Coffee affects hypertension: హైబీపీ ఉందా.. 2 కప్పుల కాఫీ తాగితే ఆ ముప్పు-study reveals drinking 2 cups of coffee daily may double risk of heart death in people with hypertension ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coffee Affects Hypertension: హైబీపీ ఉందా.. 2 కప్పుల కాఫీ తాగితే ఆ ముప్పు

Coffee affects hypertension: హైబీపీ ఉందా.. 2 కప్పుల కాఫీ తాగితే ఆ ముప్పు

HT Telugu Desk HT Telugu
Dec 22, 2022 03:30 PM IST

Coffee affects hypertension: కాఫీ ప్రియులకు హెచ్చరిక. ఒకవేళ మీకు హైబీపీ ఉన్నట్టయితే.. 2 కప్పుల కాఫీ తాగుతున్నట్టయితే అది మీ ప్రాణాలకే ముప్పు అని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.

హైబీపీ ఉన్న వారు కాఫీ తాగడం ప్రాణాంతకమని చెబుతున్న తాజా అధ్యయనం
హైబీపీ ఉన్న వారు కాఫీ తాగడం ప్రాణాంతకమని చెబుతున్న తాజా అధ్యయనం

Coffee affects hypertension: తీవ్రమైన హైపర్‌టెన్షన్ ఉన్న వారు రోజుకు 2 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగితే గుండెజబ్బుల వల్ల మరణించే ప్రమాదం రెట్టింపు అవుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. తీవ్రమైన హైపర్‌టెన్షన్ అంటే 160/100 ఎంఎం హెచ్‌జీ లేదా అంతకంటే ఎక్కువని అధ్యయనం ప్రస్తావించింది.

అయితే కాఫీలోనూ, గ్రీన్ టీలోనూ కెఫైన్ ఉన్నప్పటికీ ఒక కప్పు కాఫీ గానీ, ఒక కప్పు గ్రీన్ టీ గానీ తాగిన వారిలో కార్డియోవాస్కులర్ జబ్బుల వల్ల మరణించే ప్రమాదం పెరగదని గమనించినట్టు అధ్యయనం తేల్చింది. ఒక కప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీలో 30 నుంచి 50 మిల్లీగ్రాముల కెఫైన్ ఉంటుంది. అయితే కప్పు కాఫీలో 80 నుంచి 100 మి.గ్రా. కెఫైన్ ఉంటుంది.

హార్ట్ అటాక్ నుంచి కోలుకున్న వారిలోనూ, అలాగే ఆరోగ్యవంతుల్లోనూ రోజుకు ఒక కప్పు కాఫీ తాగితే గుండె జబ్బుల ముప్పు నుంచి తప్పించుకోవడంలో సాయపడుతుందని గత అధ్యయనాలు తేల్చాయి. రెగ్యులర్‌గా కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుందని కూడా గతంలో కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. డిప్రెషన్ తగ్గిస్తుందని, అలెర్ట్‌నెస్ పెంచుతుందని కూడా చెప్పాయి. అయితే కాఫీ ఎక్కువగా తాగుతుంటే మాత్రం బ్లడ్ ప్రెజర్ పెరుగుతుందని, యాంగ్జైటీకి దారితీస్తుందిన, నిద్ర సమస్యలు ఎదురవుతాయని కూడా గతంలో అధ్యయనాలు తేల్చాయి.

‘కాఫీ వల్ల ఉన్న సానుకూల ఫలితాలు హైపర్‌టెన్షన్ పేషెంట్లకు కూడా వర్తిస్తాయా? వీరిపై గ్రీన్ టీ ప్రభావం ఎలా ఉంటుంది? అన్న అంశాలను తేల్చే లక్ష్యంతో మా అధ్యయనం సాగింది..’ అని నేషనల్ సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ అండ్ మెడిసిన్ ఇన్ టోక్యో డైరెక్టర్ హిరోయసు ఇసో తన అధ్యయనంలో వివరించారు. ‘మాకు తెలిసినంత వరకు తీవ్రమైన హైపర్‌టెన్షన్ ఉన్న పేషెంట్లుపై రోజు 2 కప్పుల కాఫీ తాగడం వల్ల ఎదురయ్యే ప్రభావంపై అధ్యయనం జరపడం ఇదే తొలిసారి..’ అని వివరించారు.

హై బ్లడ్ ప్రెజర్‌నే హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. రక్తం నెట్టడానికి శక్తి స్థిరంగా చాలా ఎక్కువగా అవసరమైనప్పుడు ఇది సంభవిస్తుంది. తద్వారా గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పని చేస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ప్రకారం బ్లడ్ ప్రెజర్ 130/80 mm Hg లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే రక్తపోటు ఉన్నట్టు లెక్క.

WhatsApp channel