తెలుగు న్యూస్ / ఫోటో /
సైలెంట్ రిప్లై, చాట్‌లో పోల్.. ఇన్‌స్టాగ్రామ్‌లోని కొత్త ఫీచర్లు!
- ఇన్‌స్టాగ్రామ్ 7 కొత్త మెసేజింగ్ ఫీచర్‌లను ప్రవేశపెట్టింది, ఇవి యూజర్స్ చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి. మ్యూజిక్ ప్రివ్యూలను షేర్ చేయడం నుండి ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో చెక్ చేయడం కోసం ఈ కొత్త ఫీచర్‌లు అనువుగా ఉండనున్నాయి.
- ఇన్‌స్టాగ్రామ్ 7 కొత్త మెసేజింగ్ ఫీచర్‌లను ప్రవేశపెట్టింది, ఇవి యూజర్స్ చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి. మ్యూజిక్ ప్రివ్యూలను షేర్ చేయడం నుండి ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో చెక్ చేయడం కోసం ఈ కొత్త ఫీచర్‌లు అనువుగా ఉండనున్నాయి.
(1 / 9)
ఇన్‌స్టాగ్రామ్ తాజాగా 7 కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్‌స్టాగ్రామ్ మెసేజింగ్ ఫీచర్‌లు ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. త్వరలో అవి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో తీసుకరానున్నారు. ఇన్‌స్టాగ్రామ్ మెసేజింగ్ కొత్త ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.(AFP)
(2 / 9)
ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏదైన మేసేజ్ వస్తే, మీరు ఇప్పుడు మీ ఇన్‌బాక్స్‌కి వెళ్లకుండా ఉన్న చోటే ఆ సందేశానికి సమాధానం ఇవ్వవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా చాటింగ్ మరింత సులభతరంగా అవడంతో సౌకర్యవంతంగా ఉండనుంది(Instagram)
(3 / 9)
Quick Send to Friends: ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను ఫీడ్ నుంచి ఫ్రెండ్స్‌కు సులువుగా.. ఈ ఫీచర్ ద్వారా పపించవచ్చు. దీనికి షేర్ బటన్‌పై ట్యాప్ చేసి అలానే హోల్డ్ చేసి పట్టుకుంటే ఆ పోస్ట్ పంపించాలనుకునే వారికి ఫీడ్ నుంచే రీషేర్ చేయవచ్చు.(Instagram)
(4 / 9)
ఈ ఫీచర్ ద్వారా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎవరున్నారో తెలుసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్ టాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో తెలుస్తుంది. ఇది మీ స్నేహితులతో ఈజీగా కనెక్ట్ కావడానికి మీకు సహాయపడుతుంది.(AP)
(5 / 9)
Play, Pause and Replay: Apple Music, Amazon Music, Spotifyలను చాట్ భాగంలో చూడవచ్చు . మీకు ఇష్టమైన పాటను 30 సెకన్ల ప్రివ్యూను మీరు షేర్ చేయవచ్చు. మీ స్నేహితులు Instagram చాట్ నుండి దాన్ని నేరుగా వినగలరు.(HT_PRINT)
(6 / 9)
సెండ్ సైలెంట్ మెసేజెస్ : ఈ ఫీచర్ ద్వారా నోటిఫికేషన్ వెళ్లకుండానే మీ ఫ్రెండ్స్‌కు మెసేజ్ పంపవచ్చు. వారి బిజీ సమయాల్లో దీని ద్వారా మెసేజ్ పంపితే డిస్ట్రబ్ అవకుండా ఉంటుంది.(REUTERS)
(7 / 9)
lo-fi చాట్ థీమ్: మీరు చేసే చాట్ పర్సనలైజ్డ్‌గా ఫీలయ్యేందుకు ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా lo-fi చాట్ థీమ్‌ను పరిచయం చేసింది. ఇది ఇప్పటికి కొన్ని దేశాల్లోనే అందుబాటులోకి ఉంది. త్వరలోనే అన్ని దేశాల్లో ఇది విడుదల కానుంది.(AFP)
(8 / 9)
క్రియేట్ పోల్ : గ్రూప్ చాట్‌లో ఈ ఫీచర్ ద్వారా పోల్‌ను సృష్టించవచ్చు. ముఖ్యంగా ఫ్రెండ్స్ గ్రూప్‌లకు ఇది ఉపయోగపడుతుంది.(REUTERS)
ఇతర గ్యాలరీలు