మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? వాటి రివార్డ్ పాయింట్లును ఇలా ఉపయోగించుకోండి!-credit debit card easy way to redeem reward points ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? వాటి రివార్డ్ పాయింట్లును ఇలా ఉపయోగించుకోండి!

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? వాటి రివార్డ్ పాయింట్లును ఇలా ఉపయోగించుకోండి!

HT Telugu Desk HT Telugu
Apr 07, 2022 04:57 PM IST

ఆర్థిక అవసరాలు పెరగడంతో క్రెడిట్ కార్డుల వినియోగం కూడా పెరిగింది. ఈ డిజిటల్ యుగంలో చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డ్‌లతో చెల్లింపులు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, క్యాష్‌బ్యాక్‌తో పాటు పాయింట్లను కూడా పొందవచ్చు

<p>&nbsp;Credit cards&nbsp;</p>
Credit cards (AP)

ఆర్థిక అవసరాలు పెరగడంతో క్రెడిట్ కార్డుల వినియోగం కూడా పెరిగింది. ఈ డిజిటల్ యుగంలో చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డ్‌లతో చెల్లింపులు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, క్యాష్‌బ్యాక్‌తో పాటు పాయింట్లను కూడా పొందుతారు. అయితే చాలా మంది క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తారు కానీ వాటి ద్వారా లభించే ప్రయోజనాలను తెలియక వాటి అలానే వదిలేస్తారు. వాటిలో ముఖ్యంగా రివార్డు పాయింట్ల ద్వారా లభించే ప్రయోజనాన్ని పొందలేకపోవడం అయితే ఈ రివార్డ్ పాయింట్స్‌తో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి.

yearly horoscope entry point

రివార్డ్ పాయింట్లు అంటే ఏమిటి, మీరు వాటిని ఎలా ఉపయోగించవచ్చో? ఇప్పడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డును ఉపయోగించే కస్టమర్లకు బ్యాంక్ రివార్డ్ పాయింట్లను ఇస్తుంది. కస్టమర్లను ప్రోత్సహించడానికి బ్యాంక్‌లు ఇలా రివార్డ్ పాయింట్లను ప్రవేశపెట్టాయి. సాధరణంగా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏదైన లావాదేవీలు జరిపినప్పుడు బ్యాంకులు వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో రివార్డ్ పాయింట్లు ఒకటి. Reward Points అంటే లావాదేవీల వాల్యూమ్‌పై మీ క్రెడిట్‌కు క్రెడిట్ చేయబడిన పాయింట్లు లేదా క్రెడిట్‌లు.

రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేయాలి?

రివార్డ్ పాయింట్‌ను గెలుచుకున్నప్పుడు, వాటిని రీడీమ్ చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా వాటిని ఆన్‌లైన్‌ నెట్ బ్యాకింగ్ ద్వారా  రీడీమ్ చేసుకోవచ్చు. అలా కాకుండా బ్యాంక్ కస్టమర్ కేర్ విభాగానికి కాల్ చేసి కూడా వాటిని ఎలా రీడీమ్ చేయాలో తెలుసుకోవచ్చు. ఆ రివార్డ్ పాయింట్లతో మీరు ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేయవచ్చు.  విమాన టిక్కెట్లను కొనుగోలు చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు. అలాగే కొన్ని లాయల్టీ ప్రోగ్రామ్‌లు పాయింట్-ప్లస్-పే ఎంపికను కూడా అందిస్తాయి, దీనిలో మీరు పాయింట్‌లను ఉపయోగించి ప్రయోజనం పొందవచ్చు.

 

మీరు HDFC బ్యాంక్‌తో మీ పాయింట్లను రీడీమ్ చేయాలనుకుంటే, మీరు స్టెప్స్ ఫాలో అవ్వండి

నెట్‌బ్యాంకింగ్ పోర్టల్ / HDFC బ్యాంక్ వెబ్‌సైట్ అకౌంట్ లాగిన్ చేయండి.

లాగిన్ అయిన తర్వాత, 'కార్డ్'పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత డెబిట్ కార్డ్ సెక్షన్‌లోని 'ఎంక్వైరీ' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

మీరు తదుపరి పేజీకి వెళ్లినప్పుడు, 'క్యాష్‌బ్యాక్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

మీరు పాయింట్లను రీడీమ్ చేయాలనుకుంటున్న ఖాతా నంబర్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం