Women and Saunf: సోంపు మహిళలకు వరం, రోజూ ఒక స్పూను సోంపు నమలాల్సిందే
Women and Saunf: తిన్న తర్వాత ఏదైనా తినాలని అనిపిస్తే సోంపును తినేందుకు ప్రయత్నించండి. భోజనం తినేందుకు సోంపు కంటే ఉత్తమ ఆహారం ఇంకేముంది? ముఖ్యంగా మహిళలు సోంపు తింటే వారికి ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.
ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా భోజనం చేశాక చివర్లో బిల్లుతో పాటూ సోంపు కూడా పెడతారు. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు. పూర్వకాలం నుంచి భారతీయులు భోజనం పూర్తయ్యాక సోంపు నమలడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. సోంపును అనేక వంటకాలలో కూడా భాగం చేస్తారు. సోంపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎంతోమంది సోంపు ఎందుకు తినాలో తెలియకుండానే… రెస్టారెంట్లో భోజనం చేశాక తినేస్తారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఎన్నో రకాల బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే గుణం ఇందులో ఉంది.
1. సోంపు గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి, కానీ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అవసరమని ఎన్నో సార్లు చదివి ఉంటారు. సోంపులో పాలీఫెనాల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ సోంపు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సోంపులాంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకునేవారికి క్యాన్సర్, గుండె జబ్బులు, నరాల జబ్బులు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి రోజులో ఒక స్పూను సోంపు కచ్చితంగా తినండి.
2. సోంపులో ఉండే అనెథాల్ క్యాన్సర్‌తో పోరాడే గుణాన్ని కలిగి ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఇది రొమ్ము క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది. ఆ క్యాన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించే శక్తి కూడా సోంపుకు ఉంది.
3. సోంపును కొవ్వుకు శత్రువులా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్స్ ఎక్కువ సేపు ఆకలిగా అనిపించకుండా చేస్తాయి. కొవ్వు తగ్గడానికి చాలా మంది ఫెన్నెల్ టీ తాగుతారు. నీటిలో సోంపును నానబెట్టి ఆ నీటిని తాగుతూ ఉంటారు. కాబట్టి అధిక బరువు ఉన్నవారు సోంపు నీటిని తాగడం లేదా, సోంపును నమలడం వంటి పనులు చేయాలి.
4. సోంపును ప్రతిరోజూ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయి. ఆ క్యాన్సర్ కణాలను వ్యాప్తి చెందకుండా సోంపులోని గుణాలు కాపాడతాయి.
5. సోంపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. శరీరంలో బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలను నిరోధిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
6. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజూ ఒక స్పూను సోంపు తినడం వల్ల అలవాటుగా మార్చుకోవాలి. కొంతమంది మహిళల్లో రుతుక్రమ సమయంలో తీవ్రమైన పొట్టనొప్పి, తిమ్మిరి వంటివి వస్తాయి. అలాంటి వారు సోంపు నీటిని తాగడం అలవాటుగా మార్చుకోవాలి. ప్రతిరోజూ సోంపును తినడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే సోంపు తినడం వల్ల జీర్ణక్రియను నయం చేయడానికి కూడా దీనిని తింటారు.
టాపిక్