ITBP Recruitment 2022: ITBP దరఖాస్తు గడువు పెంపు.. ఇలా సులభంగా అప్లై చేసుకోండి!
ITBP Recruitment 2022: ITBP దరఖాస్తుల గడువు తేదీని పెంచింది. 14 జూలై 2022 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజా ప్రకటనలో తెలిపింది.
ITBP Recruitment 2022,: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ITBP హెడ్ కానిస్టేబుల్, ASI స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ దరఖాస్తులకు సంబంధించిన చివరి తేదీని మరో వారం పొడిగించారు. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఇప్పుడు 14 జూలై 2022 వరకు ITBP వెబ్సైట్ recruitment.itbpolice.nic.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. IBPS జూన్ 8న హెడ్ కానిస్టేబుల్, ASI స్టెనోగ్రాఫర్ (DE/LDCE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ITBP ఈ రిక్రూట్మెంట్ సంబంధించి 8 జూన్ నుండి 7 జూలై 2022 వరకు దరఖాస్తులు ఆహ్వానించింది. తాజాగా ITBP దరఖాస్తులకు సంబంధించిన గడువు తేదీ పెంచింది. ఇప్పుడు దరఖాస్తు తేదీని 14 జూలై 2022 వరకు పొడిగించింది.
వయోపరిమితి -18 -25 సంవత్సరాలు. LDCI పోస్టులకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు.
విద్యార్హత - 10+2 ఉత్తీర్ణత
పే స్కేల్ - హెడ్ కానిస్టేబుల్ - రూ. 25500 - 81100 వరకు
ASI-29200 - రూ.93200 వరకు.
ITBP ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 286 హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తారు.ఈ రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే అంగీకరించబడతాయి. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను చదవాలని సూచించారు.
ITBP ఖాళీకి ఎలా దరఖాస్తు చేయాలి
ITBP వెబ్సైట్ recruitment.itbpolice.nic.inను సందర్శించండి.
హోమ్ పేజీలోని రిజిస్ట్రేషన్ లింక్‌కి వెళ్లండి.
రిజిస్ట్రేషన్ తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, దరఖాస్తు రుసుమును చెల్లించండి.
చివరగా, దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసి, దాని ప్రింటౌట్ తీసుకోండి.
సంబంధిత కథనం