Female Orgasm: లైంగిక ప్రక్రియలో స్త్రీకి భావప్రాప్తి కలుగుతోందా? వారికి ‘క్లైమాక్స్’ అనుభూతి ఎందుకు ఆనందం ఇవ్వడం లేదు?-is the woman feeling sensual during the sexual process why is the feeling of climax not giving them pleasure ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Female Orgasm: లైంగిక ప్రక్రియలో స్త్రీకి భావప్రాప్తి కలుగుతోందా? వారికి ‘క్లైమాక్స్’ అనుభూతి ఎందుకు ఆనందం ఇవ్వడం లేదు?

Female Orgasm: లైంగిక ప్రక్రియలో స్త్రీకి భావప్రాప్తి కలుగుతోందా? వారికి ‘క్లైమాక్స్’ అనుభూతి ఎందుకు ఆనందం ఇవ్వడం లేదు?

Haritha Chappa HT Telugu
Aug 08, 2024 11:22 AM IST

Female Orgasm: స్త్రీకి భావప్రాప్తి కలగడం అనేది ఒక అంతుచిక్కని మిస్టరీగానే మారిపోయింది. కొంతమంది మహిళలు భావప్రాప్తి ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ వారికి నిజానికి ఎలాంటి భావప్రాప్తి కలగడం లేదు.

మహిళల్లో భావప్రాప్తి ముఖ్యమైనదా?
మహిళల్లో భావప్రాప్తి ముఖ్యమైనదా?

Female Orgasm: లైంగిక ప్రక్రియలో అతి ముఖ్యమైనది క్లైమాక్స్. క్లైమాక్స్‌కు చేరుకునే ముందు భావప్రాప్తి చాలా అవసరం. మగవారిలో భావప్రాప్తి అనేక రకాలుగా కలుగుతుంది. అదే వారిని క్లైమాక్స్ దశకు ఉత్సాహంగా, మరింత కోరికగా తీసుకువెళ్తుంది. కానీ స్త్రీల విషయంలో అలా జరగడం లేదు. ఇది ఇప్పటికీ అంతు పట్టని మిస్టరీగానే మిగిలిపోయింది. శాస్త్రవేత్తలు, సెక్సాలజీ నిపుణులు ఈ విషయంపై ఎప్పటినుంచో అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. కానీ మహిళల్లో భావప్రాప్తి గాని, క్లైమాక్స్ లో కలిగే ఆనందం గాని దొరకడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా శాస్త్రావేత్తలకు తెలియడం లేదు.

భావప్రాప్తి సినిమాల్లో మహిళలను చూపించినట్టు ఉంటుందేమో అనుకుంటారు. కేవలం అక్కడ దర్శకుడు చెప్పినట్టు మహిళలు నటిస్తారు... అంతే. అయితే నిజ జీవితంలో కూడా భర్త దగ్గర నటిస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. వారికి లైంగిక ప్రక్రియ అనేది ఎలాంటి ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఇలాంటి భావప్రాప్తిని క్లైమాక్స్ ఆనందం వారికి దక్కడం లేదు. ముందుగా భావప్రాప్తి కలిగితేనే క్లైమాక్స్ అనేది ఆనందంగా ముగుస్తుంది. కానీ ఎంతో మంది మహిళలు అది ఒక బాధ్యతగా మాత్రమే చేస్తున్నారు, భర్తకు ఎలాంటి లోటు లేకుండా చూడాలన్న ఉద్దేశంతో భావప్రాప్తి కలిగినట్టు నటిస్తున్నారు.

భావప్రాప్తి ఎందుకు కలగడం లేదు?

భావప్రాప్తిపై శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాలపరంగా, హార్మోన్ల పరంగా అనేక రకాల ప్రభావాలు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా లైంగిక దాడికి గురైన మహిళల్లో లేదా చిన్నప్పుడు లైంగికంగా వేధించబడిన పిల్లల్లో... పెద్దయ్యాక ఎలాంటి భావప్రాప్తి కలగదు. అలాగే తమకు ఇష్టం లేని సమయంలో, ఇష్టం లేని చోట... సెక్స్ కోసం బలవంతం చేసినా వారిలో భావప్రాప్తి కలగడం చాలా కష్టమైపోతుంది. నిజానికి ఈ సొసైటీలో తమలోని లైంగిక కోరికలను పూర్తిగా అణిచివేసుకుని జీవిస్తున్న మహిళలే అధికంగా ఉన్నట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.

మగవారిలాగే ఆడవారిలో కూడా లైంగిక కోరికలు, శృంగారంలో సంతృప్తి కావాలని ఉంటుంది. కానీ వారికి ఆ అవకాశాలను అందించే పరిస్థితులు మాత్రం ప్రస్తుతం కనిపించడం లేదు. ముఖ్యంగా తమ శరీరాన్ని తామే ప్రేమించేలా వారు చైతన్యవంతులు అవ్వాలి. లైంగిక జీవితం తమ భర్తకే కాదు, తమకి కూడా ఎంతో ముఖ్యమని వారు తెలుసుకోవాలి. లైంగిక ఆనందాన్ని నిజంగా అనుభవించాలి. అది సంతృప్తికర స్థాయికి చేరుకున్నాకే మీకు ఆ లైంగిక జీవితంలోని అసలైన ఆనందం తెలుస్తుంది.

ఉరుకుల పరుగుల జీవితంలో ఎదురవుతున్న ఒత్తిడి కూడా మహిళలను లైంగిక ప్రక్రియకు దూరం చేస్తోంది. ముఖ్యంగా పిల్లలు పుట్టాక పూర్తిగా శృంగారానికి దూరమవుతున్న మహిళలు కూడా ఎక్కువగానే ఉన్నారు. వారు భావప్రాప్తిని పూర్తిగా పొందలేకపోతున్నారు. జీవిత భాగస్వామితో దగ్గరవుతున్నప్పుడు చాలా తక్కువ సమయంలోనే మహిళల్లో భావప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కానీ ఆమె శరీరానికి విశ్రాంతి తక్కువ అయిపోవడంతో ఆ భావప్రాప్తి అనేది కలగడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు రోబోలా ఏదో ఒక పని చేసే మహిళలు... లైంగిక ప్రక్రియలో ఆనందాన్ని అనుభవించలేరని అధ్యయనం కూడా తేల్చింది.

ఒకవైపు ఉద్యోగం, ఇంటి పని, పిల్లలను చూసుకోవడం, ఆర్థికపరమైన అంశాలు... ఇవన్నీ కూడా వారిలో తీవ్ర ఒత్తిడిని పెంచుతాయి. దీనివల్ల మెదడు భావప్రాప్తిని గుర్తించలేదు. ఇలాంటి సమయంలో మహిళలు కేవలం తమ భర్తను తృప్తిపరిచేందుకు మాత్రమే లైంగిక ప్రక్రియలో పాల్గొంటారు. అంతే తప్ప వారు ఎలాంటి భావప్రాప్తి కానీ, క్లైమాక్స్ గానీ పొందరు.

మహిళలకు భావప్రాప్తి కలగాలంటే పురుషులు అదేదో ఉద్యోగం లాగా చకాచకా చేసి వదిలేయడం కాదు. స్త్రీలకు సంతృప్తి కలిగేలా వారితో ఎక్కువ సమయం గడపాలి. లైంగిక ప్రక్రియకు ముందు ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకోవాలి. ఒకరినొకరు ప్రేరేపించుకునే విధంగా ఉండాలి. సెక్స్ అనేది ఒక డ్యూటీ కాదు... అది ఒక అనుభూతి. ఆ అనుభూతి ఇద్దరికీ సంతృప్తినివ్వాలి. అందుకోసం కనీసం గంట నుంచి గంటన్నర సమయాన్ని కేటాయించుకోవాలి. ముందుగా వారు మానసికంగా దగ్గర అవ్వాలి. ఆ తర్వాతే శారీరకంగా ఒకరినొకరు ఉత్తేజపరచుకోవాలి. అప్పుడే మహిళల్లో భావప్రాప్తి, క్లైమాక్స్‌లో కలిగే ఆనందం వారికి అర్థమవుతుంది.

మహిళల్లో లైంగిక కోరికలు చాలా వరకు తగ్గిపోతున్నట్టు బ్రిటన్లోని ఒక నేషనల్ హెల్త్ సర్వే చెప్పింది. గర్భధారణ, పిల్లల పుట్టడం, తీవ్రమైన ఒత్తిడి వల్ల వారు లైంగిక జీవితానికి దూరంగా అవుతున్నట్టు గుర్తించింది. అలాంటి వారికి చేయూతనందించాల్సిన అవసరం భర్తకు ఉంది. ముఖ్యంగా మహిళల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతే వారిలో సెక్స్ కోరికలు కూడా తగ్గిపోతాయి. ఆమెకు శృంగార జీవితంపై ఎలాంటి ఆసక్తి ఉండదు. కాబట్టి కొన్నిసార్లు వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవడం మంచిది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వంటి వాటితో డాక్టర్లు తగిన చికిత్సను అందిస్తారు.

మహిళలకు లైంగిక ప్రక్రియ ఎన్నో రకాల ఆరోగ్యాలను అందిస్తుంది. మహిళకు కూడా భావప్రాప్తి, సెక్స్‌లో ఆనందం కావాలని ఫ్రాన్స్‌కు చెందిన ఒక రాకుమారి ఎన్నో పరిశోధనలు చేసింది. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్-1 కు ముని మనవరాలు మేరీ బోనాపార్టీ. ఆమె మహిళల్లో కలిగే భావప్రాప్తి, మానసిక విశ్లేషణ, లైంగిక ప్రక్రియ పై ఎన్నో అధ్యయనాలుచేసింది. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మెంట్ ఫ్రాయిడ్ వద్ద ఆమె శిష్యరికం చేసింది. స్వతంత్ర భావాలున్న మేరీ రాజ కుటుంబంలో పుట్టినా కూడా ఆ కట్టుబాట్లకు పెంచుకొని ఆమె స్త్రీ లైంగిక పరిస్థితులపై ఎన్నో పరిశోధనలు చేసింది.

టాపిక్