Chicken Keema Masala : చికెన్ కీమా మసాలా.. ఇలా సింపుల్‌గా తయారు చేయాలంతే-how to prepare chicken keema masala step by step process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Keema Masala : చికెన్ కీమా మసాలా.. ఇలా సింపుల్‌గా తయారు చేయాలంతే

Chicken Keema Masala : చికెన్ కీమా మసాలా.. ఇలా సింపుల్‌గా తయారు చేయాలంతే

Anand Sai HT Telugu
Mar 17, 2024 11:00 AM IST

Chicken Keema Masala : ఆదివారం వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో నాన్ వెజ్ ఉండాల్సిందే. అందులో చికెన్‌ను చాలా మంది ఇష్టపడుతారు. అయితే కొత్తగా చికెన్ కీమా మసాలా ట్రై చేయండి.

చికెన్ కీమా మసాలా
చికెన్ కీమా మసాలా (Unsplash)

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే చాలా ఇష్టం. దీనితో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటారు. ఈ రోజు ఇంట్లో పూరీని తయారు చేయబోతున్నట్లయితే దాని కోసం చికెన్ సైడ్ డిష్ చేయడానికి ప్లాన్ చేయండి. సాధారణ చికెన్ గ్రేవీ లేదా మసాలా చేయడానికి బదులుగా చికెన్ కీమా మసాలా తయారు చేయండి.

ఈ చికెన్ కీమా మసాలా పూరీ, చపాతీతో రుచికరంగా ఉంటుంది. ఇంతకు ముందెన్నడూ చికెన్ కీమా తయారు చేయకపోతే, ఈరోజే ట్రై చేయండి. ఈ కీమా మసాలా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. కొత్త రెసిపీ.. కొత్త రుచి కూడా ఉంటుంది. కావాలనుకుంటే దీనిని అన్నంలోకి కూడా తినవచ్చు. చికెన్ కీమా మసాలా ఎలా చేయాలో చూడండి.

చికెన్ కీమాకు కావాల్సిన పదార్థాలు

నూనె - 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క - 1 ముక్క, సోంపు - 1/4 tsp, ఉల్లిపాయ - 2 (సన్నగా తరిగినవి), కరివేపాకు - కొన్ని, పచ్చిమిర్చి - 2, ఉప్పు - రుచి ప్రకారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp, టొమాటో - 2, పసుపు పొడి - 1/4 tsp, బెల్లం పొడి - 2 tsp, చికన్ మసాలా - 3/4 tsp, కారం పొడి - 1/2 tsp, జీలకర్ర పొడి - 1/4 tsp, గరం మసాలా - 1/2 tsp, మిరియాల పొడి - 1/4 tsp, చికెన్ కీమా- అర్ధ కిలో, వెల్లుల్లి - కొన్ని, యాలకుల పొడి - 1 చిటికెడు, నీరు - కావలసినంత, వెన్న - 1/2 tsp, కొత్తిమీర - కొద్దిగా

చికెన్ కీమా తయారు చేసే విధానం

ముందుగా ఓవెన్‌లో కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక దాల్చిన చెక్క, ఇంగువ వేసి మసాలా చేసుకోవాలి.

తర్వాత ఉల్లిపాయలు వేసి రంగు మారే వరకు వేయించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి బాగా వేగించాలి.

ఇప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

తర్వాత తురిమిన టొమాటోలు వేసి 5 నిమిషాలు మెత్తగా అయ్యేవరకు వేయించాలి.

పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి 3 నిమిషాలు బాగా కలపాలి.

తర్వాత చికెన్ కీమా మసాలాలో వేసి, యాలకులపొడి వేసి బాగా తిప్పుకోవాలి. మూత పెట్టి చికెన్ ను 5 నిమిషాలు ఉడకనివ్వాలి.

మసాలాకు కావల్సినంత నీళ్లు పోసి, కావాలంటే ఉప్పు వేసి బాగా తిప్పుకోవాలి.

తక్కువ మంట మీద ఉంచి చికెన్ ను 10 నిమిషాలు ఉడికించాలి.

10 నిమిషాల తర్వాత మూత తెరిచి వెన్న, కొత్తిమీర చల్లి తిప్పితే రుచికరమైన చికెన్ కీమా మసాలా రెడీ. ఇక టేస్టీ.. టేస్టీగా లాగించేయండి.

Whats_app_banner