Coconut Ice cream: లేత కొబ్బరి గుజ్జుతో ఇలా ఐస్ క్రీమ్ చేసి చూడండి, పిల్లలకు తెగ నచ్చేస్తుంది
Coconut Ice cream: లేత కొబ్బరి గుజ్జుతో చేసే ఐస్ క్రీమ్ టేస్టీగా, కొత్తగా ఉంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇంట్లోనే లేత కొబ్బరి గుజ్జుతో ఐస్ క్రీమ్ సులువుగా చేసేయొచ్చు.
Coconut Ice cream: వేసవి వచ్చిందంటే పిల్లలు ఐస్ క్రీములు తినేందుకు ఇష్టపడతారు. ఒకసారి ఇంట్లో లేత కొబ్బరి గుజ్జుతో ఐస్ క్రీమ్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా లేత కొబ్బరి గుజ్జుతో ఐస్ క్రీమ్ చేస్తేనే బాగుంటుంది. కొబ్బరి బోండాలు తాగిన తర్వాత లోపల లేత కొబ్బరి దొరుకుతుంది. ఆ కొబ్బరితోనే ఐస్ క్రీమ్ టేస్టీగా వస్తుంది. ఈ కొబ్బరి గుజ్జుతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో తెలుసుకోండి.
కొబ్బరి గుజ్జు ఐస్ క్రీమ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
లేత కొబ్బరి గుజ్జు - రెండు కప్పులు
క్రీమ్ - ఒక కప్పు
కండెన్స్‌డ్ మిల్క్ - ఒక కప్పు
కొబ్బరి పాలు - ఒక కప్పు
పంచదార - అర కప్పు
లేత కొబ్బరి గుజ్జు ఐస్ క్రీమ్ రెసిపీ
1. మిక్సీ జార్లో కొబ్బరి పాలు, లేత కొబ్బరి గుజ్జు వేసి బాగా మిక్సీ చేయండి. ఇది పేస్టులా రావాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో క్రీమ్, పంచదార, కండెన్స్ డ్ మిల్క్ వేసి బాగా గిలక్కొట్టండి.
3. అందులోనే మిక్సీలో పేస్టులా చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసుకోండి.
4. మొత్తం ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్ లో వీటిని వేసి ఐదు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
5. కావాలనుకుంటే పైన బాదం, పిస్తా వంటివి గార్నిష్ చేయాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది.
కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్లు, కొబ్బరి ముక్కలు అన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇవన్నీ కూడా మన రోగనిరోధ శక్తిని పెంచుతాయి. గుజ్జు తినడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ దొరుకుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. దీనిలో ఫైబర్, కాపర్, శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. పిల్లలకు బయటకొనే ఐస్ క్రీములు కన్నా ఇలా కొబ్బరి గుజ్జుతో ఐస్ క్రీమ్ చేసి ఇస్తే ఆరోగ్యానికి మంచిది. దీని రుచి కూడా చాలా కొత్తగా ఉంటుంది.
కొబ్బరి గుజ్జును ముందుగానే సహకరించి పెట్టుకోవాలి. నాలుగైదు కొబ్బరి బోండాలు కొంటేగానీ లేత కొబ్బరి గుజ్జు రాదు. ఇలా ఇంట్లో చేసిన ఐస్ క్రీమ్ ప్రిజర్వేటివ్స్, రసాయనాలు కూడా కలపము. కాబట్టి పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి సమస్యా ఉండదు.
టాపిక్