Chicken Rasam: ఈ కాలంలో వేడివేడిగా చికెన్ రసం, ఆరోగ్యానికి ఎంతో మేలు-chicken rasam recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Rasam: ఈ కాలంలో వేడివేడిగా చికెన్ రసం, ఆరోగ్యానికి ఎంతో మేలు

Chicken Rasam: ఈ కాలంలో వేడివేడిగా చికెన్ రసం, ఆరోగ్యానికి ఎంతో మేలు

Haritha Chappa HT Telugu
Jan 12, 2024 11:45 AM IST

Chicken Rasam: నాన్ వెజిటేరియన్ రసం టేస్టీగా ఉంటుంది. ఓసారి చికెన్ రసం వండుకొని చూడండి.

చికెన్ రసం
చికెన్ రసం (ticklingpalates)

Chicken Rasam: రసం అనగానే టమోటా రసం, చింతపండుతో చేసే రసమే అందరికీ గుర్తుకొస్తుంది. చికెన్‌తో కూడా టేస్టీ రసం చేసుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేడి అన్నంలో ఈ చికెన్ రసాన్ని కలుపుకొని తింటే గొంతు ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి. జలుబు, జ్వరం వంటివి రాకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి చికెన్ రసం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

చికెన్ రసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ - పావు కిలో

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు

నిమ్మరసం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఉల్లిపాయ - ఒకటి

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

వెల్లుల్లి రెబ్బలు - మూడు

అల్లం - చిన్న ముక్క

లవంగాలు - రెండు

యాలకులు - రెండు

సోంపు గింజలు - అర స్పూను

గసగసాలు - అర స్పూను

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

చికెన్ రసం రెసిపీ

1. చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2. ఎముకలు లేని చికెన్ తీసుకుంటే చికెన్ రసం బాగా వస్తుంది.

3. ఇప్పుడు ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

4. మిక్సీలో ఉల్లిపాయలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం లవంగాలు, యాలకులు, సోంపు, పసుపు, కారం, గసగసాలు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి లేదా నూనె వేయాలి.

6. ఆ నూనె వేడెక్కాక మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దను వేసి బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయి మంచి వాసన వస్తున్న సమయంలో చికెన్ ను వేసి ఉడికించాలి.

7. పైన ఉప్పును చల్లుకోవాలి. మూత పెట్టి చికెన్ ముక్కలు ఉడికేలా చిన్న మంట మీద ఉడికించాలి.

8. చికెన్ ముక్కలు 90% ఉడికాక ఒక లీటర్ నీటిని వేయాలి.

9. చిన్న మంట మీద 20 నిమిషాలు పాటు మరిగించాలి.

10. స్టవ్ కట్టేశాక పైన నిమ్మరసం చల్లుకోవాలి.

11. దీన్ని అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఎంతో ఆరోగ్యం కూడా. ఒక్కసారి తిన్నారంటే మీరే పదేపదే చేసుకుంటారు

Whats_app_banner