Salt Benefits:ఉప్పుతో నష్టాలే కాదు.. లాభాలు కూడా ఉన్నాయి!
Salt Benefits: ఉప్పు వల్ల నష్టాలే కాదు.. లాభాలు కూడా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. ఉప్పు ఒత్తిడిని తగ్గిస్తుందని.. ఇది ఒత్తిడితో పోరాడటానికి సహాయపడే సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్లను సమతుల్యం చేస్తుందని ఆయుర్వేదంలో వివరించారు.
సాధరణంగా ఉప్పు ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది కాదంటారు. కానీ ఆయుర్వేదం ఉప్పు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతుంది. ఉప్పులో ఉండే మినరల్స్ మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. ఉప్పు జీర్ణ రసాల ఉత్పత్తిలో సహాయపడుతాయి. దీంతో జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది.
ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలు
రక్తపోటును నియంత్రిస్తుంది: అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉప్పు ఒత్తిడిని తగ్గిస్తుంది. అదనంగా, ఇది ఒత్తిడితో పోరాడటానికి సహాయపడే సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఉప్పు కండరాల, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. సైనస్ కారణంగా శరీరమంతా నొప్పిని కలుగుతుంది. దానిని తగ్గించుకోవడానికి ఉప్పు తినడం మంచిది. శరీరంలో రాళ్లు పేరుకుపోయి ఉంటే నీటిలో ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగితే కొద్ది రోజుల్లోనే రాయి కరగడం ప్రారంభమవుతుంది. ఉబ్బసం, మధుమేహం, కీళ్లనొప్పులు ఉన్న రోగులకు ఉప్పు తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిద్ర లేమి తగ్గించడంలో కూడా ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది.
అలసటగా అనిపించినప్పుడల్లా అర బకెట్ గోరువెచ్చని నీటిలో ఏడెనిమిది టీస్పూన్ల ఉప్పు కలపండి. సాధరణంగా నీటిలో ఉప్పు వెంటనే కరిగిపోతుంది. తర్వాత మీ పాదాలను బకెట్‌లో ఉంచి కాసేపు కూర్చోండి. ఇలా చేయడం వల్ల అలసట తొలగిపోయి తాజా అనుభూతి పొందుతారు
ఎలాంటి ఉప్పును తీసుకోవాలి
ఉప్పులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. పాదాల ఇన్ఫెక్షన్ ఉంటే ఉప్పును ఉపయోగించడం వల్ల తగ్గించుకోవచ్చు. పాదాలు వాచినప్పుడు ఈ ద్రావణంలో పాదాలను ఉంచడం వల్ల మేలు జరుగుతుంది. జిడ్డుగల చర్మం ఉంటే, ఉప్పు టోనర్ ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చిన్న స్ప్రే బాటిల్‌లో తేలికపాటి వేడి నీటిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఉప్పు కలపాలి. ఉప్పు బాగా కరిగిన తర్వాత ముఖంపై స్ప్రే చేయాలి. కళ్ల దగ్గర స్ప్రే చేయకుండా జాగ్రత్తపడండి. కాటన్ సహాయంతో ముఖమంతా నీటిని పిచికారీ చేసి శుభ్రం చేసుకోవాలి. అయితే, సమస్యగా తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
అతిగా ఉప్పు ఉపయోగించకూడదు.
అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల అనేక అరోగ్య సమస్యలు వస్తాయి. అధిక ఉప్పు తినడం వల్ల నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రోజుకు ఐదు గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని సిఫార్సు చెస్తోంది. అది టీస్పూన్ఉప్పుతో సమానం. కానీ మనం సాధరణంగా అధిక మెుత్తంలో రిఫైన్డ్ లేదా సాధారణ ఉప్పును ఉపయోగిస్తాం. ఇందులో 97-99శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. కాబట్టి లైట్ సాల్ట్ లేదా లో సోడియం సాల్ట్‌ను తీసుకుంటే మంచిది. వాటిలో 50 శాతం సోడియం మాత్రమే ఉంటుంది. అది ఆరోగ్యానికి మేలు చేస్తోంది
సంబంధిత కథనం