విటమిన్ సీ లోపం వల్ల వచ్చే సమస్య ఏంటి? తినాల్సిన ఫుడ్స్ ఏవి?
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Apr 27, 2024
Hindustan Times Telugu
శరీరంలో విటమిన్ సీ తక్కువగా ఉంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ విటమిన్ లోపం ఉంటే రోగ నిరోధక శక్తి బలహీన పడుతుంది. తద్వారా రోగాల బారిన తరచూ పడే ప్రమాదం పెరుగుతుంది. చర్మ సమస్యలు కూడా పెరగొచ్చు.
Photo: Pexels
అందుకే శరీరంలో సరిపడా విటమిన్ సీ ఉండడం చాలా ముఖ్యం. శరీరానికి విటమిన్-సీ అందించే కొన్ని రకాల ఫుడ్స్ ఇవి.
Photo: Pexels
నారింజ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఈ విటమిన్ శరీరానికి బాగా అందుతుంది. ఆరెంజ్‍తో పాటు చీని లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది.
Photo: Pexels
స్ట్రాబెర్రీల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. రుచికరంగా ఉండటం పాటు వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
Photo: Pexels
అరటి పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. పొటాషియం, ఫైబర్ కూడా ఈ పండులో ఉంటాయి.
Photo: Pexels
విటమిన్-సీ క్యాప్సికంలోనూ అధికంగా ఉంటుంది. ఇది తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి.
Photo: Pexels
బ్రకోలీలోనూ విటమిన్ సీ మెండుగా ఉంటుంది. కేల్, క్యాలిఫ్లవర్‌లోనూ ఈ విటమిన్ లభిస్తుంది.
Photo: Pexels
ఇటీవలి కాలంలో రాగులు ఎక్కువగా తింటున్నారు. వీటితో రోగనిరోధక శక్తితోపాటుగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.