Coconut Water | కొబ్బరి నీళ్లతో బరువు తగ్గుతారా? అధ్యయనాలు ఏమంటున్నాయ్..-coconut water top benefits for good health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Coconut Water Top Benefits For Good Health

Coconut Water | కొబ్బరి నీళ్లతో బరువు తగ్గుతారా? అధ్యయనాలు ఏమంటున్నాయ్..

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 17, 2022 01:00 PM IST

అసలే వేసవి కాలం. ఇప్పటికే సూరీడు నిప్పుల వర్షాన్ని మొదలుపెట్టేశాడు. కాస్త ఎండలోకి వెళ్లి వచ్చేసరికి గొంతేమో దాహం దాహం అంటూ అర్జించేస్తుంది. ఏమైన కూల్​డ్రింక్స్ తాగుదామంటే వైద్యులేమో వద్దు అంటారు. ఇలాంటి సమయంలో మనకున్న బెస్ట్ ఆప్షన్ కొబ్బరి నీళ్లు. ఇది తాగితే దాహం తీరడమే కాదండోయ్ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నీటితో ప్రయోజనాలు
కొబ్బరి నీటితో ప్రయోజనాలు

Coconut Benefits | సహజమైన, ఎలాంటి స్వీట్నర్స్ కలపని.. ప్రకృతి ఇచ్చే తీపి నీరే కొబ్బరి నీళ్లు. ఇవి తీపి, హైడ్రేటింగ్‌తో పాటు, మానవ శరీరానికి ప్రయోజనకరమైన అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. అంతేకాకుండా ఖనిజాలను కలిగి ఉంటాయి. కొబ్బరి నీరు సాధారణంగా 6-7 నెలల వయస్సు గల కొబ్బరికాయల నుంచి వస్తుంది. అయినప్పటికీ కొన్ని ముదురు కొబ్బరిలో కూడా అందుబాటులో ఉంటుంది. మరి కొబ్బరి నీళ్లు తీసుకుంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పోషకాలకు మంచి మూలం

కొబ్బరిని ఆహార పదార్థాలు, డెజర్ట్‌లు మొదలైనవాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కొబ్బరి నీళ్లలో తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా మోతాదులో కాల్షియం వంటి సమృద్ధిగా పోషకాలు ఉంటాయి. పిండి పదార్థాలు, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరంను కలిగి ఉంటుంది. ఇవన్నీ శరీరానికి అవసరమైన పోషకాలే.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు

పలు నివేదికల ప్రకారం కొబ్బరి నీటిలో మానవ శరీరానికి చాలా ప్రయోజనకరమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తటస్తం చేసి.. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి.

చక్కెరను తగ్గిస్తుంది

కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఇతర ఆరోగ్య గుర్తులను మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు టీ, ఇతర పానీయాల స్థానంలో కొబ్బరి నీళ్లను తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.

కిడ్నీ ఆరోగ్య ప్రయోజనాలు

కొబ్బరి నీరు మధుమేహం నుంచి మూత్రపిండాల నష్టాన్ని తగ్గించడం వరకు సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. 2018లో అధ్యయనంలో భాగంగా.. కిడ్నీలో రాళ్లు ఉన్న వ్యక్తులకు క్రమం తప్పకుండా కొబ్బరి నీటిని అందించారు. కొన్ని రోజుల వ్యవధిలోనే వారు మూత్రవిసర్జన ద్వారా వాటిని కోల్పోయారని పరిశోధకులు కనుగొన్నారు. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా కొబ్బరి నీరు రక్షణ కల్పిస్తాయని తెలిపారు.

బరువు తగ్గేందుకు..

కొబ్బరి నీరులో కేలరీల శాతం దాదాపుగా ఉనికిలో లేని స్థాయిలో చాలా తక్కువగా ఉంటుంది. ఇది చక్కెరతో కూడిన పానీయాలకు ఆరోగ్యకరమైన భర్తీ అని చెప్పవచ్చు. ఇది చాలా తక్కువ మొత్తంలో కొవ్వులను కలిగి ఉన్నందున.. శరీర బరువు అదుపులో ఉంచుతుంది. శరీరానికి హైడ్రేషన్‌ను అందిచడంలో సహాయపడుతుంది.

 

WhatsApp channel

సంబంధిత కథనం