Hop OXO Electric Motorcycle। గంటకు 90కిమీ వేగంతో దూసుకెళ్లే హాప్ ఎలక్ట్రిక్ బైక్-hop oxo electric motorcycle launched at rs 1 25 lakh check features ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hop Oxo Electric Motorcycle। గంటకు 90కిమీ వేగంతో దూసుకెళ్లే హాప్ ఎలక్ట్రిక్ బైక్

Hop OXO Electric Motorcycle। గంటకు 90కిమీ వేగంతో దూసుకెళ్లే హాప్ ఎలక్ట్రిక్ బైక్

HT Telugu Desk HT Telugu
Sep 05, 2022 02:17 PM IST

హాప్ ఎలక్ట్రిక్ నుంచి Hop OXO ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు భారత మార్కెట్లో విడుదల అయ్యాయి. వీటి ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.25 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి

<p>Hop OXO Electric Motorcycle</p>
Hop OXO Electric Motorcycle

జైపూర్‌కు చెందిన EV స్టార్టప్ హాప్ ఎలక్ట్రిక్ తమ బ్రాండ్ నుంచి సరికొత్త Hop OXO ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ HOP OXO అలాగే HOP OXO X అనే రెండు వేరియంట్లలో లభించనుంది. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ అయిన OXO ధర రూ. 1,24,999/- కాగా, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 1,39,999/-

బుకింగ్స్ ప్రారంభమైనాయి, ఇప్పటికే 5 వేల మందికి పైగా ఈ బైక్ కోసం ప్రీ-లాంచ్ రిజిస్ట్రేషన్‌లను చేసుకున్నారని కంపెనీ తెలిపింది. డెలివరీలు అక్టోబర్‌ నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న తమ100 షోరూమ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ CEO, వ్యవస్థాపకుడు కేతన్ మెహతా మాట్లాడుతూ.. "భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్‌ తుఫాను వేగంతో దూసుకుపోతుంది. కస్టమర్లు స్థిరమైన, అనుకూలమైన, సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సెగ్మెంట్లో తమ ఉత్పత్తులకు మంచి వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నాము, మా EV పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము." అని పేర్కొన్నారు.

HOP OXO స్పెసిఫికేషన్స్, రేంజ్

స్టాండర్డ్ వేరియంట్ Hop OXO ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 3.75kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఫుల్ ఛార్జ్‌ మీద 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. Hop OXOను దీనికి అందుస్తున్న పోర్టబుల్ 850W ఛార్జర్‌తో ఏదైనా 16 Amp పవర్ సాకెట్‌ని ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 4 గంటలలోపు బ్యాటరీ ప్యాక్‌ను 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.

HOP OXO X స్పెసిఫికేషన్స్, రేంజ్

Hop OXO X కూడా అదేవిధమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉంటుంది. అయితే OXO X వేరియంట్ అదనపు టర్బో మోడ్‌తో గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుంది. ఈ బైక్ కేవలం 4 సెకన్లలో 0-40 kmph వేగం అందుకుంటుందని నివేదికలు పేర్కొన్నాయి.

హాప్ OXO బైక్ లలో మల్టీ-మోడ్ రీజెనరేటివ్ బ్రేకింగ్, 4G కనెక్టివిటీ, స్పీడ్ కంట్రోల్, జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, రైడ్ స్టాటిస్టిక్స్ వంటి మరెన్నో ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.

Hop OXO ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ భారత మార్కెట్లో Revolt RV400, Tork Kratos అలాగే Oben Rorr వంటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం