Leftover Rice Recipes : అన్నం మిగిలిపోయిందని ఆలోచిస్తున్నారా? ఈ 5 వంటకాలు ట్రై చేయండి-how to prepare food items with leftover rice heres 5 easy recipes for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  How To Prepare Food Items With Leftover Rice Here's 5 Easy Recipes For You

Leftover Rice Recipes : అన్నం మిగిలిపోయిందని ఆలోచిస్తున్నారా? ఈ 5 వంటకాలు ట్రై చేయండి

HT Telugu Desk HT Telugu
Sep 16, 2023 01:00 PM IST

Leftover Rice Recipes : అన్నం మిగిలిపోయిందని బాధపడుతున్నారా? ఇక బయటపడేయాలని అనుకుంటున్నారా? కానీ మిగిలిపోయిన అన్నంతో కొన్ని టేస్టీ.. టేస్టీ వంటకాలు చేసుకోవచ్చు.

మిగిలిపోయిన అన్నంతో రెసిపీలు
మిగిలిపోయిన అన్నంతో రెసిపీలు (unsplash)

సాధారణంగా ఇంట్లో అందరూ తిన్న తర్వాత అన్నం మిగులుతుంది. మిగిలిపోయిన అన్నంతో ఏం చేయాలో పాలుపోక చాలా మంది ఆందోళన చెందుతారు. అరే ఇంత అన్నం వేస్ట్ అయిందేనని బాధపడుతారు. ఇకపై అలాంటి బాధ అవసరం లేదు. మిగిలిన అన్నంతో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

రెసీపీ 1

మిగిలిపోయిన అన్నం నుండి రుచికరమైన క్రిస్పీ దోసెను తయారు చేయవచ్చు. దీని కోసం ఒక కప్పు రవ్వ తీసుకోండి. మిగిలిపోయిన అన్నం ఒకటిన్నర కప్పులు తీసుకోండి. ఒక కప్పు పుల్లటి పెరుగు, రుచికి ఉప్పు, బేకింగ్ సోడా తీసుకోండి. రవ్వను మిక్సీ జార్ సహాయంతో గ్రైండ్ చేయండి. అదే జాడీలో అన్నం వేసి రుబ్బుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు వేసి కొన్ని సెకన్ల పాటు గ్రైండ్ చేయాలి. ఒక కప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. ఈ పిండిని ఒక పాత్రలో వేసి మూత పెట్టాలి. పది నిమిషాలు అలాగే ఉంచండి. దీని తర్వాత కొంచెం బేకింగ్ సోడా జోడించండి. రుచికి ఉప్పు కలపండి. బాణలిలో దోసె చేసుకోవాలి. దోసెపై కొద్దిగా నెయ్యి రాస్తే వావ్ సూపర్ ఉంటుంది.

రెసిపీ 2

ఒక కప్పు అన్నం తీసుకోండి. దీన్ని చెంచాతో లేదా చేతితో మెత్తగా చేయాలి. గట్టిగా ఉంటే కాసేపు ఉడికించాలి. ఈ రైస్ బాల్‌లో 5 టేబుల్ స్పూన్ల శెనగపిండి, 1 మీడియం-సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ (లేదా ½ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ), 1 అంగుళం సన్నగా తరిగిన లేదా తురిమిన అల్లం, 1 తరిగిన పచ్చిమిర్చి (లేదా ½ టీస్పూన్ ఎర్ర మిరపకాయ) జోడించండి. ¼ కప్ తరిగిన కొత్తిమీర ఆకులు, ½ టీస్పూన్ జీలకర్ర పొడి, ½ టీస్పూన్ ధనియాల పొడి, ¼ టీస్పూన్ పసుపు పొడి, 1 చిటికెడు ఇంగువ, రుచికి ఉప్పు వేసి బాగా కలపండి. యాభై నిమిషాలు. చిన్న చిన్న ఉండలుగా పకోడిలాగా వేసుకోండి. నూనెలో వేయించాలి.

రెసిపీ 3

మిగిలిపోయిన అన్నంతో పులిహోర వంటివి చేయకూడదనుకుంటే.. రుచికరమైన కట్లెట్స్ తయారు చేసుకోవచ్చు. రెండు ఉడికించిన బంగాళదుంపలు, ఒక కప్పు బియ్యం తీసుకోండి. చిక్పీస్ కూడా ఉడికించాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి వంటివి వేసి పిండిలా చేసుకోవాలి. తర్వాత చిన్న బాల్‌లా చేసుకోవాలి. తర్వాత కట్లెట్ ఆకారంలో చదును చేయాలి. పిల్లలకు నచ్చే ఆకారాన్ని తయారు చేసి నూనెలో వేయించాలి.

రెసిపీ 4

చాలా మంది మిగిలిపోయిన అన్నంతో పులిహోర తయారు చేస్తారు. అలా కాకుండా లెమన్ రైస్ కూడా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం ఉపయోగించవచ్చు. కొన్ని పచ్చి మిర్చి, కొన్ని పల్లి గింజలు, నిమ్మకాయ కలిపి చేసుకుంటే లెమన్ రైస్ అవుతుంది.

రెసీపీ 5

ఇవేమీ వద్దు అనుకుంటే.. పులిహోర కూడా చేసుకోవచ్చు. కొంతమందికి పులిహోర ఇష్టం ఉంటుంది. కాస్త చింతపండు ముందుగా నానబెట్టాలి. కొన్ని పల్లి గింజలు, రెండు ఎండు మిర్చి తీసుకోవాలి, ఓ మూడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. చింతపండు నుంచి నీళ్లను వేరు చేయాలి. పులిహోర మదిరిగా చేసుకుని.. అందులో రైస్ కలుపుకోవాలి.