Chanakya Niti Telugu। జీవితంలో మీకు తిరుగులేకుండా ఉండాలంటే, ఈ సూత్రాలు పాటించాలి!
Chanakya Niti Telugu: మీ మార్గంలో ఎదురయ్యే ఏదైనా కష్టాన్ని జయించాలంటే ఆచార్య చాణక్యూడు మూడు చిట్కాలు చెప్పాడు. వాటిని పాటిస్తే, మీరు తలపెట్టిన ఏ కార్యమైనా, అవలీలగా పూర్తి చేయగలరు.
Chanakya Niti Telugu: పురాతన భారతీయ తత్వవేత్త, పండితుడు అయినటువంటి ఆచార్య చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం ఎంతో ప్రఖ్యాతిగాంచినది. ఆయన తన గ్రంథంలో జీవితానికి సంబంధించి, మనుషులకు సంబంధించి ఎన్నో అంశాలను ఎంతో గొప్పగా వివరించారు. మీరు జీవితంలో ఏ పని పూర్తి చేయలేకపోతుంటే.. మిమ్మల్ని మీరు అసమర్థులుగా భావిస్తుంటే, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకోలేకపోతే వాటికి కూడా చాణక్యుడి నీతి శాస్త్రంలో పరిష్కార మార్గాలను చూపాడు, ఏదైనా పని పూర్తి చేసేందుకు ప్రేరణ కలిగించే సూత్రాలను తెలియజేశాడు.
కొన్నిసార్లు, మనం ఎంత ప్రయత్నించినా అనుకున్నది సాధించలేము, అప్పజెప్పిన పనులను విజయవంతంగా పూర్తి చేయలేము. అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, మీ మార్గంలో ఎదురయ్యే ఏదైనా కష్టాన్ని జయించాలంటే ఆచార్య చాణక్యూడు మూడు చిట్కాలు చెప్పాడు. వాటిని పాటిస్తే, మీరు తలపెట్టిన ఏ కార్యమైనా, అవలీలగా పూర్తి చేయగలరు. మరి చాణక్య నీతి చెప్పిన ఆ కాలాతీత సూత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. విజ్ఞానం సంపాదించాలి
చాణక్యుడి ప్రకారం, ఏ వ్యక్తి వద్దనైనా ఉండేటువంటి తిరుగులేని ఆయుధం విజ్ఞానం. ఎంతటి భయంకరమైన అడ్డంకులు ఎదురైనా, వాటిని అధిగమించడానికి విజ్ఞానం ఒక శక్తివంతమైన ఆయుధమని చాణక్యుడు నొక్కి చెప్పాడు. జ్ఞానాన్ని మించిన స్నేహితులు లేరని చెబుతారు. విజ్ఞానవంతుడు ఒప్పు , తప్పులను వివేకంతో ఆలోచిస్తాడు. ఏం చేస్తే సరైనదో అతడికి తెలుసు. కాబట్టి తనకున్న విజ్ఞానంతో తాను చేయవలసిని పనిని సమర్థవంతగా పూర్తి చేయగలడు, ఏదైనా సాధించగలడు. కాబట్టి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానం అనేది వ్యక్తులకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, విజయానికి దారితీసే చర్యలు చేపట్టడానికి అవకాశం ఇస్తుంది.
2. విజయం కోసం మానవ ప్రయత్నం చేయాలి
జ్ఞానం విజయానికి మార్గం సుగమం చేసినట్లే, విజయం సాధించడం వ్యక్తికి సమాజంలో గౌరవం, గుర్తింపును తెస్తుంది అలాగే అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విజయంతో సాధించిన ఈ గౌరవం మన జీవితాంతం ఉంటుంది. జ్ఞానం నుండి పొందిన విజయం మనల్ని ముందుకు నడిపించే అమూల్యమైన ఆస్తి. విజ్ఞానం, విజయంల కలయిక మనిషికి సంతృప్తికరమైన, గౌరవప్రదమైన జీవితానికి తలుపులు తెరుస్తుందని చాణక్యుడు మనకు గుర్తు చేస్తాడు. కాబట్టి చివరి వరకు విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి, ఓడిపోతామని భయపడవద్దు, చివరి వరకు ఆశను కోల్పోవద్దు అని చాణక్యుడు చెబుతాడు.
3. ధర్మాన్ని పాటించడం
ధర్మాన్ని, ధర్మమార్గాన్ని నిలబెట్టడం ప్రాముఖ్యతను చాణక్యుడు నొక్కి చెప్పాడు. సంపద కంటే ధర్మం విలువైనదని నమ్మాడు. ధర్మం మనకు జీవితంలో మార్గనిర్దేశం చేయడమే కాకుండా మరణం తర్వాత కూడా మనతోనే ఉంటుంది, మన గౌరవాన్ని పెంచుతుంది. ధర్మానికి కట్టుబడి ఉండడంలో మనం ఎప్పుడూ రాజీపడకూడదు. చాణక్యుడు ప్రకారం, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడమే అసలైన విజయం. మీరు ఏ కార్యం చేపట్టినా సరే, అంకితభావంతో, ధర్మానికి అనుగుణంగా చేసినపుడు, అది సమర్థవంతంగా పూర్తవుతుంది. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది, మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది. కాబట్టి, ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించాలి. దీని వల్ల విజయం మాత్రమే కాదు, పుణ్య కర్మల ఫలాలు కూడా లభిస్తాయి.
సంబంధిత కథనం
టాపిక్