Cycling: రోజుకి ఎంతసేపు సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది?-health benefits of cycling for daily 30 minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cycling: రోజుకి ఎంతసేపు సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది?

Cycling: రోజుకి ఎంతసేపు సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది?

Himabindu Ponnaganti HT Telugu
Feb 28, 2022 05:25 PM IST

ప్రతిరోజూ సైక్లింగ్ (Cycling) చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సైక్లింగ్ చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

<p>సైక్లింగ్</p>
సైక్లింగ్ (pixabay)

ప్రతిరోజూ సైక్లింగ్ (Cycling) చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సైక్లింగ్ చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజులో ఒక గంటసేపు సైకిల్‌ తొక్కితే సుమారు 300 కేలరీలు ఖర్చవుతాయి. అదే వేగంగా సైకిల్‌ తొక్కితే అంతకు రెట్టింపు స్థాయిలో ఖర్చవుతాయి. రోజూ 100 కేలరీల చొప్పున వారానికి 700 క్యాలరీలను ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ ప్రకారంగా రోజుకి సుమారు ఒక అరగంట పాటు సైకిల్ తొక్కితే చాలు, అనుకున్న మొత్తంలో కేలరీలు ఖర్చుచేయవచ్చు. వ్యాయామం చేయాలనే ఆసక్తి లేనివారు ఇలా సైకిల్ తొక్కి కేలరీలు ఖర్చుచేసుకోవచ్చుననేది నిపుణుల మాట.

మరి సైకిల్‌ తొక్కడం ద్వారా ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

  • క్రమం తప్పకుండా ఓ పద్ధతి ప్రకారం ఇలా జరగడం వలన మన శ్వాసక్రియ మెరుగుపడుతుంది. గుండె, శ్వాస సంబంధ సమస్యలు దూరమవుతాయి.
  • సైకిల్‌ తొక్కడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది దీంతో శరీర బరువును కూడా వేగంగా తగ్గించుకోవచ్చు. అధిక శరీర బరువుతో ఇబ్బందులు పడేవారికి సైక్లింగ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
  • రోజూ కనీసం 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 50 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక సైకిల్‌ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
  • సైకిల్ తొక్కడం వల్ల దాదాపుగా శరీరంలోని అన్ని కండరాలు పనిచేస్తాయి. దీంతో కండరాలు పనులు చేయడానికి అనువుగా మారడంతో పాటు దృఢంగా తయారవుతాయి.
  • రోజూ సైక్లింగ్ చేయడం వలన క్రమంగా శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీంతో ఎక్కువసేపు మీరు మీ భాగస్వామితో శృంగారాన్ని ఆస్వాదించగలుగుతారు. మీ శరీరంలోని మజిల్స్ అన్నీ ఉత్తేజితమై మీరు శారీరకంగానే కాకుండా మానసిక దృఢత్వాన్ని పొందుతారు.
  • సైకిల్ తొక్కే వారిలో జీవక్రియలు మెరుగుపడతాయి. దీంతో శరీరం శక్తిని సక్రమంగా వినియోగించుకోగలుగుతుంది. రోజంతా యాక్టివ్ గా ఉంటారు. కీళ్లు, మోకాళ్లు, ఎముకలు దృఢంగా మారుతాయి.
  • సైక్లింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం... సైక్లింగ్ కి సిద్ధమవ్వండి. ఒక బాటిల్ నీరు, టవల్ కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే, సైకిలింగ్ చేసేటపుడు చెమట అధికంగా పడుతుంది. కొన్ని సార్లు డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే సైకిల్ తొక్కేటపుడు సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. కొత్తగా సైకిల్ తొక్కే వారికి కాలి పిక్కలు నొప్పులు పెడతాయి కాబట్టి అనువైన స్పోర్ట్స్ షూస్ ధరించాలి. ప్రారంభంలో తొక్కే దూరం తగ్గించండి. క్రమేణా దూరం, వేగం పెంచుతూపోండి.

Whats_app_banner

సంబంధిత కథనం