Cannes 2023: కేన్స్ 2022 లో ఐశ్వర్యరాయ్ వేసుకున్న డ్రెస్సు వివరాలివే
Cannes 2023: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తమ స్టైల్ తో ఆకట్టుకున్న సెలెబ్రిటీల లుక్స్ గురించి మాట్లాడుకుందాం.
Cannes 2023:
76 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా మంగళవారం రోజున అంటే మే 16 న జరగనున్నాయి. ఫ్యాషన్‌కి, రెడ్ కార్పెట్ లుక్స్‌కి, అంతర్జాతీయ సినిమా ప్రపంచానికి ఇదొక వేదిక. సెలెబ్రిటీలు, మోడళ్లు, నటులు ఈ వేడుకలకు హాజరై రెడ్ కార్పెట్ మీద స్టైలిష్ లుక్స్ తో మెరుస్తారు. పెద్ద ఫ్యాషన్ డిజైనర్లు, బ్రాండ్లు వీళ్ల బట్టల్ని డిజైన్ చేస్తారు. ఈ సంవత్సరం కేన్స్ ఉత్సవం దగ్గర పడింది కాబట్టి ఒకసారి గతేడాది ఈ అంతర్జాతీయ వేడుకలో మెరిసిన తారల డ్రెస్సుల గురించి చూద్దాం.
దీపికా పదుకొనే:
2022 సంవత్సరంలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీపికా పదుకొనే సబ్యసాచి చీరలో మెరిసిపోయింది. గతేడాది తను జూరీ మెంబర్ గా కూడా ఉన్నారు. రెట్రో లుక్ లో ఉన్న ఆల్ ఓవర్ సీక్వెల్ చీర కట్టుకుని అందరి దృష్టి ఆకర్షించింది. బెంగాల్ టైగర్ రాజసం గుర్తుతెచ్చే నలుపు, బంగారు వర్ణాల మేళవింపులో ఉన్న చీర, పొడవాటి స్టేట్ మెంట్ చెవిపోగులు, పూసలతో ఉన్న హెడ్ బ్యాండ్, మెరిసే హీల్స్, స్టైలిష్ సిగకట్టుతో అందరినీ ఆకట్టుకున్నారు.
బెల్లా హడిద్:
బెల్ల హడిద్ కేన్స్ ఉత్సవాల్లో ప్రముఖమైన పేరు. 2022 లో తను వేసుకున్న శరీరానికి హత్తుకునే ఫిట్టింగ్ తో ఉన్న స్ట్రాప్ లెస్ డ్రెస్, వెల్వెట్ స్కర్ట్ అందరికీ నచ్చింది. దీనికి జతగా తను పెట్టుకున్న మెరిసే చెవి కమ్మలు మంచి టచ్ ఇచ్చాయి.
దీపికా పదుకొనే గౌను:
దీపికా పదుకొనే తన బోల్డ్ ఫ్యాషన్ లుక్స్ కి పెట్టింది పేరు. లూయీ విటన్ గౌనుతో వార్తల్లో నిలిచింది. నలుపు, బంగారు వర్ణాల్లో ఉన్న ఈ గౌను మీద చాలా క్లిష్టమైన పనితనంతో హుందాగా కనిపించింది. భుజాలకు పొడవాటి కేప్‌లు డ్రెస్ కు మంచి లుక్ తీసుకొచ్చాయి. మినిమల్ మేకప్, వెట్ హెయిర్ లుక్, నలుపు రంగు స్టడ్స్, కొన్ని చేతి ఉంగరాలతో ఈ లుక్ కి హుందాతనం వచ్చింది.
ఐశ్వర్యా రాయ్:
డిజైనర్ గౌరవ్ గుప్తా తయారు చేసిన గౌనులో ఐశ్వర్య కళ్లు తిప్పుకోకుండా చేసింది. తక్కువ నగలతో, వజ్రాల చెవిపోగులతో, చేతికి ఉంగరాలతో చాలా అందంగా కనిపించింది. పొడవాటి గౌను వెనకాల నిలిచి పోయే శిల్పం లాంటి అమరికతో అందర్నీ కట్టిపడేసింది. ఊదారంగు ఐషాడో , సన్నటి ఐ లైనర్, మస్కారా , బ్లష్, లేత గులాబీ రంగు పెదాలతో, వేవీ హెయిర్ స్టైల్ తో ఐశ్వర్య ప్రత్యేకంగా నిలిచింది.
టాపిక్