Infinix INBook X1 Neo । తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ కోసం చూస్తుంటే, ఇది బెస్ట్!-infinix inbook x1 neo laptop launched at affordable price with discounts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Infinix Inbook X1 Neo । తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ కోసం చూస్తుంటే, ఇది బెస్ట్!

Infinix INBook X1 Neo । తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ కోసం చూస్తుంటే, ఇది బెస్ట్!

HT Telugu Desk HT Telugu
Jul 19, 2022 10:25 PM IST

మీరు బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి బడ్జెట్ ధరలో Infinix INBook X1 Neo ల్యాప్‌టాప్‌ విడుదలైంది. దీని ధర, ఇతర విశేషాలు ఇక్కడ తెలుసుకోం

Infinix INBook X1 Neo
Infinix INBook X1 Neo

ఇన్ఫినిక్స్ బ్రాండ్ బడ్జెట్ ధరలో మరొక ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొన్ని వారాలే క్రితమే InBook X1 సిరీస్‌లో Slim మోడల్‌ను పరిచయం చేసిన కంపెనీ తాజాగా ఇదే సిరీస్ నుంచి Infinix INBook X1 Neo మోడల్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త ల్యాప్‌టాప్‌ ఇంటెల్ సెలెరాన్ క్వాడ్ కోర్ N5100 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. రూ. 25 వేల బడ్జెట్ లో మెరుగైన ఫీచర్లతో ఈ ల్యాప్‌టాప్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది. సాధారణంగా ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, PCలలో కనిపించే సాంప్రదాయ HDD స్టోరేజ్ కంటే Infinix INBook X1 Neoలో 5X వేగవంతమైన ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం కలిగిన M.2 NVMe PCIe 3.0 SSD డ్రైవ్‌ను అందిస్తున్నారు.

ఇంకా ఈ ల్యాప్‌టాప్‌ అల్యూమినియం అల్లాయ్ ఆధారిత మెటల్ బాడీతో రూపొందింది. దీని డిస్‌ప్లే 300 NITS పీక్ బ్రైట్‌నెస్, 100% sRGB కలర్ రిప్రొడ్రక్షన్ కలిగి ఉంది. అధునాతన DTS సౌండ్ టెక్నాలజీతో రెండు-లేయర్ స్టీరియో స్పీకర్‌లు, డ్యూయల్-స్టార్ లైట్ కెమెరా, టైప్ చేసేటప్పుడు మెరుగైన విజిబిలిటీ కోసం బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కూడా కలిగి ఉంది.

Infinix INBook X1 నియోలో ఇచ్చిన 50Wh బ్యాటరీ దాదాపు 11 గంటల వెబ్ బ్రౌజింగ్, 9 గంటల సాధారణ పని అలాగే 9 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ ల్యాప్‌టాప్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలగు వివరాలను ఈ కింద పరిశీలించండి.

Infinix InBook X1 Neo ల్యాప్‌టాప్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 300 NITS పీక్ బ్రైట్‌నెస్ కలిగిన 14 అంగుళాల ఫుల్ HD IPS LCD డిస్‌ప్లే
  • 8 GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • ఇంటెల్ సెలెరాన్ క్వాడ్ కోర్ N5100 ప్రాసెసర్
  • HD వెబ్‌క్యామ్‌, DTS సౌండ్ టెక్నాలజీ
  • 50Wh బ్యాటరీ, 45W టైప్-సి ఛార్జర్
  • Ice Storm 1.0 కూలింగ్ సిస్టమ్‌
  • ధర, రూ. 24,990/-

మిగతా వివరాలను పరిశీలిస్తే Infinix INBook X1 Neoలో USB టైప్-C పోర్ట్‌లు, ఫంక్షన్ కోసం ఒక HDMI 1.4 పోర్ట్, SD కార్డ్ రీడర్‌, 3.5 mm హెడ్‌సెట్, మైక్రోఫోన్ కాంబో జాక్ ఉన్నాయి.

ఈ ల్యాప్‌టాప్ జూలై 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానుంది. 10% వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌లు కూడా ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్