Yoga After Overeating : యోగాను ఖాళీ కడుపుతోనే కాదు.. ఫుల్​గా తిని కూడా చేయొచ్చు-doing yoga after overeating is gives better results for digestion and weightloss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Doing Yoga After Overeating Is Gives Better Results For Digestion And Weightloss

Yoga After Overeating : యోగాను ఖాళీ కడుపుతోనే కాదు.. ఫుల్​గా తిని కూడా చేయొచ్చు

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 01, 2022 10:39 AM IST

యోగా అంటే ఖాళీ కడుపుతోనే చేయాలనుకుంటారు చాలామంది. అయితే మీరు తిన్న తర్వాత కూడా యోగా చేయవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. మెరుగైన జీర్ణక్రియ, బరువు తగ్గాలి అనుకుంటే.. తిన్న తర్వాత 5 యోగా భంగిమలు చేయాలి అంటున్నారు.

యోగా
యోగా

Yoga After Overeating : మనం తరచుగా మన జీర్ణవ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుంటాము. దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ రోజువారీ జీవితంలో యోగాను చేర్చడం ద్వారా.. మీరు జీర్ణక్రియను మెరుగుపరచవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. అంతేకాకుండా బరువు తగ్గడాన్ని వేగవంతం చేయవచ్చంటున్నారు. అవును రాత్రి భోజనం తర్వాత నిద్రపోవడంలో మీకు ఇబ్బంది ఉంటే.. తిన్న తర్వాత యోగా చేయడం వల్ల కూడా త్వరగా నిద్ర పట్టే అవకాశముందని వెల్లడించారు.

సరైన జీర్ణక్రియ లేకుంటే యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, వికారం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. ఇవి చివరికి మీరు బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి రాత్రి భోజనం తర్వాత.. యోగా మ్యాట్ వద్దకు వెళ్లి కాస్త యోగా చేయండి. వీటిని చేస్తే మీ జీర్ణక్రియ సమస్యలు తగ్గి.. బరువు తగ్గుతారు అంటున్నారు యోగా నిపుణులు.

భోజనం తర్వాత చేయగలిగే యోగా ఆసనాలు:

1. వజ్రాసనం

మధ్యాహ్నం, రాత్రి భోజనం లేదా మీరు తీసుకున్న ఏదైనా భోజనం తర్వాత వజ్రాసనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇలా చేస్తూ ఉండడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది కడుపు సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించి.. బాగా నిద్రపోవడానికి సహాయం చేస్తుంది.

2. సుప్త బద్ధ కోనసనా

ఈ భంగిమ లోపలి తొడలు, మోకాళ్లను సాగదీస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను పెంచడం ద్వారా జీర్ణక్రియను సక్రమం చేస్తుంది. ఇది అలసట, నిద్రలేమి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

3. ఊర్ధ్వ ప్రసారిత పదసానా

ఇది కోర్ మీద పని చేయడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని వేగంగా చేస్తే.. అది దిగువ, మధ్య, ఎగువ అబ్స్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంతో పాటు.. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

4. మార్జర్యాసనం

ఈ భంగిమ తుంటి, వీపు, పొత్తికడుపులోని కండరాలను సాగదీస్తుంది. అంతేకాకుండా ఇది జీర్ణశయాంతర ప్రేగులతో సహా అవయవాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది.

5. సమస్థితి (పర్వత భంగిమ)

తిన్న తర్వాత చేయడానికి ఇది ఉత్తమమైన భంగిమ. ఇది మీ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. పైగా ఇది చేయడం చాలా సులభం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్