ఫిజికల్ సిమ్ ఔట్.. E-SIMతో స్మార్ట్ ఫోన్స్.. ఆ సిమ్ తీసి పాడేయాల్సిందే!
Apple could release its e-SIM-only iPhone in 14 series: టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. త్వరలో ఫిజికల్ సిమ్స్ కనుమరుగు కానున్నాయి. త్వరలో వాటి స్థానంలో ఈ-సిమ్ కాన్సెప్ట్ రానుంది.
సెప్టెంబర్‌లో విడుదల కానున్న Apple iPhone 14 ఈ- సిమ్ ఆఫ్షన్ రానున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ E-SIMపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ-సిమ్ కాన్సెప్ట్ కొత్తది కాదు. ఇప్పటి వరకు చాలా ఫోన్లలో ఈ ఫీచర్ వచ్చింది. కానీ ప్రస్తుతం ఈ సర్వీస్ కనీసం ఒక ఫిజికల్ సిమ్ ఉన్న ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అటువంటి పరిస్థితిలో, E-సిమ్ ఎలా పని చేస్తుంది అనేది దానిపై వినియోగదారుల ఆసక్తి చూపిస్తున్నారు. అయితే E-SIM ఎక్కడ కొనాలి... దీని ప్రత్యేకతలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం భారత్‌లో ఉన్న మెుబైల్ నెట్‌వర్స్ జియో, ఎయిర్‌టెల్, VI ఈ-సిమ్ సేవలను అందిస్తున్నాయి.
eSIM అంటే ఏమిటి?
ESIM పూర్తి పేరు ఎంబెడెడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. దీన్ని ఫోన్, స్మార్ట్‌వాచ్, టాబ్లెట్‌లో ఉపయోగించే విధంగా రూపొందిస్తున్నారు. ఫిజికల్ SIM కార్డ్‌ల వలె e-SIMని ఫోన్‌లోకి చొప్పించలేరు. ఈ-సిమ్ కోసం కంపెనీలు ప్రత్యేకంగా ఫోన్‌ను రూపొందిస్తాయి. ఈ సిమ్ ఫోన్ హార్డ్‌వేర్‌లోనే వస్తుంది. ఇది ఫోన్‌లో ప్లేస్‌ను కూడా ఆదా చేస్తుంది. ప్రత్యేక SIM ట్రేని తయారు చేయవలసిన అవసరం ఉండదు. సర్వీస్ పరంగా E-సిమ్, సాధారణ ఫిజికల్ సిమ్ పెద్ద తేడా లేదు. e-SIM 4G/5G వంటి అన్ని సాధారణ నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తుంది. E-SIMలో పోర్టబుల్ ఆప్షన్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీని అర్థం మీరు సులభంగా కొత్త నెట్‌వర్క్‌కి మారవచ్చు.
eSIMకి సపోర్ట్ ఇచ్చే స్మార్ట్‌ఫోన్‌లు/డివైజ్‌లు
2018లో భారతదేశంలో ఐఫోన్ XR, XS, XS మ్యాక్స్‌లతో E-SIMను పరిచయం చేశారు. వీటికి తగ్గట్టుగా Jio, Airtelలు e-SIMలను రూపొందించాయి. అదే సమయంలో తర్వాత Vi కూడా e-SIM పరిచయం చేసింది. ప్రస్తుతం BSNL కూడా e-SIM విడుదలకు సిద్దమవుతుంది. జియో, VI, ఎయిర్‌టెల్ సాధారణ ఫిజికల్ సిమ్‌ల మాదిరిగానే ఈ-సిమ్‌ల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లను అందిస్తున్నాయి. iPhone XR , XS సిరీస్‌లు కాకుండా, భారతదేశంలో eSIM ఆప్షన్స్ చాలా ఫోన్‌లు రానున్నాయి. వాటిలో కొన్ని.
iPhone SE 2020
ఐఫోన్ 11 సిరీస్
ఐఫోన్ 12 సిరీస్
Moto RAZR ఫ్లిప్ ఫోన్
Samsung Galaxy LTE
Samsung Galaxy Watch Active2
Samsung Galaxy Gear S3
eSIMని ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కి ఎలా బదిలీ చేయాలి?
మీరు కొత్త ఈ-సిమ్ ఫోన్‌కి అప్‌గ్రేడ్ అయినట్లయితే, మీరు ఆపరేటర్ స్టోర్‌ని సందర్శించడం ద్వారా మీ పాత మొబైల్ ఫోన్ నుండి మీ ఇ-సిమ్‌ను బదిలీ చేయవచ్చు. అది Airtel, Jio లేదా Vi Store ఇలా నెట్‌వర్స్ అయిన కావచ్చు. ముందుగా మీకు ఈ-సిమ్ కోసం ఓ ఫిజికల్ సిమ్ ఇవ్వబడుతుంది. దీన్ని మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ చేసి మీ ఫిజికల్ సిమ్‌ను ఇ-సిమ్‌గా మార్చండి.
సంబంధిత కథనం
టాపిక్