Breast cancer with Bra: బ్రా వేసుకుంటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వస్తుందన్నది ఎంతవరకు నిజం? వేసుకుంటే మంచిదా? కాదా?
Breast cancer with Bra: మహిళలు వేసుకునే బ్రా గురించి ఎన్నో అపోహలు వాడుకలో ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ వస్తుందని ఎంతోమంది నమ్ముతున్నారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
Breast cancer with Bra: బ్రా అనేది ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన వస్త్రాలలో భాగం. ఒకప్పుడు ఇలాంటివేవీ ఉండేవి కాదు. ఇప్పుడు ఆడపిల్లలు టీనేజీలోకి వచ్చారంటే ఇంట్లోని పెద్దవారు బ్రా వేసుకోమని చెబుతూ ఉంటారు. ఎంతోమంది అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా అది వేసుకోవాల్సి వచ్చేది. బ్రా వేయడం వల్ల శరీరం అంతా బంధించినట్టు ఉంటుంది. కొంతమందికి ఊపిరాడనట్టుగా అనిపిస్తుంది. అది అలవాటు అయ్యేవరకు అసౌకర్యంగానే ఉంటుంది. అయినా కూడా అమ్మాయిలు బ్రా వేసుకోవడం అనేది తప్పనిసరి అయింది. బ్రా అనే పదం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో 1911లో చేర్చారు. అంతవరకు ఆ వస్త్రధారణ గురించి ఏదో రకంగా వివాదాలు అవుతూనే ఉన్నాయి. బ్రా వేసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందనేది ఎక్కువమందిలో ఉన్న అభిప్రాయం. దీనివల్ల ఎంతోమంది అది వేసుకోవడానికి భయపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో వైద్యులు చెబుతున్నారు.
బ్రాతో రొమ్ముక్యాన్సర్?
ప్రపంచంలో మహిళల ప్రాణాలను హరిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. మహిళల్లో ఎక్కువగా వచ్చేది ఈ క్యాన్సరే. అయితే మహిళలు ధరించే బిగుతైన బ్రాల వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని ఎంతో మందిలో అభిప్రాయం ఉంది. ఇది నిజం కాదని చెబుతున్నారు వైద్యులు. కాకపోతే మరీ బిగుతుగా ఉండే బ్రాలు కాకుండా కాస్త వదులుగా ఉండేవి వాడితే మంచిదని సూచిస్తున్నారు. మరీ బిగుతుగా ఉన్నవి వేసుకోవడం వల్ల ఊపిరాడనట్టు అనిపిస్తుందని దీనివల్ల ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
వారసత్వం రొమ్ము క్యాన్సర్
రొమ్ము క్యాన్సర్ రావడానికి జన్యుపరమైన కారణాలు ఎక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. వారసత్వంగా వచ్చేది రొమ్ము క్యాన్సర్. అలాగే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారిలో కూడా ఇది వచ్చ్చే అవకాశం ఉంది. కానీ బ్రా వేసుకోవడం వల్లే రొమ్ము క్యాన్సర్ వస్తుందని మాత్రం ఇంతవరకు ఏ అధ్యాయనం తేల్చలేదు.
బిగుతైన బ్రాల వల్ల సమస్యలు
బాగా బిగుతైన బ్రాలు వేసుకోవడం వల్ల మాత్రం కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ఆ భాగానికి గాలి తగలక చెమట పట్టేస్తుంది. అక్కడ ఎరుపెక్కడం, ఎలర్జీలు రావడం జరుగుతుంది. చర్మం పొడిబారి పోవచ్చు. కాబట్టి ఎల్లవేళలా బ్రా వేసుకోవడం మంచిది కాదు. ఇంటికి వచ్చాక వాటిని తీసి వదులుగా ఉండే వస్తువులు వేసుకోవాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు బ్రాలు ఉంచుకోవడం మంచి పద్ధతి కాదు. నిద్ర సరిగా పట్టక అసౌకర్యానికి గురవుతారు.
టైట్‌గా ఉండే బ్రాలు వేసుకుంటే రొమ్ముల్లో కణజాలాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్లే రొమ్ము క్యాన్సరు వచ్చే అవకాశం ఉందనే వాదన పుట్టుకొచ్చింది. కాబట్టి బిగుతుగా ఉండే బ్రాలు మానేసి కాస్త వదులుగా ఉన్నవి వేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఆస్తమాతో బాధ పడేవారు బిగుతుగా ఉండే వాటిని వేసుకోకూడదు. ఇది వారిలో ఒత్తిడిని పెంచుతుంది, ఊపిరాడనివ్వకుండా చేస్తుంది.
బిగుతుగా ఉండడం వల్ల చాలా భాగానికి రక్తప్రసరణ సరిగా జరగదు. అలాగే రొమ్ములకు కూడా రక్తప్రసరణ సవ్యంగా జరగక ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి కాస్త వదులుగా ఉండే బ్రాలు వేసుకోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మీ శరీర సౌష్టవం కూడా అందంగా కనిపిస్తుంది.
టాపిక్