Roti Mask: ‘రోటీ మాస్క్’ ఎలా చేసుకోవాలో చెప్పిన ఫేస్ యోగా ఎక్స్‌పర్ట్.. ఇది పని చేస్తుందా? డెర్మటాలజిస్ట్ ఏమన్నాంటే..-face yoga expert reveals roti mask making at home for glowing skin dermatologist reveals truth about that ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Roti Mask: ‘రోటీ మాస్క్’ ఎలా చేసుకోవాలో చెప్పిన ఫేస్ యోగా ఎక్స్‌పర్ట్.. ఇది పని చేస్తుందా? డెర్మటాలజిస్ట్ ఏమన్నాంటే..

Roti Mask: ‘రోటీ మాస్క్’ ఎలా చేసుకోవాలో చెప్పిన ఫేస్ యోగా ఎక్స్‌పర్ట్.. ఇది పని చేస్తుందా? డెర్మటాలజిస్ట్ ఏమన్నాంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 05, 2024 04:30 PM IST

Roti Mask: ముఖపు చర్మం బిగుతుగా ఉండేందుకు రోటీ మాస్క్ వేసుకోవాలని ఓ ఫేస్ యోగా ఎక్స్‌పర్ట్ చెప్పారు. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే, ఈ మాస్క్ నిజంగా పని చేస్తుందా.. లేదా అనే విషయాన్ని డెర్మటాలస్ట్ చెప్పారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Roti Mask: ‘రోటీ మాస్క్’ ఎలా చేసుకోవాలో చెప్పిన ఫేస్ యోగా ఎక్స్‌పర్ట్.. ఇది పని చేస్తుందా? డెర్మటాలజిస్ట్ ఏమన్నాంటే..
Roti Mask: ‘రోటీ మాస్క్’ ఎలా చేసుకోవాలో చెప్పిన ఫేస్ యోగా ఎక్స్‌పర్ట్.. ఇది పని చేస్తుందా? డెర్మటాలజిస్ట్ ఏమన్నాంటే..

ముఖంపై చర్మం మెరుపుతో ఉండేందుకు, మొటిమలు లాంటి సమస్యలు రాకుండా చాలా మంది ఫేస్‍ప్యాక్‍లు వాడుతుంటారు. వివిధ రకాల ఫేస్‍మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ‘రోటీ మాస్క్’ ఇప్పుడు హాట్‍టాపిక్ అయింది. ‘రోటీ మాస్క్’ అంటూ ఇన్‍స్టాగ్రామ్‍ క్రెడిట్స్‌లో ఓ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ముఖంపై చర్మం బిగుతుగా ఉండాలంటే ఈ మాస్క్ వాడాలంటూ వైరల్ అవుతోంది. ఫేస్ యోగా ఎక్స్‌పర్ట్ మాన్సీ గులాటీ ఈ రోటీ మాస్క్ గురించి వీడియో పోస్ట్ చేశారు.

రోటీ మాస్క్ తయారీ ఇలా..

రోటీ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో మాన్సీ గులాటీ వివరించారు. “గోధుమ పిండిలో పాలు వేసుకొని ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని రోటీలా గుడ్రంగా చేసుకోవాలి. రోటీలా చేసుకున్న దాన్ని ముఖంపై పెట్టి మరింత ఒత్తుకోవాలి. ఆ తర్వాత దానిపై రోజ్ వాటర్ స్ప్రే చేసుకోవాలి. ఐదు నిమిషాల దాన్ని ముఖంపై అలాగే ఉంచుకోవాలి" అని మాన్సీ వెల్లడించారు. దీనివల్ల చర్మం బిగుతుగా ఉంటుందని చెప్పారు. అయితే, ఇది నిజంగానే పని చేస్తుందా.. లేదా అనేది ఓ డెర్మటాలజిస్ట్ వెల్లడించారు.

చర్మపు కణాలు రీజనరేట్ అయ్యేలా గోధుమ పిండి చేస్తుందని, రోజ్ వాటర్ హైడ్రేషన్ అందిస్తుందని, చర్మపు రంధ్రాలను పాలు క్లెన్సింగ్ చేస్తాయంటూ మాన్సీ చెప్పుకొచ్చారు. ఈ బ్యూటీ హ్యాక్ గురించి ఆమె నమ్మకంగా చెప్పారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. కామెంట్ల వర్షం కురుస్తోంది. 

నిజం ఇదే

ఈ రోటీ మాస్క్ అంశం గురించి హెచ్‍టీ లైఫ్‍స్టైల్‍తో ఇంటర్వ్యూలో ఎస్తటిక్ క్లీనిన్‍కు చెందిన కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రింకీ కపూర్ మాట్లాడారు. గోధుమ పిండి ముద్ద, పాలు, రోజ్ మిల్క్.. ముఖపు చర్మాన్ని బిగుతుగా చేస్తాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఈ రోటీ మాస్క్ వేసుకుంటే చాలా మందికి దురద, ర్యాషెస్ లాంటి సమస్యలు ఎదురయ్యే రిస్క్ ఉందని అన్నారు. గ్లుటెన్ సెన్సిటివిటీ, వీట్ ఎలర్జీల కారణంగా రియాక్షన్లు ఎదురయ్యే అవకాశం ఉండడమే అందుకు కారణం అని వెల్లడించారు. దీనివల్ల ముఖంపై మొటిమలు పెరిగే ప్రమాదం ఉంటుందని తెలిపారు. గోధుమ పిండి వల్ల చర్మ ప్రయోజనాలు ఉంటాయని, కానీ ఇలా నేరుగా ముఖంపై మాస్క్‌లా వేసుకుంటే ఇబ్బందులు తలెత్తవచ్చని అన్నారు.

రోటీలా తింటే బెస్ట్!

అందరి చర్మం ఒకలా ఉండదని, సోషల్ మీడియాలో వీడియోలు చూసి ఇంట్లో ఏదైనా ప్రయోగించే బదులు నిపుణుల సంప్రదించాలని రింకూ కపూర్ వివరించారు. గోధుమ పిండి, రోజ్ మిల్క్ వాడడం వల్ల ఈ రోటీ ఫేస్ మాస్క్ వల్ల కొందరిలో డెడ్‍స్కిన్ సెల్స్ తొలగి ఉండొచ్చని అన్నారు. అయితే, వ్యక్తులను బట్టి చర్మం తీరు విభిన్నంగా ఉంటుందని అన్నారు. గోధుమ పిండి వల్ల చర్మానికి లాభాలు ఉంటాయని తెలిపారు. విటమిన్ బీ1, బీ3, విటమిన్ ఈ చర్మానికి మేలు చేస్తాయన్నారు. వీటి వల్ల రక్తప్రసరణ మెరుగుపడి చర్మ కణాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. అయితే, గోధుమ పిండిని రోటీలా తింటేనే మేలు అనేలా చెప్పారు. ఈ రోటీ మాస్క్ వల్ల చర్మం బిగుతుగా ఉంటుందని చెప్పేందుకు ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవని వెల్లడించారు.

Whats_app_banner