Friday Quote | ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా? కదా మరి ఎందుకు గోల..
సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా.. అన్నాడు సిరివెన్నెల సీతారాముడు. నిజమే మరి మన నవ్వే మనకు బలం. ఏదో జరిగిపోయింది అని బాధపడిపోతూ.. కన్నీరు మున్నీరు కావాలాంటారా? అవసరమే లేదు. ఏడిస్తే బాధ పోతుందా అంటే లేదు. కానీ ఓసారి నవ్వుతూ ఆ సమస్యను పలకరించండి. అది పారిపోకపోయినా.. మనం దానిని ఎదురించగలమనే ఆత్మవిశ్వాసం మనలో పెంచుతుంది.
Fresh Thoughts On Friday | జీవితమనేది చాలా అందమైనది. మనం నవ్వినప్పుడు అది మరింత అందంగా, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కొంచెం నవ్వడం నేర్చుకోండి. కొందరుంటారు నవ్వితే ఏదో చెడు జరిగిపోతుందని వచ్చే నవ్వును కూజా ఆపేసుకుంటారు. ముందు ఆ ధోరణిని వదలియండి. అంటే విచారంగా, కృంగిపోతూ ఉంటే మంచి జరిగిపోతుందా? లేదు కదా. బాధలో అయినా, కష్టం అయినా మన నవ్వు చెరిగిపోకూడదు. నవ్వు మనకి ఓ పాజిటివ్ వైబ్ ఇస్తుంది. అందుకే ఏ కష్టమొచ్చినా ఏడ్చుకుంటూ కుర్చోకండి. అద్దం ముందుకు వెళ్లి.. ఓసారి నవ్వుకుని చూడండి. మీలో ఆత్మవిశ్వాసం కచ్చితంగా పెరుగుతుంది. సమస్యను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది.
మన చుట్టూ ఎన్నో ప్రతికూల అంశాలు జరుగుతూనే ఉండొచ్చు. కానీ మీ జీవితానికి అందాన్ని జోడించేది మాత్రం మీ చిరునవ్వే. ఏ విషయంలోనైనా.. ఎలాంటి కష్టం వచ్చినా.. ఎప్పుడూ బాధపడకండి. ఇలా నవ్వమని చెప్పడం సులువే కానీ.. సంతోషంగా ఉండటానికి ఓసారి నవ్వి చూడండి. మీకే అర్థమవుతుంది నవ్వు ఇచ్చే బలమేంటో. ఆశావాద భావనతో మీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడటం నేర్చుకోండి. లైఫ్లో ఒక్కోసారి మనకు ఏది అనుకూలంగా పని చేయదు. కాబట్టి ముఖంపై చిరునవ్వు ఉండటం మీకు మంచిది. నవ్వడానికి పెద్ద ఖర్చు కూడా అవ్వదండోయ్.. హాయిగా నవ్వేయండి. పైగా నవ్వితే మస్తు కేలరీలు కూడా ఖర్చు అవుతాయి. బరువు ప్రాబ్లం కూడా తీరిపోతుంది.
సంబంధిత కథనం
టాపిక్