ఈ వేసవిలో రోజూ సోడా తాగుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Mar 29, 2024
Hindustan Times Telugu
వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం ఉంటుందని చాలా మంది సోడాలు తాగుతుంటారు. వీటిని ఎక్కువగా తీసుకుంటే... దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
image credit to unsplash
కృత్రిమ స్వీట్‌తో తయారు చేసిన సోడాలను తాగడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
image credit to unsplash
ఎక్కువ మోతాదులో కృత్తిమ సోడాలను తీసుకుంటే...కిడ్నీ వ్యాధి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
image credit to unsplash
సోడాకు బదులుగా నీరు, సహజ సిద్ధమైన పండ్ల రసాలు తాగడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు.
image credit to unsplash
సోడా లాంటి చక్కెర పానీయాలు క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందన మారిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.
image credit to unsplash
ప్రతిరోజూ సోడా తాగడం అనేది కాలేయం పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
image credit to unsplash
సోడాలలో కెఫిన్ కూడా అధికంగానే ఉంటుంది. దీని తాగడం వల్ల నిద్రలేమి సమస్య రావచ్చు. ముఖ్యంగా సాయంత్రం పూట సోడా తాగితే ప్రశాంతమైన నిద్రకు దూరమవుతారు