Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కోవడం ఎలా? మధుమేహంలో ఫ్యాటీ లివర్ తగ్గించడం కూడా సాధ్యమే
Fatty Liver: మధుమేహ రోగులు ఎదుర్కొనే సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి టైప్ 2 డయాబెటిస్‌లో ఊబకాయంతో పాటు ఫ్యాటీలివర్ కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతుంది. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, దీనికి పూర్వపు స్థితికి చేర్చడం సాధ్యమేనా అంటే సాధ్యమేనని పరిశోధనలు చెబుతున్నాయి.
Fatty Liver: కాలేయం ఆహారాన్ని శక్తిగా మార్చడంలోను, తయారు చేయడంలోను కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణప్రక్రియ అయ్యాక పోషకాలు కాలేయాన్ని చేరతాయి. కొవ్వుల రూపంలో శరీరం శక్తిని నిల్వ చేస్తుంది. ఆ కొవ్వు నిల్వలతో వచ్చే వ్యాధుల ప్రభావం కాలేయంపై ఉంటుంది.
కొవ్వులన్నీ ఒకే రకంగా తయారవ్వవు. ఆహారంద్వారా చేరే అదనపు కొవ్వులు కాలేయంలోకి పోకుండానే శరీరంలో ఎక్కడైనా నిల్వ ఉంటాయి. చర్మం కింద పోగయ్యే కొవ్వులు చూడ్డానికి ఇబ్బందిగా అనిపించినా, వాటివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తక్కువే ఉంటాయి.
మరోవైపు పిండి పదార్ధాలు, మాంసకృత్తులు రెండూ గ్లైకోజన్ రూపంలో కాలేయంలో నిల్వ ఉంటాయి. గ్లైకోజన్ పూర్తిగా నిండిపోయాక డిఎన్ఎల్ ప్రక్రియలో గ్లూకోజు కొవ్వుగా మారుతుంది. పొట్టలోని అంతర్గత అవయవాలతో సహా శరీరంలోని అన్ని భాగాలకు ఈ కొవ్వు నిల్వలు చేరుకుంటాయి.
డిఎన్ఎల్ ద్వారా కొవ్వు తయారీ కాలేయం శక్తికి మించినప్పుడు ఇతర భాగాలకు పంపలేక అది కాలేయంలోనే పేరుకుపోతుంది. శరీరంలో సెంట్రల్ ఒబేసిటి పెరగడానికి ఇది కూడా దోహదపడి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఎక్కువ చక్కెరలు, ఇన్సులిన్లు దీర్ఘకాలంలో ఊబ కాలేయానికి దారి తీస్తాయి.
ఫ్యాటీ లివర్ కారణాలేంటి..?
కాలేయంలో కొవ్వు నిల్వలు బాగా నిండిపోయిన దశలో ఊబ కాలేయం లేదా ఫ్యాటీ లివర్ గ్లూకోజును స్వీకరించలేక ఇన్సులిన్ నిరోధకతను పెంచుకుంటుంది. అప్పుడు గ్లూకోజు రక్తంలోకి చేరుతుంది.
1) అధిక ఇన్సులిన్ వల్ల ఊబ కాలేయం వస్తుంది
2) ఊబ కాలేయం వల్ల ఇన్సులిన్ నిరోధకత వస్తుంది.
3) ఇన్సులిన్ నిరోధకత మరింత అదనపు ఇన్సులిన్ విడుదలకు కారణమవుతుంది.
4) ఇదే చక్రం తిరిగి కొనసాగుతుంది.
శరీర ఊబకాయం కన్నా కాలేయంలోని కొవ్వు ఇన్సులిన్ నిరోధకతకూ మధుమేహానికి దారితీయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఊబకాయం రావడం, తర్వాత ముందస్తు మధుమేహం, తర్వాత పూర్తి స్థాయి మధుమేహం-ఈ మూడు దశల్లోను ఊబ కాలేయం ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోను, ఆదిమ జాతులతో సహా ఈ రకమైన పరిస్థితిని గుర్తించారు.
ఊబ కాలేయం వచ్చిందంటే ఇన్సులిన్ నిరోధకత, అధిక ఇన్సులిన్ సమస్యలు ఆరంభమైనట్లేనని భావించాల్సి ఉంటుంది. లివర్ స్కానింగ్‌తో పాటు ద్వారానేగాక నడుము కొలత పెరగడాన్ని బట్టి కూడా ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించవచ్చు.
ఆల్కహాల్ కూడా కారణమే…
ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ తాగే వాళ్లకు కూడా వస్తుంది. ఆల్కహాల్ తాగడం పెరిగే కొద్ది కాలేయం దెబ్బతింటుంది. ఆల్కహాల్‌ను జీర్ణం చేయగలిగింది శరీరంలో కాలేయం మాత్రమే. ఆల్కహాల్ దీర్ఘకాలంగా తీసుకుంటే ఊబకాలేయం వస్తుంది. అయితే ఊబకాలేయులు, మధుమేహులలో ఎక్కువ మంది ఆల్కహాల్ అలవాటు లేని వాళ్లే ఉంటారు వారిలో కూడా ఫ్యాటీ లివర్ సమస్యను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు.
ఆల్కహాల్ అలవాటు లేని ఊబకాయం
నాన్ ఆల్కహాలిక్ ఫాటి లివర్ డిసీజ్‌లలో ఊబకాయానికున్న న్యూరో హార్మోన్ ప్రాతిపదికలేమిటన్న పరిశోధనలు జరిగాయి. ఊబకాయం, హైపర్ ఇన్సులినేమియా, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఊబకాలేయాల మధ్య చాలా దగ్గరి సంబంధాన్ని గమనించారు. ఇందులో ఏ ఒకదాన్ని అయినా కనుగొన్నామంటే మిగిలినవి కూడా ఉండి ఉంటాయనుకోవచ్చు.
ఊబకాయుల్లో 5 నుండి 55 శాతం మందిలో ఊబ కాలేయం ఉంటుంది. మధుమేహుల్లో 85 శాతం మందిలో ఊబకాలేయం ఉంటుంది. మధుమేహం లేకుండా ఇన్సులిన్ నిరోధకత మాత్రమే ఉన్నవాళ్లలో కాలేయంలో అధిక శాతం కొవ్వు ఉంది. ఊబకాలేయం ఉన్న వారిలో మూడింట రెండొంతులు (2/3) మందిలో ఎన్ఎఫ్ఎల్డీ సమస్య ఉంది. ఊబకాయం, మధుమేహం -2లతో పాటు ఎన్ఎఫ్ఎల్ సమస్య పిల్లల్లోను, పెద్దల్లోను ప్రమాదకర స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
కాలేయంలో కొవ్వు చేరడం (హెపాటిక్ స్టిమాటోసిస్) అన్నది ఇన్సులిన్ నిరోధకత ఉందనడానికి చిహ్నం. ఊబకాయం ఉన్న పిల్లల్లో కాలేయం దెబ్బతినడం (డామేజ్) ను సూచించే అలనైన్ ట్రాన్స్ అమినేస్ (ఎఎల్) అనేది ఇన్సులిన్ నిరోధకతతోను, మధుమేహం-2 తోను సన్నిహితంగా ముడిపడి ఉంది.
ఊబకాలేయం తరువాత ముందస్తు మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత, బీటా కణాలు పని చేయక పోవడంలతో ముడిపడి ఉంది. ఎన్ఎస్పాచ్ చివరకు లివర్ సిర్రోసిస్ వైపునకు దారి తీస్తుంది. ఇది రావడమంటే చివరి దశలో కాలేయ మార్పిడే దీనికి పరిష్కారం అవుతుంది.
ఇవన్నీ భయం గొలిపేవే సమస్యలు. కొంతమందిలో కాలేయంలో కొవ్వులు తక్కువగా ఉండి కూడా ఎక్కువగా దెబ్బతినడంపై పరిశోధనలు జరుగుతున్నాయి.
టైప్2 లో రివర్స్ చేయొచ్చు…
మధుమేహం-2 ఉన్న వారిలో ఊబకాలేయాన్ని కొద్ది వారాల్లోనే వచ్చేలా చేయవచ్చని స్పష్టమైంది. అదనపు గ్లూకోజు, ఇన్సులిన్లు కొత్త కొవ్వును డిఎస్ఎల్ ద్వారా తయారు చేయిస్తాయి. కాలేయంలో తయారైన కొవ్వును బయటకు పంపే వేగం కన్నా ఈ వేగం (డిఎన్ఎల్) పెరిగితే కొవ్వులు కాలేయంలో పోగుపడతాయి. దీనికి ఎంతో కష్టపడనక్కర్లేదు. అధికంగా చక్కెరలు తింటే చాలు, ఊబ కాలేయం వస్తుంది.
దీనిపై జరిగిన పరిశోధనల్లో అధిక బరువు ఉన్నవారికి రోజుకు 1000 కేలరీలు అదనంగా చక్కెరతో కూడిన చిరుతిండ్లు ఇచ్చి చూశారు. (ఒక గ్లాసు పండ్ల రసం లేదా 2 సీసాల కోకోకోలాలు) 3 వారాల తరువాత వారి బరువు 2 శాతమూ, కాలేయపు కొవ్వులు 27 శాతమూ పెరిగాయి. వారు తిరిగి మామూలు ఆహారానికి వచ్చినప్పుడు బరువు, కాలేయ కొవ్వులు తగ్గిపోయాయి. 4 శాతం బరువు తగ్గితే కాలేయపు కొవ్వు 25 శాతం తగ్గింది.
దీన్ని బట్టి ఊబకాలేయం (ఫాటీ లివర్) అన్నది ఖచ్చితంగా తిరిగి వెనక్కి తీసుకురావొచ్చని గుర్తించారు. కాలేయంలోని గ్లూకోజును ఖాళీ చేయించడం, ఇన్సులిన్ స్థాయిలు తగ్గించడం ద్వారా కాలేయం సాధారణ స్థితికి వస్తుంది. అధిక ఇన్సులిన్ కారణంగానే డిఎన్ఎల్ వేగం పెరిగి ఊబకాలేయపు సమస్యకు దారి తీస్తోంది.
శుద్దిచేసిన పిండి పదార్థాలు కొవ్వుల ఈ విషయంలో ప్రమాదకరం. పిండి పదార్థాలు ఎక్కువగా తినడం డిఎన్ఎల్ ను పది రెట్లు పెంచుతుంది. కొవ్వులు అదనంగా తీసుకున్నా కాలేయపు కొవ్వు పెరగదు.
ఈ విషయంలో చక్కెరలోని గ్లూకోజు కన్నా ఫ్రక్టోజు ఎక్కువ హాని చేస్తుంది. దాన్ని ముందు అధ్యాయంలో చూస్తాం. మధుమేహం-1 లో ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల కాలేయంలో కొవ్వు తగ్గుతుందని గుర్తించారు. ఇన్సులిన్ నిరోధకత వల్ల వచ్చే ప్రమాదాల్లో ఊబకాలేయం ఆరంభం మాత్రమే. దానిని ప్రారంభ దశలోనే మందులు లేకుండా నిరోధించవచ్చు.