Banana and Milk: అరటిపండు తింటే తక్షణ శక్తి వస్తుంది. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. అందుకే బ్రేక్ ఫాస్ట్‌లో ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఆయుర్వేదం ప్రకారం మాత్రం పాలు తాగిన తర్వాత అరటిపండు తినకూడదు లేదా అరటిపండు తిన్న తర్వాత పాలు తాగకూడదు. ఈ రెండింటికి మధ్య కనీసం గంటైనా గ్యాప్ ఉండాలని చెబుతోంది ఆయుర్వేదం. ఈ రెండూ ఒకేసారి తినడం, తాగడం చేయడం వల్ల శరీరానికి మంచి జరగదని వివరిస్తోంది ఆయుర్వేదం.
అరటిపండు కాంబినేషన్ ప్రతి ఇంట్లో చూసేదే. గ్రామాల్లో ఇప్పటికీ పెరుగన్నం, మజ్జిగ అన్నంలో అరటిపండును వేసుకొని తినేవారు ఎక్కువే. మిల్క్ షేకుల్లో పాలు, అరటిపండు కలిపి తయారుచేస్తారు. అయితే ఈ కాంబినేషన్లన్నీ తినకూడదని ఆయుర్వేదం వివరిస్తుంది. అరటిపండు, పాల ఉత్పత్తులు కలిపి తినడం వల్ల జలుబు, దగ్గు, ఎలర్జీలు, సైనస్ వంటి త్వరగా వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. అలాగే శరీరానికి హాని చేసే పదార్థాలు, వ్యర్ధాలు శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంది.
ఆస్తమా సమస్య ఉన్నవారు అరటిపండు, పాలను కలిపి తినడం పూర్తిగా మానేయాలని అంటుంది. ఇలా తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఎక్కువైపోతాయి. అలాగే వాంతులు, విరేచనాలు వంటివి కూడా రావచ్చు. గుండె జబ్బులు కూడా పెరిగే అవకాశం ఉందని అంటుంది ఆయుర్వేదం. రాత్రులు నిద్ర పట్టక ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది.
ఆయుర్వేదంలోనే కాదు అల్లోపతిలో కూడా ఇది నిజమనే తేలింది. సైన్స్ కూడా దీన్ని నిజమని నిర్ధారిస్తోంది. ఇప్పటివరకు చేసిన చాలా అధ్యయనాల్లో పాలు, అరటిపండు కలిపి తినకూడదని తేలింది. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉండమని చెబుతోంది. ఎందుకంటే పాలుకు, అరటి పండుకు చలువ చేసే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి శరీరంలో చలువదనం పెరిగి జలుబు, దగ్గు, ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెండూ విడివిడిగా తినడం మంచిది. రెండూ కలిపి చేసే మిల్క్ షేక్‌లు, స్మూతీలు వంటివి పూర్తిగా మానేయడమే ఉత్తమం.
టాపిక్