Tea coffee cravings: టీ, కాఫీలపై మనసు పడుతున్నారా? ఈ 6 టిప్స్‌తో తప్పించేయండి-how to control tea and coffee cravings during winter expert offers 6 tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tea Coffee Cravings: టీ, కాఫీలపై మనసు పడుతున్నారా? ఈ 6 టిప్స్‌తో తప్పించేయండి

Tea coffee cravings: టీ, కాఫీలపై మనసు పడుతున్నారా? ఈ 6 టిప్స్‌తో తప్పించేయండి

HT Telugu Desk HT Telugu
Jan 02, 2023 01:52 PM IST

Tea coffee cravings: టీ, కాఫీలు ఇష్టపడని వారు అరుదు. వీటిని ఎక్కువగా తీసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్. మరి వీటి నుంచి దూరం కావాలంటే ఏం చేయాలి?

టీ, కాఫీలకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారా?
టీ, కాఫీలకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారా? (Unsplash)

అందరికీ ఇష్టమైన సీజన్లలో వింటర్ ఒకటి. వెచ్చగా ఉండేందుకు వేడివేడి పానీయాలు అందరూ ఇష్టపడతారు. ఎక్కువగా టీ, కాఫీల మీద మనసు పడతారు. అయితే కెఫైన్ మీద ఎక్కువగా ఆధారపడితే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. డీహైడ్రేషన్, ఎసిడిటీ, పోషకాలు ఒంటబట్టకపోవడం, నిద్రలేమి, యాంగ్జైటీ, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

కెఫైన్ మీ మూడ్‌ను ఉత్తేజపరుస్తుంది. చలికాలంలో కాస్త సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది. చురుగ్గా ఉండేలా చేస్తుంది. అయితే ఇది వ్యసనం లాంటిది. మన ఆరోగ్యానికి చేటు చేస్తుంది. వ్యసనాలు అనారోగ్యకరమని తెలిసినా అవి ఇచ్చే సంతృప్తిని మెదడు వాటిని అంగీకరిస్తుంది. టీ, కాఫీ, లేదా షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్ వేటిపైనైనా ఆధారపడే వారు ఈ అపరాధకరమైన ఆనందాన్ని పొందుతుంటారు. కెఫైన్‌ను ఒక్కసారిగా పక్కనపెట్టడం వల్ల విత్‌డ్రాయల్ సింప్టమ్స్ ఎదురవుతాయి. తలనొప్పి, తలతిరగడం, చికాకు, మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల మీరు కెఫైన్‌ను క్రమంగా నెమ్మదిగా నియంత్రించుకోవడం మేలు.

ఫిట్‌నెస్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్, స్టెడ్‌ఫాస్ట్ న్యూట్రిషన్ ఫౌండర్ అమన్ పురి హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెఫైన్ తగ్గించడంపై మాట్లాడారు.

  1. వేడి కాఫీ, హాట్ చాక్లెట్‌‌క బదులుగా పసుపు పాలు లేదా ఇంట్లో తయారు చేసిన యాలకుల ఫ్లేవర్ ఉన్న బాదాం మిల్క్ తీసుకోండి. పసుపు, యాలకులు యాంటాక్సిడెంట్లుగా పనిచేస్తూ, మీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. ఇక బాదాం విటమిన్ ఇ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది. ఇక సాయంత్రం టీ, కాఫీకి బదులుగా కృత్రిమ పదార్థాలు, ప్రిజర్వేటివ్స్ లేని హోమ్ మేడ్ హాట్ సూప్ కూడా బాగుంటుంది.
  2. టీ ప్రియులు హోమ్ మేడ్ హెర్బల్‌ టీకి మారొచ్చు. ప్యాకేజ్డ్ మసాలా టీ కంటే తాజా సుగంధ ద్రవ్యాలు దాల్చిన చెక్క, తులసి, లవంగం, యాలకులు, అల్లం వంటి వాటితో చేసిన హెర్బల్ టీ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆర్గానిక్ తేనె, బెల్లం, కొబ్బరి చక్కెర, లేదా స్టీవియా వాడుకోవచ్చు. కాఫీ ప్రియులైతే డీకెపైనేటెడ్ కాఫీని ప్రత్యామ్నాయంగా చూడొచ్చు. దీని ద్వారా కెఫైన్ అడిక్షన్‌ను నివారించవచ్చు.
  3. టీ విషయంలో మార్కెట్లో ఉన్న ఇతర ప్రత్నామ్నాయాలను వెతకొచ్చు. గ్రీన్ టీ, జాస్మిన్, లావెండర్, లెమన్ గ్రాస్, స్ట్రాబెర్రీ టీ వంటి ప్రత్యామ్నాయాలు కేవలం మిమ్మల్ని రిఫ్రెష్ చేయడం మాత్రమే కాకుండా వాటిలో ఉండే యాంటాక్సిడెంట్లు మీ శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి.
  4. రెగ్యులర్ టీ, కాఫీకి బదులుగా తాజాగా చేసిన అల్లం-తేనె లెమన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. సీజనల్ జలుబు, దగ్గులను నివారిస్తుంది. మీ శరీరాన్ని అల్లం వెచ్చగా ఉంచుతుంది. వింటర్‌లో వచ్చే కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్‌ను తగ్గిస్తుంది.
  5. టీ, కాఫీలతో మీ రోజును ప్రారంభించడానికి బదులు ఒక గ్లాసు గోరువెచ్చని లెమెన్ వాటర్ తాగితే మీ జీర్ణ క్రియ మెరుగుపడడమే కాకుండా మీ పీహెచ్ లెవెల్స్‌ను క్రమబద్ధం చేస్తుంది. రోజూ మీ శరీరానికి కావాల్సిన విటమన్ సీ అందిస్తుంది. శరీరంలో మలినాలను తొలగిస్తుంది.
  6. శరీరం చురుగ్గా, అప్రమత్తంగా ఉంచడంలో ఆపిల్స్ కాఫీ తరహాలో బాగా పనిచేస్తాయని అధ్యయనాలు తేల్చాయి. అందులవల్ల ఉదయం వేళ టీ, కాఫీకి బదులుగా ఆపిల్ తినడం వల్ల మీ రోజు గొప్పగా ప్రారంభమవుతుంది.

Whats_app_banner