Cucumber Idli | వేసవి కాలంలో దోసకాయ ఇడ్లీ.. వేడివేడిగా తిని, చల్లగా ఉండండి!-cucumber idli will make your summer mornings more pleasant ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cucumber Idli | వేసవి కాలంలో దోసకాయ ఇడ్లీ.. వేడివేడిగా తిని, చల్లగా ఉండండి!

Cucumber Idli | వేసవి కాలంలో దోసకాయ ఇడ్లీ.. వేడివేడిగా తిని, చల్లగా ఉండండి!

HT Telugu Desk HT Telugu
May 05, 2022 09:07 AM IST

మీరు రోజూ తినే అల్పాహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. ఇడ్లీలు ఎప్పుడూ ఒకేలా కాకుండా వెరైటీగా దోసకాయ ఇడ్లీలు చేసుకోండి. రుచిగా ఉంటాయి, ఆరోగ్యకరం కూడా. ఈ వేసవిలో తింటే చల్లదనం లభిస్తుంది. హైడ్రేట్‌గా ఉంటారు. రెసిపీ ఇచ్చాము చూడండి..

<p>Cucumber Idli</p>
<p>Cucumber Idli</p> (Unsplash)

సాధారణంగా ఇడ్లీలు చేయాలంటే ఒకరోజు ముందుగా పిండిని పులియబెట్టి ఆ మరుసటి రోజు ఉదయం ఇడ్లీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి అవసరమే లేకుండా తక్షణమే కేవలం 20-30 నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ చేసుకోవచ్చు. అంతేకాదు ఎలాంటి చట్నీ, సాంబార్ లేకుండా నేరుగా తినేయవచ్చు. 

ఈ దోసకాయ ఇడ్లీ దక్షిణ కర్నాటక, కొంకణి ప్రాంతాలలో ప్రసిద్ధి. అక్కడ దీనిని సూతేకాయ ఇడ్లీ అని పిలుస్తారు. ఈ వేసవిలో దోసకాయ ఇడ్లీ ఆరోగ్యానికి మంచిది కూడా. ఎలా తయారు చేసుకోవాలో రెసిపీ ఇచ్చాము, ఒకసారి ప్రయత్నించి చూడండి.

దోసకాయ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు

  • 1 కప్పు తురిమిన దోసకాయ
  • 1 కప్పు ఇడ్లీ రవ్వ/ దోశ పిండి
  • 1/2 కప్పు కొత్తిమీర
  • 2 తరిగిన పచ్చి మిరపకాయలు
  • 1/4 కప్పు తురిమిన కొబ్బరి
  • ఉప్పు రుచికి సరిపడా

తయారుచేసుకునే విధానం

  1. ఒక గిన్నెలో దోసకాయను చిన్నగా తురుముకోవాలి, ఇలా తురమగా వచ్చిన నీటిని వేరే గిన్నెలోకి తీసుకొని భద్రపరుచుకోవాలి.
  2. ఇప్పుడు మరొక గిన్నెలో తురిమిన దోసకాయతో పాటు ఇడ్లీ రవ్వ, కొత్తిమీర, పచ్చి మిరపకాయలు, తురిమిన కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు అన్ని వేసుకొని కలుపుకోవాలి.
  3. మీకు రుచికోసం జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అయితే ఇది ఐచ్చికం మాత్రమే.
  4. ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్న మిశ్రమానికి దోసకాయ నీరు కలుపుకోండి. పిండి ఇడ్లీలు చేయడానికి అనువుగా నీటిని కలుపుకోండి. . దోసకాయలో నీరు ఉంటుంది కాబట్టి మీరు నీరు తక్కువగా కలుపుకోండి.
  5. ఇప్పుడు ఇడ్లీ పాత్రల్లో ఇడ్లీలుగా వేసి ఒక 20 నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించండి.

దోసకాయ ఇడ్లీలు సిద్ధం అయ్యాయి. వేడివేడిగా వడ్డించుకొని తినండి.

సంబంధిత కథనం

టాపిక్