Ghee for Glowing Skin। నెయ్యితో ముఖంపై ముడతలు పోయి, యవ్వనపు నిగారింపు.. ఇలా వాడాలి!
Ghee for Glowing Skin: వృద్ధాప్య ఛాయలను ఎదుర్కోవడానికి నెయ్యి ఒక సులభమైన, చవకైన సౌందర్య ఉత్పత్తి. అందమైన, ఆరోగ్యమైన మెరిసే చర్మం కోసం నెయ్యిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలియజేస్తున్నాం.
Ghee for Glowing Skin: నెయ్యిని ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా, వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని మీకు తెలుసు. అయితే, నెయ్యితో మీ అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు కూడా అని మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. శుద్ధమైన దేశీ నెయ్యిని మీ చర్మ సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు. నెయ్యి మీ చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది, చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు, ఇది మీ ముఖంపై ముడతలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
దేశీ నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మానికి లోతైన పోషణ అందిస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. వృద్ధాప్య ఛాయలను ఎదుర్కోవడానికి నెయ్యి ఒక సులభమైన, చవకైన సౌందర్య ఉత్పత్తి. అందమైన, ఆరోగ్యమైన మెరిసే చర్మం కోసం నెయ్యిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలియజేస్తున్నాం. ముఖానికి నెయ్యి రాయడానికి మూడు పద్ధతులు అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయి. అవేమిటంటే..
నెయ్యి- శనగపిండి ఫేస్ మాస్క్
నెయ్యి, శనగపిండితో చేసిన ఫేస్ మాస్క్ చర్మాన్ని తేమగా చేయడంతో పాటు ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఈ రెండింటిని కలిపి అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది, డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుంది. దీంతో ముఖం అందంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ముఖంలో యవ్వనపు నిగారింపు వస్తుంది.
ఒక చెంచా శనగపిండిలో రెండు చెంచాల నెయ్యి కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
ముల్తానీ మట్టి - నెయ్యి ఫేస్ మాస్క్
మెగ్నీషియం క్లోరైడ్‌తో సమృద్ధిగా ఉన్న ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. డెడ్ స్కిన్ , బ్లాక్‌హెడ్స్‌ను తొలగిస్తుంది. ఈ ప్యాక్‌లో ఉండే నెయ్యి, ముల్తానీ మట్టి రెండింటి గుణాలు చర్మం పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఫేస్ మాస్క్‌ను తయారు చేయడానికి, ఒక చెంచా ముల్తానీ మట్టిని, ఒక చెంచా నెయ్యితో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి వర్తించాలి. 20 నిమిషాల పాటు ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి.
నెయ్యి - తేనె ఫేస్ ప్యాక్
నెయ్యి - తేనె ఫేస్ ప్యాక్ ఒక శక్తివంతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీనిని ముఖానికి అప్లై చేస్తే, ఇది చర్మంలో తేమను నిలిపి ఉంచడంలో సహాయపడుతుంది, ఈ ప్యాక్ చేయడానికి, అర టీస్పూన్ తేనెలో అర టీస్పూన్ నెయ్యి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి.
సంబంధిత కథనం