Holi Celebrations 2022 |హోలీ వేడుకల్లో.. కళ్లను కాపాడుకోవడం ఎలా?
హోలీ దాదాపుగా వచ్చేసింది. పిల్లలు, పెద్దలు అందరూ సరదాగా ఆడి పడి సమయం దగ్గర్లోనే ఉంది. వేడుకల్లో ఆనందంలో తేలిపోతూ రంగులతో విచ్చలవిడిగా ఆడుకుంటాం. ఈ క్రమంలో కళ్లలోకి రంగలు వెళ్లే ప్రమాదముంది. ఈ రంగులు కళ్లను ఎంత బాధిస్తాయో చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మరి హోలీ నుంచి కళ్లను కాపాడుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం.
Protecting Eyes From Colors | హోలీ పండుగ అంటే రంగుల కలయిక. ఆనందం, వినోదం, ఆహారం, నవ్వులు ఇవన్నీ పండుగ సంకేతాలే. ఇళ్లు, వీధులన్నీ రంగులతో ముస్తాబవుతాయి. ప్రజలు తమ కుటుంబం, స్నేహితులు, సమీపంలోని ప్రియమైన వారితో హోలీ జరుపుకునేందుకు సుదూర నగరాల నుంచి తిరిగి వస్తారు. అందరూ ఆహారం, పానీయాలలో మునిగి తేలిపోతారు. ప్రజలు అంతా రంగులతో ఆడుకునే కాలం ఇది. పిల్లలు తమ వాటర్ పిస్టల్, వాటర్ బెలూన్‌లు, గులాల్‌లతో ఆడుకుంటారు. ఈ క్రమంలో హానికరమైన రంగులు మీ కళ్ళు, చర్మంలోకి ప్రవేశించి అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంది.
కొన్నిసార్లు రంగులను తయారు చేయడంలో తీవ్రమైన రసాయనాలను ఉపయోగిస్తారు. వీటి వల్ల చర్మానికి, కళ్లకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటున్నారు ఆప్తాల్మాలజీ హెచ్ఓడీ రిషి భరద్వాజ్. రంగుల నుంచి మీ కళ్లను కాపాడుకోవడానికి రక్షణగా కళ్లద్దాలు, జీరో పవర్ గ్లాసెస్ లేదా సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇవి కళ్లకు రక్షణగా ఉండి రంగులు నేరుగా కళ్లలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.
సహజ రంగులతో
సహజ రంగులతో హోలీ అడుకోవడమే మీకు పర్యవరణానికి మంచిది. ఇవి మీ శరీరానికి, ముఖ్యంగా మీ కళ్ళకు హాని కలిగించవు. పువ్వులు, పసుపుతో చేసిన సాంప్రదాయ సహజ రంగులు ఉత్తమ ఎంపిక.
"అలాగే, మార్కెట్‌లో విక్రయించబడుతున్న రంగులలో ఎక్కువ భాగం ఆస్బెస్టాస్, మెర్క్యురీ, సిలికా, మైకా, సీసం వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉండవచ్చు. ఇవి చర్మం, కళ్ళకు చాలా విషపూరితమైనవి. చికాకు, ఎరుపు, అలెర్జీలను కలిగిస్తాయి." అని రిషి వెల్లడించారు.
కాంటాక్ట్ లెన్స్‌లు ధరించవద్దు
హోలీ ఆడుతున్నప్పుడు కాంటాక్ట్ లెన్స్‌లు ఉపయోగించరాదని రిషి భరద్వాజ్ ఖచ్చితంగా సిఫార్సు చేశారు. కంటి లోపలికి రంగులు వచ్చినప్పుడు, అది కాంటాక్ట్ లెన్స్‌లలో నిక్షిప్తం చేసే ధోరణిని ఎక్కువగా కలిగి ఉంటుందని కాబట్టి హోలీ సమయంలో కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.
మీ కళ్లను రుద్దకండి
ఒక వ్యక్తి చేతిలో రంగులతో కళ్లను రుద్దడం మానుకోవాలి. ఎందుకంటే ఇది కార్నియల్ రాపిడికి కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.