Cheap Air Tickets : బడ్జెట్ ఫ్రెండ్లీ విమాన టికెట్స్ కోసం సింపుల్ చిట్కాలు
Budget Friendly Air Tickets : ఒక్కసారైనా విమానం ఎక్కాలనేది చాలా మంది కల. కానీ బడ్జెట్ చూసుకుని భయపడుతుంటారు. వామ్మో అంత డబ్బులు పెట్టి వెళ్లాలా అనుకుంటారు. కానీ కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే.. చాలు.. బడ్జెట్ ధరలో గాలిలో ఎగరొచ్చు.
ఆకాశంలో విమానం(Flight) వెళ్తుంటే.. చూస్తూ ఉంటాం. ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని అనుకుంటాం. కానీ ఇంటి పరిస్థితులు గుర్తొస్తాయి. ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అనుకుంటారు. కానీ ప్రయాణించాలనే కోరిక మాత్రం అలానే ఉంటుంది. సో.. బడ్జెట్(Budget) ధరలో ప్లాన్ చేసుకుంటే.. మీ కోరిక నెరవేరుతుంది. మీ తదుపరి విమాన ప్రయాణంలో డబ్బు ఆదా చేయడానికి కొన్ని చిట్కాలను ఫాలో చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్‌టికెట్(Air Tickets)లను బుక్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సింపుల్ చిట్కాలు ఉన్నాయి.
బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్‌లైన్స్ టిక్కెట్‌ల కోసం చాలా మంది వెతుకుతుంటారు. ప్రత్యేకంగా వారాంతం లేదా ఇతర ప్రత్యేకమైన రోజుల్లో అలా దొరకడం కష్టం. ఎయిర్‌లైన్‌లు, టూర్ ఆపరేటర్లు అందించే డీల్‌లు, ఆఫర్లతో మీ డబ్బును సేవ్ చేయండి. చవకైన విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే.. చిట్కాలను పాటించాలి. మీ తదుపరి విమాన ప్రయాణంలో కొంచెం డబ్బు ఆదా చేయడానికి కొన్ని చిట్కాలను ఫాలో చేయండి.
మీరు విద్యార్థి(Student) అయితే విమానం ప్రయాణం చేసేందుకు అది కొన్నిసార్లు బోనస్ అవుతుంది. అందువల్ల మీరు మీ డాక్యుమెంట్స్ ద్వారా మీ విమాన ప్రయాణానికి ఖర్చును తగ్గింపు చేసుకోవచ్చు. కొన్ని ఎయిర్‌లైన్(Air Line)లు తమ చెక్ ఇన్ బ్యాగేజ్‌లో కొన్ని అదనపు కిలోలను మీరు తీసుకెళ్లేందుకు అవకాశం ఇస్తాయి.
మీరు తేదీల ఆధారంగా మీ పర్యటనను చూసుకోవాలి. ప్రయాణించడానికి కావలసిన రోజు వారాంతం లేదా సెలవుదినం అయితే.. ఆ సమయంలో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతుంది. టికెట్(Ticket) కొనుగోలుకు మీరు అధిక మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. విమానయాన సంస్థలు, టూర్ ఆపరేటర్లు అందించే డీల్స్, ఆఫర్లను తనిఖీ చేసి మీరు ప్రయాణించాలి. వారాంతంలో కాకుండా సాధారణ రోజుల్లో ప్రయాణం చేస్తే మంచిది.
మీరు విదేశాలకు వెళ్ళేటప్పుడు, ప్రత్యేకంగా మీరు వెళ్లే దేశం గురించి సమాచారం తెలుసుకోవాలి. దీని ద్వారా మీరు కొంత డబ్బును సేవ్ చేయోచ్చు. మన దేశ కరెన్సీకి ఏ దేశాల్లో ఎక్కువ విలువ ఉందనేది చూసుకోవాలి. తక్కువ ఖర్చుతో అక్కడ గడపొచ్చు.
ట్రావెల్(Travel) అగ్రిగేటర్‌లు కొన్నిసార్లు మీ ఇమెయిల్‌కు ప్రచార కోడ్‌లు లేదా రద్దు చేసిన విమాన టిక్కెట్‌లకు మంచి పంపుతారు. ఈ విధంగా స్ప్యామ్ ఫోల్డర్‌లను ఒకసారి పరిశీలించడం వలన మీరు తగ్గింపులను పొందగలరు. అయితే అవి నిజమైనవో కాదో తెలుసుకోవాలి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కొంతమంది వెళ్లేది చాలా రోజుల తర్వాత కదా అని... టికెట్స్ బుక్(Tickets Booking) చేయరు. రేపో మాపో వెళ్తాం అనే సమయానికి టికెట్స్ బుక్ చేద్దామని చూస్తారు. ప్రయాణం దగ్గరయ్యే కొద్ది.. టికెట్ ధరలు ఎక్కువ అవుతుంటాయి. ఆ విషయాన్ని కచ్చితంగా గమనించాలి. అందుకే వెళ్లడం కంటే చాలా రోజులు ముందే.. టికెట్ బుక్ చేసుకుంటే మంచిది. కావాలంటే మీరు ఒకసారి ఆ విషయాన్ని పరిశీలించి చూడండి.
కొన్ని ఎయిర్ లైన్స్ లో కూడా టికెట్స్ ధరలు(Tickets Price) తక్కువగా ఉంటాయి. వాటిని పరిశీలించి.. టికెట్స్ బుక్ చేసుకోండి. వీకెండ్స్, ప్రత్యేకమైన రోజుల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. ఆ రోజుల్లో ప్రయాణం చేస్తే.. టికెట్ ధర ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.