EVTRIC Rise । మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, నాణ్యతకు ఢోకా లేదు-evtric rise electric motorcycle launched know price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Evtric Rise Electric Motorcycle Launched Know Price Details

EVTRIC Rise । మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, నాణ్యతకు ఢోకా లేదు

HT Telugu Desk HT Telugu
Jun 22, 2022 03:39 PM IST

EVTRIC మోటార్స్ ఎవిక్ట్రిక్ రైజ్ పేరుతో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను విడుదల చేసింది. ఈరోజు నుంచే బుకింగ్స్ ప్రారంభించింది.

EVTRIC Rise
EVTRIC Rise

పూణెకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్ట్-అప్ EVTRIC మోటార్స్ తమ బ్రాండ్ నుంచి 'EVTRIC Rise' పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. జూన్ 22 అంటే ఈరోజు నుంచే బుకింగ్స్ ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1,59,990/-. ఆసక్తిగల కొనుగోలుదారులు దేశంలోని 22 రాష్ట్రాలలో కంపెనీకి చెందిన 125 టచ్ పాయింట్ల ద్వారా రూ. 5,000 డౌన్ పేమెంట్‌ చెల్లించి కొత్త EVTRIC రైజ్ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.

EVTRIC Rise ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పూర్తిగా మేడ్-ఇన్-ఇండియా బైక్. ఇది రెండు రంగుల కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది. ఇందులో పగటిపూట వెలిగే రన్నింగ్ లైట్లు, వెనుకవైపున బ్లింకర్‌లతో LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

EVTRIC Riseలో 2000 వాట్ BLDC మోటారుతో పాటు 70V/40 Ah బ్యాటరీ ప్యాక్‌ను ఇచ్చారు. ఈ బ్యాటరీ కేవలం 4 గంటల్లో 100 శాతం ఛార్జింగ్‌ అవుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 110 కిమీల దూరం ప్రయాణించవచ్చు. ఇది గంటకు 70 కిమీల గరిష్ట వేగంతో పరుగెడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌తో పాటు కొనుగోలుదారులకు కంపెనీ 10 amp మైక్రో ఛార్జర్‌ను కూడా అందిస్తోంది. ఇది ఆటో కట్ ఫీచర్‌తో వస్తుంది. EVTRIC Rise మోటార్‌సైకిల్‌లో డిటాచబుల్ బ్యాటరీ ఉంటుంది.

  • 70V/40 Ah లిథియం అయాన్ బ్యాటరీ
  • 2000 వాట్ బ్రష్‌లెస్ DC మోటార్
  • ప్రయాణ పరిధి 110 కిమీ
  • 10 amp మైక్రో ఛార్జర్‌
  • గరిష్ట వేగం గంటకు 70 కి.మీ

EVTRIC మోటార్స్ వ్యవస్థాపకుడు, MD మనోజ్ పాటిల్ ఈ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్‌ సందర్భంగా మాట్లాడుతూ “మా సరికొత్త సృష్టి RISE, మా మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకురావడానికి సంతోషిస్తున్నాము. ICE నుంచి EVకి మారడానికి సంకోచించే కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బైక్ ఇది. మా EVTRIC Rise నిజమైన ఎలక్ట్రిక్ బైక్ నాణ్యతను పునర్నిర్వచిస్తుంది". అని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలు లేకుండా కస్టమర్లు తమ బైక్ కొనుగోలు చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.

EVTRIC Rise కంపెనీ నుంచి వచ్చిన 4వ ఎలక్ట్రిక్ బైక్ కాగా.. Evtric Axis, Evtric Ride,  Evtric Mighty పేర్లతో 3 ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా కంపెనీ విక్రయిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్