Skipping | పావు గంట స్కిప్పింగ్‌తో ఫిట్‌నెస్ మీ సొంతం
Skipping | ఫిట్‌నెస్‌పై అందరికీ అవగాహన పెరిగింది. కొందరు జిమ్‌లకు వెళితే మరి కొందరు రన్నింగ్, సైక్లింగ్.. ఇంకొందరు స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేస్తారు. అయితే స్కిప్పింగ్ చేయడం వల్ల కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
స్కిప్పింగ్ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. రోజూ పావుగంట స్కిప్పింగ్ చేస్తే దాదాపు 300 క్యాలరీలు ఖర్చవుతాయి. స్కిప్పింగ్ ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
- వ్యాయామం చేసేందుకు సమయం లభించదని భావించేవారు స్కిప్పింగ్ చేయొచ్చు. సాయంత్రం వేళల్లో కూడా స్కిప్పింగ్ చేయొచ్చు.
- స్కిప్పింగ్ వల్ల గుండె మెరుగ్గా పనిచేస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగువుతుంది.
- స్కిప్పింగ్ వల్ల శరీరంలోని కొవ్వు త్వరగా కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది.
- రోజూ స్కిప్పింగ్ వల్ల కండరాలకు బలం చేకూరుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయి.
- స్కిప్పింగ్‌కు ముందు 10 నిమిషాలు వార్మప్ చేయడం మంచిది. అలాగే షూస్ ధరించి స్కిప్పింగ్ చేస్తే కాలి వేళ్లపై ఒత్తిడి పడదు
స్కిప్పింగ్ ఎవరెవరు చేయకూడదు?
- గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు స్కిప్పింగ్‌కు బదులు తేలికైన వ్యాయామాలు ఎంచుకోవాలి.
- ఏదైనా శస్త్రచికిత్స జరిగితే... డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే స్కిప్పింగ్ చేయాలి.
- అధిక రక్తపోటు ఉన్నవారు కూడా స్కిప్పింగ్‌ను స్కిప్ చేయాలి. ఎముకలకు సంబంధించిన సమస్య ఉన్న వారు స్కిప్పింగ్ చేయవద్దు.
సంబంధిత కథనం