Old Bra Side Effects : పాత బ్రాను పదే పదే వాడుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే ఉపయోగించరు
Old Bra Side Effects In Telugu : బట్టలపై ఎక్కువ ఆసక్తి ఉన్నా.. చాలామంది లోదుస్తులను నిర్లక్ష్యం చేస్తారు. చిరిగిపోయిన పాత బ్రాలను ధరిస్తారు. ఎందుకంటే వాటిని ఎవరూ చూడలేరు. కానీ మీరు ఇలా పాత బ్రాను ధరిస్తే.. కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.
బట్టలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. పాత, మురికి బట్టలు ధరించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా లోదుస్తుల విషయంలో రాజీ పడకూడదు. పాత లోదుస్తులు ధరించడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది.
ఇప్పుడు దాదాపు అందరు మహిళలు బ్రాలు ధరిస్తున్నారు. ఇది మహిళల అవసరాలలో ఒకటిగా మారిపోయింది. బ్రా లేకుంటే బయటకు వెళ్లలేని పరిస్థితి. అయితే కొంతమంది బ్రాలు తరచుగా మార్చుకోరు. వాటిని చాలా సంవత్సరాలు ఉపయోగిస్తారు. దీంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. మనం ఉపయోగించే అన్ని వస్తువుల మాదిరిగానే బ్రాలకు కూడా గడువు తేదీ ఉంటుంది. ఆ సమయం తర్వాత ఉపయోగించడం మంచిది కాదు.
బ్రాను కొన్ని రోజులు ఉపయోగించిన తర్వాత, మళ్లీ వాష్ చేస్తూ అదే ఉపయోగిస్తారు. దీనివల్ల బ్రా మారిపోతుంది. సైజ్ కూడా ఛేంజ్ అవుతుంది. ఇలాంటి బ్రాలు ధరించడం వల్ల చర్మం పగుళ్లు, ఎరుపు, చర్మ సున్నితత్వం ఏర్పడవచ్చు. అలాగే, పాత బ్రాల నుండి మరకలను తొలగించడం కష్టం. చెమట, ఆయిల్ నుండి బ్యాక్టీరియా పెరగడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు, ఇతర చర్మ సమస్యలు సంభవించవచ్చు.
బ్రా చాలా బిగుతుగా ఉంటే, సరిగ్గా ఫిట్ లేకుంటే అది రోజంతా చికాకు కలిగిస్తుంది. ఇది శ్వాస సమస్యలను కూడా కలిగిస్తుంది. చాలా బిగుతుగా ఉండే బ్రాను ధరించడం వల్ల ఛాతీకి, పొత్తికడుపుకు రక్త ప్రసరణ నిరోధిస్తుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
సంవత్సరాల తరబడి పాత బ్రా ధరించడం వల్ల అది ఫిట్‌గా ఉండదు. బ్రా సరిగ్గా సరిపోకపోతే రొమ్ముల ఆకారాన్ని కూడా మారుస్తుంది. అందువల్ల, సరిగ్గా సరిపోని బ్రాలను ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల వెన్ను, భుజం నొప్పి వస్తుంది.
వదులుగా ఉన్న బ్రాలు శరీరానికి సరిగ్గా మద్దతు ఇవ్వనప్పుడు, అది శరీర భంగిమను కూడా మారుస్తుంది. దీని కారణంగా శరీరం ముందుకు వంగి ఉంటుంది.
రొమ్ము కింద, శరీరం చుట్టూ నల్లటి మచ్చలు, గీతలు పాత బ్రా లేదా సరిగ్గా సరిపోని బ్రా ధరించడం వల్ల సంభవించవచ్చు. ఇది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీకు నచ్చిన దుస్తులను మీరు ధరించలేకపోవచ్చు. ఇవి శారీరక ఆకర్షణను కూడా తగ్గిస్తాయి.
సందర్భానుసారంగా దుస్తులు ధరించడం ప్రస్తుత ట్రెండ్. అటువంటి ఫ్యాషన్ దుస్తులను ధరించేటప్పుడు లోదుస్తులను సరిగ్గా అమర్చడం కూడా ముఖ్యం. పాత బ్రాలు వాడి వాడి వదులుగా అయిపోతాయి. దీంతో రొమ్ము ఆకారాన్ని పాడు చేస్తుంది. ఇది ఏ దుస్తులతోనూ బాగా కనిపించదు. కాబట్టి బ్రా ఫిట్టింగ్ చెడిపోయి, మరకలు ఉంటే.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెంటనే బ్రాని మార్చండి.