Cleaning Ear Wax at Home : మీ చెవులను సహజంగా ఇలా క్లీన్ చేసుకోండి..-home remedies to clean ears in winter and protect from infections ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cleaning Ear Wax At Home : మీ చెవులను సహజంగా ఇలా క్లీన్ చేసుకోండి..

Cleaning Ear Wax at Home : మీ చెవులను సహజంగా ఇలా క్లీన్ చేసుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 19, 2022 12:25 PM IST

Cleaning Ear Wax at Home : చలికాలంలో చెవులు మూసుకుపోయినట్లు అనిపిస్తూ.. ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మీ చెవులను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే సహజమైన మార్గంలో చెవులను శుభ్రం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఆ నివారణలు ఏంటో మీరు తెలుసుకుని.. చెవులను క్లీన్ చేసుకోండి.

చెవులను ఇలా క్లీన్ చేసుకోండి
చెవులను ఇలా క్లీన్ చేసుకోండి

Cleaning Ear Wax at Home : మన చెవులు.. ఇయర్ వాక్స్ అనే సహజమైన మైనపు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మన చెవులను రక్షిస్తుంది. దుమ్ము, ధూళి రానీయకుండా నిరోధిస్తుంది. అయితే చెవి వ్యాక్స్ పేరుకుపోతే.. వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదముంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు.. మీరు చెవులను తరచుగా శుభ్రం చేయాలి. అయితే మీ చెవులను శుభ్రం చేయడానికి ఇయర్‌బడ్‌లు అత్యంత సాధారణ సాధనాలు. అయితే అవి అంత సురక్షితం అని చెప్పలేము. కానీ కొన్ని సహజమైన ఇంటి నివారణలతో ఈ సమస్యను క్లియర్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు నీరు

ఉప్పు నీరు మీ చెవిలో పేరుకుపోయిన మైనపును మృదువుగా చేయడంలో సహాయం చేస్తుంది. తద్వారా మీరు దానిని సులువుగా శుభ్రం చేయవచ్చు. దీనికోసం మీరు.. గోరువెచ్చని నీరు తీసుకోండి. దానిలో ఉప్పు కలపండి. అందులో కాటన్ బాల్స్ ఉంచండి.

మీరు ఏ చెవిని క్లీన్ చేయాలనుకుంటున్నారో.. దానిలో కొన్ని చుక్కలు వేయండి. మూడు నుంచి ఐదు నిమిషాలు నీరు దానిలో ఉండేలా పట్టుకోండి. ఆ వాటర్ బయటకు పోయేలా మీ తలను వంచండి. మెత్తబడిన డస్ట్​ని సున్నితంగా క్లీన్ చేయండి.

ఆలివ్ నూనె

చెవులను క్లీనింగ్ చేయడానికి ఒక గొప్ప హోం రెమెడీ. ఆలివ్ ఆయిల్ మీ చెవిని నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. చెవి పొరలను లైన్ చేయడంలో సహాయపడుతుంది. క్రిమినాశక లక్షణాలతో ప్యాక్ నిండి ఈ ఆయిల్.. చెవిలోని మైనాన్ని సజావుగా తొలగించడంలో మీకు సహాయం చేస్తుంది.

మీ చెవిలో మూడు-నాలుగు చుక్కల గోరువెచ్చని ఆలివ్ నూనె పోసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. మీ తలను వంచి నూనె, మైనాన్ని తొలగించడానికి ఇయర్‌బడ్‌లను ఉపయోగించండి.

వంట సోడా

బేకింగ్ సోడా పొడి.. గట్టిపడిన ఇయర్‌వాక్స్‌ను మృదువుగా చేయడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది సురక్షితమైనది. చెవి ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.

బేకింగ్ సోడాను కొన్ని చుక్కల నీటిలో కరిగించి.. డ్రాపర్ సహాయంతో మీ చెవిలో పోయాలి. ఇది అధిక చెవి వ్యాక్స్‌ను బయటకు పంపుతుంది. పూర్తయిన తర్వాత మీ చెవులను మృదువైన కాటన్ క్లాత్‌తో శుభ్రం చేయండి.

ఆపిల్ సైడర్ వెనిగర్

యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండిన ఆపిల్ సైడర్ వెనిగర్ చెవిలోని హానికరమైన సూక్ష్మజీవులను చంపడానికి, తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే శిలీంధ్రాలతో పోరాడటానికి సహాయపడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటితో కలపండి. ఇయర్ డ్రాపర్ ఉపయోగించి మీ చెవిలో ఐదు నుంచి 10 చుక్కలు వేయండి. చుక్కలు చెవిలో ఐదు నిమిషాలు ఉంచి అనంతరం క్లీన్ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం