Coriander Hair Pack: కొత్తిమీరతో జట్టు అందాన్ని పెంచుకోవచ్చు.. ఎలా అంటారా?-coriander for hair care amazing benefits and know here how to use ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coriander Hair Pack: కొత్తిమీరతో జట్టు అందాన్ని పెంచుకోవచ్చు.. ఎలా అంటారా?

Coriander Hair Pack: కొత్తిమీరతో జట్టు అందాన్ని పెంచుకోవచ్చు.. ఎలా అంటారా?

Rekulapally Saichand HT Telugu
Feb 28, 2022 02:45 PM IST

సాధారణంగా, కొత్తిమీరను కూరగాయల రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే జుట్టు అందాన్ని పెంచేందుకు కొత్తిమీరను ఉపయోగిస్తారని మీకు తెలుసా. విటమిన్ కె, విటమిన్ ఇ,విటమిన్ ఎ లాంటివి కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి. సహాజ పద్దతిలో ధనియా హెయిర్ ప్యాక్‌ను ఉపయోగించడం ఎలానో తెలుసుకుందాం

<p>ధనియా హెయిర్ ప్యాక్‌</p>
ధనియా హెయిర్ ప్యాక్‌

Hair Fall Treatment: ఇప్పుడు చాలా మందికి ఎదురవుతున్న సాధరణ సమస్య జుట్టు రాలడం (Hair Fall). వాతావరణం, మానసిక ఒత్తిడి, పోషకాల లోపం,  కొన్ని రకాల మందుల వల్లనే కాకుండా వంశ పారంపర్యంగానూ జుట్టు ఉడిపోతూ ఉంటుంది. సమస్య ఏదైనప్పటికి జుట్టు రాలడం మాత్రం కామన్‌గా మారింది. శిరోజాలను కాపాడుకోవాడానికి అనేక హోం రెమిడీలు అందుబాటులో ఉన్నాయి. 

సాధారణంగా, కొత్తిమీరను కూరగాయల రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే జుట్టు అందాన్ని పెంచేందుకు కొత్తిమీరను ఉపయోగిస్తారని  మీకు తెలుసా. విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ ఎ లాంటివి కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి. సహాజ పద్దతిలో ధనియా హెయిర్ ప్యాక్‌ను ఉపయోగించడం ద్వారా జుట్టు రాలడం తగ్గడంతో పాటు పొడవాటి, మందపాటి జుట్టుకు కలిగి ఉండవచ్చు.

ధనియా హెయిర్ ప్యాక్ (Coriander Hair Pack): 

జుట్టు బలంగా,పొడువుగా, మందపాటిగా ఉండడానికి ధనియా హెయిర్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మిశ్రమంలోని జ్యూస్ జట్టును మెరిసేలా చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్‌ను వారంలో రెండు సార్లు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొత్తిమీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, అదే సమయంలో జుట్టుకు కూడా చాలా బాగా మేలు చేస్తోంది. ఇంకేందుకు అలస్యం కొత్తిమీర హెయిర్ ప్యాక్‌ హోం రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కొత్తిమీర హెయిర్ ప్యాక్‌ జుట్టుకు అప్లై చేసే విధానం...

కొత్తిమీర హెయిర్ మాస్క్ తయారు చేయడం చాలా సులభం. ముందుగా కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత కొత్తిమీరతో పాటు అలోవెరాను తీసుకొవాలి.. దీని తర్వాత కొత్తిమీర పేస్ట్, అలోవెరా జెల్ కలపాలి. ఇప్పుడు ఈ మెత్తని పేస్ట్‌ని జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత జుట్టు కడగాలి. మీ జుట్టులోని జుట్టును సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత షాంపూ ఉపయోగించండి. జట్టుకు ఈ హెయిర్ ప్యాక్‌ను అప్లై చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. 

 ముల్తానీ మట్టి- కొత్తిమీర ఆకుల పేస్ట్‌తో కూడా జట్టు సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ముల్తానీ మట్టి చర్మంతో పాటు జుట్టుకు కూడా చాలా మంచిది. కొత్తిమీర,ముల్తానీ మట్టి పేస్ట్ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముల్తానీ మట్టితో కొత్తిమీర పేస్ట్ కలిపి ఆ తర్వాత ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత జుట్టు కడగాలి. ఇది జుట్టును మందంగా,పొడవుగా చేస్తుంది.

వీటితో పాటు ఆహారపు అలవాట్లు కూడా బాగుంటే జుట్టును కాపాడుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం ద్వారా మనకు అందం, ఆరోగ్యం రెండూ వస్తాయి. జుట్టుకు కావాల్సిన పోషకాలను అందించేది ఆహారం. జుట్టు ఎక్కువగా రాలుతుందంటే కారణం మీరు తినే ఆహారంలో కొన్ని పోషకాలు లేకపోవడమే . కావున పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తింటే మంచిది.

Whats_app_banner