Mango Peel Tea: ప్రతిరోజూ మామిడి తొక్కతో టీ కాచుకుని తాగండి, మధుమేహం అదుపులోకి రావడం ఖాయం
Mango Peel Tea: మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు మామిడి తొక్క టీను ప్రయత్నించండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
Mango Peel Tea: వేవవి కాలం వచ్చేసింది. కాబట్టి మార్కెట్లో మామిడికాయలు పండ్లు సందడి చేస్తూ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు తీయటి మామిడి పండ్లు అధికంగా తినకూడదు. అయితే ఆ మామిడి పండ్ల తొక్కలతో టీ ని కాల్చుకొని తాగితే మాత్రం ఎంతో ఆరోగ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అది అమృతంలా పనిచేస్తుంది. కాబట్టి మామిడిపండ్ల తొక్కలను తీసి పడేయకుండా అవి శుభ్రంగా కడిగి టీ కాచుకొని ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకోండి. కొన్ని రోజుల్లోనే మీకు ఆరోగ్యంలో ఎన్నో మార్పులు వస్తాయి.
మామిడి తొక్క టీ ఎలా చేయాలి?
మామిడి తొక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గ్లాసుడు నీళ్లు వేయాలి. ఆ గ్లాసులో ఈ మామిడి తొక్కలను వేసి చిన్న మంట మీద మరిగించాలి. అలా బాగా మరుగుతున్న కొద్దీ మామిడి తొక్కలోని సారమంతా నీటిలో కలుస్తుంది. అప్పుడు స్టవ్ కట్టేయాలి. దాన్ని వడకట్టి ఆ నీటిని గ్లాసులో వేయాలి. అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకొని తాగాలి. తేనె కలపకపోయినా ఫరవాలేదు, అది కాస్త చేదు, వగరు రుచిని కలిగి ఉంటుంది. అలా తాగితేనే ఆరోగ్యం. ఆ రుచి తట్టుకోలేం అనుకున్న వారు తేనె కలుపుకొని తాగితే మంచిది.
మామిడి తొక్క టీ ఎందుకు?
మామిడి తొక్కలో పాలీఫినాన్స్, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిని తాగడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి కూడా రాదు. అలాగే ఇన్సులిన్ నిర్వహణలో సహాయపడే మ్యాంగిఫెరిన్ అనే సమ్మేళనం కూడా మామిడి తొక్కలో ఉంటుంది. కాబట్టి ఈ మామిడి తొక్కతో చేసే టీ తాగడం వల్ల చక్కె స్థాయిలు అదుపులో ఉంటాయి.
మామిడి తొక్కలోని తంతువులలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర శోషణ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. అలాగే భోజనం తర్వాత కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా అడ్డుకునే శక్తి దీనికి ఉంది. కాబట్టి మామిడి తొక్కల టీని ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి అన్ని విధాలా మేలే చేస్తుంది.
మామిడి తొక్క టీ ని ఇతర పానీయాలతో పోలిస్తే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి మీరు ప్రతిరోజూ రెండుసార్లు తాగినా కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ వ్యక్తులు కచ్చితంగా తాగాల్సిన టీ ఇది.
మామిడి తొక్క టీ తాగడం వల్ల డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో అదనపు చక్కెరలు, కేలరీలు పెరగకుండా ఉంటాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. మొత్తం ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది.
మామిడి తొక్కల పొడి
మామిడి తొక్కలను ఎండబెట్టి పొడిలా చేసుకుంటే. ఆ పొడి తో కూడా టీ చేసుకోవచ్చు. వేసవిలో మూడు నెలలు మాత్రమే మామిడికాయలు దొరుకుతాయి. ఆ సమయంలో మామిడి తొక్కలను సేకరించి వాటిని ఎండలో ఎండబెట్టి పొడి చేసుకుని ఒక గాలి చొరబడని డబ్బాలో దాచుకోవాలి. చల్లటి ప్రదేశంలో ఆ డబ్బాను ఉంచితే ఇవి ఎక్కువ రోజులు పాటు తాజాగా ఉంటాయి. వేడి నీళ్లలో ఈ పొడిని కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇది ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలే చేస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.
టాపిక్