Watermelon Seeds Benefits : పుచ్చకాయ గింజలను మరిగించిన నీటిని తాగండి.. చాలా ఉపయోగాలు
Watermelon Seeds Benefits : చాలామంది పుచ్చకాయ తిని అందులోని గింజలను పడేస్తారు. కానీ పుచ్చకాయ గింజలతోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని నీటిలో మరిగించి.. తాగితే ఉపయోగాలు ఉన్నాయి.
ఆల్‌రెడీ ఎండలు మెుదలయ్యాయి. ఫిబ్రవరి నెలలోనే మధ్యాహ్నమైతే చాలు.. విపరీతంగా ఉక్కపోత. బయటకు వెళ్లేలా లేదు. ఇక మార్చిలో సూర్యుడు చుక్కలు చూపించేలా ఉన్నాడు. ఎండ వేడికి శరీరంలో సమస్యలను ఎదుర్కుంటుంది. బాడీలో వేడి కూడా ఎక్కువ అవుతుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు పుచ్చకాయను తింటారు. అయితే దీని గింజలను చాలా మంది తీసేస్తారు. ఇవి కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
హైడ్రేట్‌గా ఉండాలి
వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే మీరు డీహైడ్రేషన్‌తో బాధపడే అవకాశం ఉంది. వేసవిలో లభించే కొన్ని పండ్లు శరీరంలో నీటిని కాపాడుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పుచ్చకాయలు అందులో ఒకటి. అయితే వీటి గింజలను కూడా మీరు వాడుకోవచ్చు.
పండ్లలో ముఖ్యమైనది పుచ్చకాయ. పుచ్చకాయలో ఉన్నంత నీరు మరే పండులోనూ దొరకదు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో తేమను కాపాడుకోవచ్చు. అంతేకాదు పుచ్చకాయ గింజల్లో ఎక్కువ పోషకాలు లభిస్తాయి. ఇవి తింటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయ గింజలను ఉడకబెట్టిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఖనిజాలు, విటమిన్లు అనేక ఔషధ గుణాలు లభిస్తాయి. పుచ్చకాయ గింజలు అనేక వ్యాధులను నయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పుచ్చకాయ గింజలను వండటం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం..
పుచ్చకాయ గింజల టీ
పుచ్చకాయ గీంజల టీ తాగడం మధుమేహాన్ని నియంత్రించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చూర్ణం చేసిన కొన్ని పుచ్చకాయ గింజలను ఒక లీటరు నీటిలో సరిగ్గా 15 నిమిషాలు ఉడకబెట్టండి. ఇలా మూడు రోజులు తీసుకుని.. ఒకరోజు గ్యాప్ ఇవ్వండి. దీన్ని మళ్లీ రిపీట్ చేయండి. ఈ చిట్కాలను పాటిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది
గుండె ఆరోగ్యానికి
మీరు హెల్తీ హృదయాన్ని కలిగి ఉండాలంటే, పుచ్చకాయ గింజలను ఉడికించి, దాని నీటిని క్రమం తప్పకుండా తాగాలి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పుచ్చకాయ గింజల్లో ఉండే మెగ్నీషియం గుండెను రక్షిస్తుంది. గుండె ఆరోగ్యానికి సహజ ఔషధం, తప్పకుండా పాటించండి
చర్మం, జుట్టుకు చాలా మంచిది
పుచ్చకాయ గింజలు మీకు కావలసిన అందమైన, బలమైన జుట్టును పొందడానికి సహాయపడతాయి. పుచ్చకాయ గింజలను ఉడకబెట్టిన నీటిని తాగడం వల్ల జుట్టు డ్యామేజ్, స్కాల్ప్ దురదను నివారించవచ్చు. పుచ్చకాయ గింజలలో ఉండే అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు మీకు ముడతలు లేని చర్మాన్ని అందిస్తాయి. పుచ్చకాయ గింజలతో తయారు చేసిన టీ లేదా దానిని మరిగించిన నీటిని తాగడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది
పుచ్చకాయ గింజలు రక్తపోటును నియంత్రించడంలో అద్భుతాలు చేస్తాయి. పుచ్చకాయ గింజలలో అర్జినిన్ ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది రక్త నాళాలు సంకుచితం కాకుండా నిరోధిస్తుంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి అర్జినిన్, లైసిన్ వంటి అమైనో ఆమ్లాలు అవసరం. పుచ్చకాయ గింజలు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. జీవక్రియను పెంచుతాయి. ఎముకలు, కణజాలాలను బలోపేతం చేస్తాయి.
పుచ్చకాయ గింజలతో అనేక ఉపయోగాలు
పుచ్చకాయ గింజల్లో విటమిన్ బి, నియాసిన్, ఫోలేట్, థైమెన్, పాంతోతేనిక్ యాసిడ్, విటమిన్ బి6 ఉంటాయి. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి నియాసిన్ అద్భుతంగా పనిచేస్తుంది. పుచ్చకాయ గింజలలో అనేక రకాల పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పుచ్చకాయ గింజలను ఉడకబెట్టిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి.