Writer Padmabhushan Tickets : బడ్జెట్ ధరలో రైటర్ పద్మభూషణ్ సినిమా టికెట్స్
Writer Padmabhushan Ticket Price : కలర్ ఫొటో సినిమాతో హీరోగా సుహాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అది థియేటర్లలోకి రాలేదు.. కానీ ఓటీటీలో విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే టికెట్ల ధరలపై మేకర్స్ నుంచి ఓ ప్రకటన వచ్చింది.
సుహాస్(Suhas) నటించిన రైటర్ పద్మభూషణ్(Writer Padmabhushan) ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి.. మేకర్స్ ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ స్క్రీన్‌లకు సరసమైన ధరలను నిర్ణయించారు.
సింగిల్ స్క్రీన్లకు రెండు రాష్ట్రాల్లో రూ.110 చెల్లించొచ్చు. మల్టీప్లెక్స్(multiplex)లలో సినిమా చూడటానికి రూ.150 ధరగా నిర్ణయించారు. వీటిలో జీఎస్టీ ధరలు ఉన్నాయి. టిక్కెట్ ధర బడ్జెట్ పరిమితుల్లో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఫ్యామిలీతో సినిమాకు వెళ్లాలంటే.. టికెట్ రేట్లు బడ్జెట్ లో ఉండాలిగా మరి అంటూ మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాకు సంబంధించి.. ప్రీమియర్ షోలు.. విజయవాడ(Vijayawada), గుంటూరు, భీమవరం, కాకినాడలో ఏర్పాటు చేయగా.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఫిబ్రవరి 2, 2023న హైదరాబాద్‌లో ప్రధాన మల్టీప్లెక్స్‌లలో సినిమా ప్రీమియర్ షోల కోసం బుకింగ్‌లు తెరవనున్నారు.
కలర్ ఫోటో చిత్రంతో ఓవర్ నైట్ హీరోగా ఎదిగిపోయాడు యాక్టర్ సుహాస్. తనదైన శైలి యాక్టింగ్‌తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా నేషనల్ అవార్డు కూడా రావడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు సుహాస్. ఇప్పటికే రైటర్ పద్మభూషణ్ సినిమా ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
రైటర్ పద్మభూషణ్ సినిమా(Writer Padmabhushan Cinema) చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సుహాస్ చెప్పాడు. 'సినిమా అంతా చాలా ఉత్కంఠగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌కు అందరూ కనెక్ట్ అవుతారు. రైటర్ పద్మభూషణ్ కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాడు. ఇందులో మూడు, నాలుగు ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్‌లో ఇంకా మంచి ట్విస్టు ఉంటుంది. ప్రతి మలుపును ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.' అని సుహాస్ తెలిపాడు.
టాపిక్