Diwali Skin Care Tips: దీపావళి తర్వాత చర్మం కోసం తప్పక తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలు-diwali skin care tips follow these tips to rejuvenate your skin after diwali ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Skin Care Tips: దీపావళి తర్వాత చర్మం కోసం తప్పక తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలు

Diwali Skin Care Tips: దీపావళి తర్వాత చర్మం కోసం తప్పక తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 02, 2024 12:30 PM IST

Diwali Skin Care Tips: దీపావళి పండుగ సందర్భంలో చర్మంపై కాలుష్యం ప్రభావం పెరుగుతుంది. రకరకాల స్వీట్స్ సహా ఆహారాలు ఎక్కువగా తినాల్సి వస్తుంది. దీంతో చర్మానికి ఇబ్బందులు కలగొచ్చు. అందుకే దీపావళి తర్వాత చర్మం కోసం కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.

Diwali Skin Care Tips: దీపావళి తర్వాత చర్మం కోసం తప్పక తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలు
Diwali Skin Care Tips: దీపావళి తర్వాత చర్మం కోసం తప్పక తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలు

దీపావళి పండుగను చాలా మంది ఘనంగా జరుపుకున్నారు. దీపాల పండుగను వేడుకలా చేసుకున్నారు. అయితే పండుగ హడావుడిలో చర్మం పట్ల పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. టపాసులు కాల్చడం వల్ల చర్మంపై కాలుష్యం ప్రభావం పెరిగి ఉంటుంది. స్వీట్లు, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఆలస్యంగా నిద్రించడం వల్ల కూడా చర్మానికి సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దీపావళి తర్వాత చర్మం పునరుత్తేజం అయ్యేందుకు కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి. అవేంటంటే..

మేకప్‍కు బ్రేక్ ఇవ్వాలి

పండుగ సమయంలో కొందరు ఎక్కువసార్లు మేకప్ చేసుకొని ఉంటారు. దీంతో చర్మంలో ఆయిల్ బ్యాలెన్స్ దెబ్బ తిని ఉంటుంది. అందుకే సమతుల్యత మళ్లీ వచ్చేందుకు చర్మానికి కాస్త టైమ్ ఇవ్వాలి. మేకప్ వేసుకునేందుకు కాస్త బ్రేక్ ఇవ్వాలి. యాక్టివ్ ఇంగ్రీడియన్స్ వారం పాటు ఎక్కువగా వినియోగించకూడదు. చర్మం సాధారణమయ్యే వరకు మాయిశ్చరైజేషన్‍ను పెంచాలి. హైడ్రా ఫేషియల్‍లను వినియోగించాలి. మాయిశ్చరైజర్లను వాడాలి.

మృధువుగా ఫేస్ వాష్

దీపావళి తర్వాత చర్మం ఎక్కువగా కాలుష్యాన్ని, దుమ్మును ఎదుర్కొని ఉంటుంది. అందుకే తప్పకుండా ముఖాన్ని కడుక్కోవాలి. అయితే, ఫేస్‍ను గట్టిగా రుద్దుతూ కాకుండా మృధువుగా క్లీన్ చేసుకోవాలి. గట్టిగా రుద్దుతూ ఫేష్‍వాష్ చేసుకుంటే చర్మం పొడిగా అవడం, దురదలు రావడం ఉంటుంది. హైడ్రేటింగ్ పదార్థాలు ఉండే క్లిన్సెర్‌ను వాడడం మంచిది.

సరిపడా నిద్ర

పండుగ సమయంలో సరైన నిద్ర లేకపోవచ్చు. అందుకే కొన్ని రోజుల పాటు సరిపడా నిద్రించాలి. రోజుకు 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. దీనివల్ల చర్మంలో కోలాజెన్ ఉత్పత్తి పునరుత్తేజం అవుతుంది. మళ్లీ మెరుపు పెరుగుతుంది.

నీరు ఎక్కువగా..

చర్మంలోని వ్యర్థాలు బయటికి వెళ్లేందుకు హైడ్రేటేడెట్‍గా ఉండడం చాలా ముఖ్యం. అందుకే పండుగల తర్వాత సరిపడా కంటే కాస్త ఎక్కువ నీరు తాగాలి. దీనివల్ల టాక్సిన్స్ సులువుగా బయటికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. చర్మంలో తేమ కూడా మెరుగ్గా అవుతుంది.

విటమిన్ సీ పీల్

స్కిన్‍కేర్‌లో విటమిన్ సీ చాలా ముఖ్యమైనది. ఫ్రీ రాడికల్స్, యూవీ డ్యామేజ్‍, చర్మంపై ముడతలను ఇది తగ్గించగలదు. చర్మాన్ని రిపేర్ చేసేందుకు విటమిన్ సీ పీల్ మంచి మార్గంగా ఉంటుంది. స్కిన్ సెల్ వృద్ధికి ఇది సహకరిస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గేందుకు ఇది తోడ్పడుతుంది. స్కిన్‍ను మెరిసేలా చేస్తుంది.

వర్కవుట్స్

వ్యాయామం చేయడం వల్ల చెమట ఎక్కువగా బయటికిపోతుంది. దీనివల్ల చర్మపు రంధ్రాలు క్లియర్ అవుతాయి. సహజమైన యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తిని శారీరక వ్యాయామాలు పెంచుతాయి. రోజుకు 45 నిమిషాల నుంచి గంట వరకు వ్యాయామం చేయాలి.

గ్రీన్‍ టీ

గ్రీన్ టీని చర్మానికి రాసుకోవచ్చు. అలాగే ఈ టీ తాగొచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్ల వల్ల చర్మం మెరుపు పెరుగుతుంది. యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు యూవీ డ్యామేజ్‍ను రిపేర్ చేయగలవు. ఫేస్ మాస్క్ కోసం గ్రీన్ టీ పౌడర్‌ను యగర్ట్, పాలు, తేనెలో కలపాలి. ఆ తర్వాత ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Whats_app_banner