Agniveer Bharti 2022 : అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ వివరాలు.. ముఖ్యమైన తేదీలు ఇవే!
Indian Army Agniveer Bharti 2022 Dates : అగ్నివీర్లను నియమం కోసం భారత సైన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి దశలో భారత సైన్యంలో 25,000 మంది అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ కోసం ఆగస్టు రెండో వారంలో దేశవ్యాప్తంగా 80 ర్యాలీలు నిర్వహించనున్నారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మన్, పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
భారత సైన్యంలో అగ్నివీర్ భారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 1, 2022 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. అగ్నివీర్లను నియమం కోసం భారత సైన్యం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మన్ పోస్టులను భర్దీ చేయనున్నారు. మొదటి దశగా భారత సైన్యంలో 25,000 మంది అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ కోసం ఆగస్టు రెండో వారంలో దేశవ్యాప్తంగా 80 ర్యాలీలు నిర్వహించనున్నారు. అర్హత సంబంధించిన అభ్యర్థులు అక్టోబర్ 16న జరిగే వ్రాత పరీక్షకు హాజరవుతారు. డిసెంబర్‌లో చివరి ఎంపిక ప్రక్రియను నిర్వహించి అర్హత సాధించిన అగ్నివీరులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ముఖ్యమైన తేదీలు
- ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం - 1 జూలై 2022
- రిక్రూట్‌మెంట్ ర్యాలీ - రెండవ వారం, ఆగస్టు 2022
- మొదటి బ్యాచ్ వ్రాత పరీక్ష - 16 అక్టోబర్ 13 నవంబర్ 2022 నుండి
- 1వ బ్యాచ్ శిక్షణ కేంద్రం వివరాలు - డిసెంబర్ 2022
- 2వ బ్యాచ్ వ్రాత పరీక్ష - జనవరి 2023లో నిర్వహించబడుతుంది
- 2వ బ్యాచ్ శిక్షణా కేంద్రంలో నివేదిన - ఫిబ్రవరి 2023
- 1వ బ్యాచ్ అగ్నివీర్స్ శిక్షణ తర్వాత యూనిట్‌కి వివరాలు- జూలై 2023
అర్హతలు
- అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD) కోసం 45% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించాలి.
అగ్నివీర్ టెక్నికల్‌కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ పోస్టులకు 60 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత.ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్‌లో 50 శాతం మార్కులు ఉండాలి.
10, 8వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అగ్నివీర్ ట్రేడ్స్‌మన్‌కి అర్హులు దరఖాస్తుదారు అన్ని సబ్జెక్టులలో 33% మార్కులు కలిగి ఉండాలి.
పైన పేర్కొన్న అన్ని పోస్టులకు వయోపరిమితి 17 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు ఉంటుంది.
సంబంధిత కథనం