Cauliflower Pakoda: క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడీ ఇలా చేయండి, నోరూరిపోవడం ఖాయం-cauliflower pakoda recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cauliflower Pakoda: క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడీ ఇలా చేయండి, నోరూరిపోవడం ఖాయం

Cauliflower Pakoda: క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడీ ఇలా చేయండి, నోరూరిపోవడం ఖాయం

Haritha Chappa HT Telugu
Apr 15, 2024 05:30 PM IST

Cauliflower Pakoda: ఎప్పుడూ పకోడీలు ఒకేలా చేస్తే ఏం బాగుంటుంది? కాలీఫ్లవర్‌తో ఇలా క్రిస్పీగా చేసి చూడండి రుచిగా ఉంటాయి.

కాలీఫ్లవర్ పకోడి
కాలీఫ్లవర్ పకోడి

Cauliflower Pakoda: సాయంత్రమైతే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఎక్కువ మంది తినేది పకోడీలే. ఎప్పుడూ ఒకేలా చేస్తే పకోడీలు బోర్ కొడతాయి. క్రిస్పీగా కాలీఫ్లవర్ తో చేసి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం కూడా చాలా సులువు. జస్ట్ 20 నిమిషాల్లో వీటిని చేసేయొచ్చు.

కాలీఫ్లవర్ పకోడీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కాలీఫ్లవర్ ముక్కలు - ఒక కప్పు

శెనగపిండి - ఒక కప్పు

వెల్లుల్లి పొడి - ఒక స్పూను

కారం - ఒక స్పూను

ఉప్పు - అర స్పూను

మిరియాల పొడి - పావు స్పూను

నీళ్లు - సరిపడినన్ని

నూనె - డీప్ ఫ్రై చేయించడానికి సరిపడా

కాలీఫ్లవర్ క్రిస్పీ పకోడీ రెసిపీ

1. కాలీఫ్లవర్ ను మరీ పెద్ద ముక్కలు కాకుండా అలానే చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి.

2. వాటిని ఒక గిన్నెలో వేసి శనగపిండి, వెల్లుల్లి పొడి, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

3. అందులో సరిపడా నీళ్లు వేసి కలుపుకోవాలి.

4. కాస్త వంట సోడా వేసి కలుపుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోవాలి.

7. నూనె వేడెక్కాక ఈ కాలీఫ్లవర్ ను అందులో వేసి వేయించుకోవాలి.

8. మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయిస్తే ఇవి క్రిస్పీగా వేగిపోతాయి. అంతే కాలిఫ్లవర్ పకోడీ రెడీ అయినట్టే.

పిల్లలకు ఈ క్రిస్పీ కాలీఫ్లవర్ పకోడీ చాలా నచ్చుతుంది. దీన్ని ఇష్టంగా తింటారు. సాంబారు చేసుకున్నప్పుడు కూడా ఇది జతగా బావుంటుంది. ఒక్కసారి వీటిని చేసి చూడండి. మీకు నచ్చడం ఖాయం. సాయంత్రం పూట స్నాక్‌గా ఉపయోగపడుతుంది. రుచిలో దీనికి సాటి లేదు.

WhatsApp channel

టాపిక్