కాలం శీతాకాలమే. అయితే ఈ మధ్య కాలంలో వీటిల్లో హైబ్రీడ్‌ రకాలు కొన్ని సంవత్సరం అంతా పూలు పూసేలా తయారు చేస్తారు. అయితే నాటువి మాత్రం ఇప్పుడే కాపు మొదలవుతుంది. ఈ మొక్క పూలు, ఆకులతో చాలా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

  • బంతిపూలను దంచి రసం తీయాలి. వాటిని పుండ్లు, గాయాలపై రాసి కట్టుకడితే అవి తొందరగా తగ్గిపోతాయి.
  • ఒక కిలో బంతి పూల రేకుల్ని తీసుకోవాలి. దానికి ఒక లీటరు బంతి ఆకుల రసాన్ని పోసి మంటపై కాగబెట్టాలి. నీరంతా ఆవిరై చివరికి తైలం మిగులుతుంది. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని కీళ్లపై రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తలకు రాసుకుంటే తలనొప్పులు తగ్గుతాయి.
  • బంతి పూల రసం లేదా బంతి పూల ముద్దను నేతిలో వేయించి తినడం వల్ల నోట్లో నుంచి రక్తం పడటం, ఎర్రబట్ట లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  • బంతి పూలు, ఆకుల నుంచి రసాన్ని తీయాలి. రెండు స్పూన్ల రసాన్ని తీసుకుని అందులో యాహూద్‌ భస్మంని కలపాలి. అది ఆయర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
  • బంతి పువ్వుల రెక్కలు, బంతి మొక్క లేత ఆకులను సేకరించి మిరియాల గింజలతో కలిపి నూరి నీళ్లతో తీసుకుంటే మూత్రంలో వచ్చే చీము తగ్గుతుంది.

చామంతి పూలు :

చలికాలంలో ఎక్కువగా పూచే పూవుల్లో చామంతి పూలు ఒకటి. వీటిలో ఔషధాలు ఎన్నో. చాలా మంది ఈ పూలను టీగా చేసుకుని తాగుతూ ఉంటారు. అందుకు ముందుగా ఈ పూలను ఎండబెట్టాలి. ఆ రేకుల్ని మరిగే నీటిలో వేసి కాసేపు మరిగించాలి. దీన్ని వడగట్టి తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. స్త్రీలకు పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. నిద్రపోవడానికి కాసేపు ముందు దీన్ని తాగడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

Whats_app_banner