Chicken Kebabs Recipe: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చికెన్ కబాబ్స్ ఇలా చేసేయండి, రెసిపీ ఎంతో ఈజీ-chicken kebabs recipe in telugu know how to cook this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Kebabs Recipe: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చికెన్ కబాబ్స్ ఇలా చేసేయండి, రెసిపీ ఎంతో ఈజీ

Chicken Kebabs Recipe: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చికెన్ కబాబ్స్ ఇలా చేసేయండి, రెసిపీ ఎంతో ఈజీ

Haritha Chappa HT Telugu

Chicken Kebabs Recipe: మీకు చికెన్ కబాబ్స్ అంటే ఇష్టమా? వాటిని తినడం కోసం రెస్టారెంట్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కబాబ్స్ ను వండేయొచ్చు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

చికెన్ కబాబ్స్ రెసిపీ

కొన్ని రకాల వంటకాలను రెస్టారెంట్లో మాత్రమే వండగలరని అనుకుంటారు. ఇంట్లో కూడా చికెన్ కబాబ్స్ వంటివి వండవచ్చు. వీటి కోసం రెస్టారెంట్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చికెన్ కబాబ్స్‌ను చాలా సులువుగా చేసేయొచ్చు. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. వీటిని ఎలా చేయాలో తెలుసుకోండి.

చికెన్ కబాబ్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు

చికెన్ కీమా - అరకిలో

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - నాలుగు

చాట్ మసాలా - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పుదీనా తరుగు - రెండు స్పూన్లు

గరం మసాలా - అర స్పూను

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

మిరియాల పొడి - అర స్పూను

గుడ్డు - ఒకటి

బటర్ - రెండు స్పూన్లు

జీలకర్ర పొడి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

చికెన్ కబాబ్ రెసిపీ

1. కబాబ్ స్టిక్స్ ను ముందుగానే కొని తెచ్చుకోవాలి. వీటిని ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల అవి కబాబ్స్ కాల్చేటప్పుడు మాడకుండా ఉంటాయి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ కీమాను వేసి శుభ్రంగా కడగాలి.

3. ఆ చికెన్ కీమాలో రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, చాట్ మసాలా, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

4. కోడిగుడ్డు సొనను కూడా అందులో వేసి బాగా కలపాలి.

5. మీకు గుడ్డు నచ్చకపోతే శెనగపిండిని కలుపుకోండి.

6. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయండి.

7. ఈ మొత్తం మిశ్రమాన్ని పైన మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టేయండి.

8. ఇప్పుడు చిన్న ముద్దను తీసి చేతులను తడి చేసుకొని కబాబ్ స్టిక్స్ కు అతికించండి.

9. పొడవుగా వచ్చేలా వాటిని చేతితోనే మెదుపుకోవాలి.

10.ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టి బటర్ వేయండి.

11. ఐదు ఆరు స్టిక్స్‌కు కబాబ్స్ ను అతికించి వాటిని పెనం మీద ఉంచి రెండు వైపులా కాల్చండి.

12. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఇది మంచిగా కాలడానికి సమయం తీసుకుంటుంది.

13. చిన్న మంట మీదే వీటిని ఫ్రై చేయాలి. ఆ తర్వాతే స్టవ్ ఆఫ్ చేయాలి.

14. ఈ కబాబ్స్ ను గ్రీన్ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది.

15. అలాగే టమాటో సాస్ కూడా టేస్టీగా ఉంటుంది.

16. కబాబ్స్‌లో కావాలనుకుంటే స్పైసీగా చేసుకోవచ్చు.

చిన్న పిల్లల కోసం కబాబ్స్ చేయాలనుకుంటే కారం తగ్గించి సాధారణంగా వచ్చేలా చేయండి. ఇలా ఇంట్లోనే చికెన్ కబాబ్స్ ను చేసుకోవడం వల్ల ఆరోగ్యకరం కూడా. ఈ రెసిపీని ఒకసారి ప్రయత్నించండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.